హోమ్ /వార్తలు /బిజినెస్ /

Power Islanding Systems: పవర్ గ్రిడ్‌లకు పటిష్ట భద్రత.. కొత్త టెక్నాలజీపై దృష్టి పెట్టామన్న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి

Power Islanding Systems: పవర్ గ్రిడ్‌లకు పటిష్ట భద్రత.. కొత్త టెక్నాలజీపై దృష్టి పెట్టామన్న కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి

విద్యుత్ సంస్కరణలపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ గ్రిడ్‌ల భద్రత కోసం పవర్ ఐలాండ్ సిస్టమ్‌ను మోహరించనున్నట్లు తెలిపింది. పవర్ గ్రిడ్‌ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి వివిధ నగరాల్లో పవర్ ఐలాండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ చెప్పారు.

ఇంకా చదవండి ...

  విద్యుత్ సంస్కరణలపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యుత్ గ్రిడ్‌ల భద్రత కోసం పవర్ ఐలాండ్ సిస్టమ్‌ను మోహరించనున్నట్లు తెలిపింది. పవర్ గ్రిడ్‌ వంటి మౌలిక సదుపాయాలపై సైబర్, ఉగ్ర దాడులను ఎదుర్కోవటానికి వివిధ నగరాల్లో పవర్ ఐలాండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ చెప్పారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గత ఏడాది పవర్ గ్రిడ్‌ పనితీరులో అంతరాలను నిపుణులు గుర్తించారు. దీనికి సైబర్ దాడి కారణం కావచ్చని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇలాంటి సమస్యలతో పాటు బయటి దాడులను నిరోధించేందుకు పవర్ ఐలాండ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది.

  భారతదేశంలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్న బెంగళూరు, గుజరాత్ జామ్ నగర్ వంటి నగరాలను ఈ వ్యవస్థ పనితీరును పరిశీలించేందుకు ఎంచుకుంటున్నట్లు రాజ్ కుమార్ సింగ్ గురువారం పార్లమెంటుకు తెలిపారు. న్యూ ఢిల్లీ, ముంబైలలో ప్రస్తుతం ఉన్న వ్యవస్థలను కూడా పునరుద్ధరిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకు అవసరమైన ఉత్పత్తి, నిల్వ సామర్థ్యాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్రాలు ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి తెలిపారు. మైక్రోగ్రిడ్లు బ్యాటరీ, సౌర విద్యుత్ మిశ్రమంతో నడుస్తాయని చెప్పారు.

  పవర్ ఐలాండింగ్ సిస్టమ్ అనేది విద్యుత్ వ్యవస్థలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం. గ్రిడ్‌లో ఏదైనా అంతరాయాన్ని గుర్తించినప్పుడు.. విద్యుత్ వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా వేరుచేయడాన్ని పవర్ ఐలాండింగ్ సిస్టమ్ అంటారు. దీని వల్ల పవర్ గ్రిడ్‌లు కుప్పకూలకుండా నియంత్రించవచ్చు. ఈ సిస్టమ్‌ను ప్రధాన నెట్‌వర్క్‌కు అనుసంధానిస్తారు. దీని పనితీరులో ఏదైనా అనుకోని అవాంతరం లేదా అంతరాయం ఏర్పడితే.. గ్రిడ్ దానంతట అదే ప్రధాన నెట్‌వర్క్ నుంచి డిస్‌కనెక్ట్ అవుతుంది.

  అయితే ఈ సాంకేతికను అన్ని నగరాలకు విస్తరించడం సాధ్యమయ్యే పని కాదని కొందరు నిపుణులు చెబుతున్నారు. పవర్ ఐలాండ్స్‌ను సృష్టించడం అనేది కొత్త టెక్నాలజీ కాదంటున్నారు ఇండియా స్మార్ట్ గ్రిడ్ ఫోరం అధ్యక్షుడు రెజి పిళ్లై. దీనికి తోడు కొత్త తరం ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి బెంగళూరులో తగినంత స్థలం లేదని చెబుతున్నారు. పవర్ ఐలాండ్‌కు బదులుగా.. వాణిజ్య, పారిశ్రామిక సముదాయాలు, ఆసుపత్రులు, షాపింగ్ మాల్స్, రక్షణ యూనిట్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో స్మార్ట్ మైక్రోగ్రిడ్లను ఏర్పాటు చేయాలని పిళ్లై సిఫార్సు చేస్తున్నారు.

  ఇది చూడండి...

  ఇది చూడండి...

  First published:

  Tags: Latest Technology

  ఉత్తమ కథలు