Home /News /business /

CENTRE CUT CORPORATE TAX GIVE BOOST TO SENSEX AND NIFTY OF INDIAN STOCK MARKET AK

Stock market: కార్పొరేట్ పన్ను తగ్గించిన కేంద్రం... దూసుకెళ్లిన సెన్సెక్స్, నిఫ్టీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్రం కార్పొరేట్ పన్ను తగ్గించాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకోవడంతో స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.

    తీవ్ర ఒడిదొడుకుల్లో కొట్టుమిట్టాడుతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ ఒక్కసారిగా భారీ లాభాల్లోకి దూసుకెళుతున్నాయి. ఆర్థిక మాంద్యం తరహా పరిస్థితులతో పాటు దేశీయంగా ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా వెళుతుండటంతో కేంద్రం రంగంలోకి దిగింది. వివిధ రంగాలకు ఊతమిచ్చే ప్రయత్నంలో భాగంగా కేంద్రం కార్పొరేట్ పన్నును తగ్గించడం స్టాక్ మార్కెట్లలో కొత్త ఉత్సాహం నింపింది. కార్పొరేట్ పన్ను తగ్గింపును 22 శాతానికి ప్రతిపాదిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిర్ణయం తీసుకోవడం స్టాక్ మార్కెట్లకు సానుకూల సంకేతాలు వెళ్లేలా చేశాయి.

    కేంద్రం నిర్ణయంతో అప్పటివరకు ఫ్లాట్‌గా ట్రేడ్ అవుతున్న దేశీ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. సెన్సెక్స్ 900 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్లకు పైగా లాభాల్లోకి దూసుకెళ్లాయి. జీఎస్టీ కౌన్సిల్‌లోనూ కేంద్రం కార్పొరేట్లకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటే మార్కెట్లు మరింత పైపైకి ఎగబాకే అవకాశాలు కనిపిస్తున్నాయాయి.




    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Corporate tax, Stock Market

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు