హోమ్ /వార్తలు /బిజినెస్ /

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదంపై కేంద్రం సీరియస్.. కంపెనీలకు వార్నింగ్

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాల ప్రమాదంపై కేంద్రం సీరియస్.. కంపెనీలకు వార్నింగ్

ఎలక్ట్రిక్ వాహనాల ఫైర్ యాక్సిడెంట్లపై నితిన్ గడ్కరీ సీరియస్

ఎలక్ట్రిక్ వాహనాల ఫైర్ యాక్సిడెంట్లపై నితిన్ గడ్కరీ సీరియస్

Electric Vehicle Accidents: ఏదైనా కంపెనీ తమ ప్రక్రియలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ జరిమానా విధించబడుతుందని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు.

గత రెండు నెలలుగా ఎలక్ట్రిక్ స్కూటర్లకు సంబంధించిన అనేక సంఘటనలు చోటుచేసుకోవడంపై కేంద్రం సీరియస్ అయ్యింది. ప్రమాదాలపై నిపుణుల కమిటీ విచారణ జరుపుతుందని కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) తెలిపారు. ఒకవేళ ఈ విచారణలో కంపెనీల లోపాలు ఉన్నట్టు తేలితే భారీ జరిమానాలు, ఇతర చర్యల తీసుకుంటామని హెచ్చరించారు. గత రెండు నెలల్లో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు(Electric Vehicles) సంబంధించిన అనేక ప్రమాదాలు వెలుగులోకి రావడం.. ఈ ఘటనల్లో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడటం అత్యంత దురదృష్టకరమని గడ్కరీ అన్నారు.

ఈ సంఘటనలపై విచారణ, నివారణ చర్యలపై సిఫార్సులు చేయడానికి నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. ఈ నెల ప్రారంభంలో ఓలా ఇ-స్కూటర్(Ola Electric Scooter) మంటల్లో చిక్కుకున్న వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. దీనిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. స్టార్టప్ ప్యూర్ ఈవీకి చెందిన స్కూటర్ కూడా మంటల్లో చిక్కుకోవడం ఆందోళన కలిగించింది. ఒకినావా ఆటోటెక్ ప్రైవేట్ బైక్ దగ్ధమై ఇద్దరు వ్యక్తులు మరణించారు.

ఈ ఘటనలపై దర్యాప్తు చేస్తున్నామని కంపెనీలు చెబుతున్నాయి. నివేదికల ఆధారంగా తాము డిఫాల్ట్ చేసిన కంపెనీలపై అవసరమైన ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. త్వరలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం నాణ్యత, ఇతర అంశాలపై మార్గదర్శకాలను జారీ చేస్తామని తెలిపారు. ఏదైనా కంపెనీ తమ ప్రక్రియలలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భారీ జరిమానా విధించబడుతుందని కేంద్రమంత్రి గడ్కరీ చెప్పారు.

Car Launches: నెక్సాన్ ఈవీ నుంచి లేటెస్ట్ ఎర్టిగా వరకు.. ఈ ఏడాది లాంచ్ కానున్న టాప్ కార్స్ ఇవే..

Reliance Retail: 'హ్యాండ్‌మేడ్ ఇన్ ఇండియా' ప్రోగ్రామ్ ప్రకటించిన రిలయన్స్ రీటైల్

లోపాలు ఉన్న అన్ని వాహనాలను రీకాల్ చేయడానికి ఆదేశాలు జారీ చేస్తామని అన్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఈ విష‌యంలో కచ్చితమైన చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి గడ్కరీ కంపెనీలను కోరారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు, మోటార్‌ బైక్‌లలో 2 శాతం అమ్మకాల స్థాయి నుంచి 2030 నాటికి మొత్తం ద్విచక్ర వాహనాల అమ్మకాల్లో 80 శాతానికి చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను స్థానికంగా తయారు చేసేందుకు ప్రభుత్వం భారీ ప్రోత్సాహకాలను అందిస్తోంది.

First published:

Tags: Electric Vehicles, Nitin Gadkari

ఉత్తమ కథలు