Home /News /business /

CENTRE CLARIFIES ON RECOGNIZING CRYPTOCURRENCY BITCOIN AS A CURRENCY FINANCE MINISTER NIRMALA SITARAMAN ANSWER IN PARLIAMENT AK GH

Bitcoin: బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించడంపై కుండబద్ధలు కొట్టిన కేంద్రం.. క్రిప్టోకరెన్సీపై క్లారిటీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CryptoCurrency ఓవైపు క్రిప్టోకరోన్సీలను బ్యాన్​ చేస్తూనే సొంత డిజిటల్​ కరెన్సీని తీసుకొచ్చే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తీసుకొచ్చిన విధంగా ఇక్కడ కూడా డిజిటల్​ కరెన్సీని తీసుకురావాలని యోచిస్తోంది.

దేశంలో క్రిప్టోకరెన్సీలను ప్రభుత్వం బ్యాన్​ చేయనుందనే ఊహాగానాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ కీలక ప్రకటన చేశారు. ఇవాళ పార్లమెంట్‌లో బిట్‌కాయిన్‌పై ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ‘‘దేశంలో బిట్‌కాయిన్‌ను కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద లేదు. బిట్‌కాయిన్​ లావాదేవీలపై ప్రభుత్వం డేటాను సేకరించడం లేదు.” అని తెలిపారు. దేశంలో బిట్​కాయిన్​ను​ కరెన్సీగా గుర్తించే ప్రతిపాదన ప్రభుత్వం వద్ద ఉందా? లేదా? అనే ప్రశ్నకు.. లేదు అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ సమాధానం చెప్పారు.

కాగా, ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే క్రిప్టోకరెన్సీ రెగ్యులేషన్ ఆఫ్ అఫీషియల్ డిజిటల్ కరెన్సీ బిల్లు–2021ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఆర్‌బీఐ జారీ చేసే అధికారిక డిజిటల్ కరెన్సీని అనుమతించేటప్పుడు అంతర్లీన సాంకేతికతను ప్రోత్సహించడానికి కొన్ని ప్రైవేట్ క్రిప్టోకరెన్సీలను మినహాయించి అన్నింటిని నిషేధించేలా ఈ బిల్లును రూపొందిస్తోంది. ఇదే జరిగితే కేవలం ఒకటి రెండు మినహా అన్ని క్రిప్టోకరెన్సీలు మన దేశంలో బ్యాన్​ కానున్నాయి.

పార్లమెంట్​ సమావేశాల్లో క్రిప్టో బిల్లు..
గత కొంత కాలంగా భారత్​లో క్రిప్టో మార్కెట్​ వేగంగా విస్తరిస్తోంది. కరోనా తర్వాత వీటిలో పెట్టుబడులు అమాంతం పెరిగిపోయాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మన దేశంలోనే అత్యధికంగా 10 కోట్ల మంది క్రిప్టో లావాదేవీలు జరుపుతున్నారు. 2020 జూలై నుంచి 2021 జూన్​ వరకు అంటే ఇక్క ఏడాది కాలంలోనే భారత్​లో క్రిప్టో వృద్ధి ఏకంగా 641 శాతం పెరిగింది. ఇక్కడ కేవలం ఏడాది కాలంలో 572.5 బిలియన్​ డాలర్ల విలువైన క్రిప్టో ట్రాన్సాక్షన్లు జరిగాయి. గ్లోబల్​ వాల్యూలో ఇది 14 శాతం ఉండటం గమనార్హం. అయితే, 2018లోనే భారత్​ క్రిప్టోను నిషేధించింది. 2020 మార్చి నెలలో సుప్రీం కోర్డు క్రిప్టోలపై నిషేధాన్ని ఎత్తివేసింది. దీంతో ఇన్వెస్టర్లలో ఆశలు చిగురించాయి. కానీ కేంద్రం తీసుకొస్తున్న కొత్త బిల్లుతో వారి ఆశలు అడియాశలయ్యాయి.

Telangana: ఢిల్లీ నుంచి వచ్చి సైలెంట్ అయిన KCR.. కొత్త ప్లాన్‌.. ఆ తరువాతే అమలు చేస్తారా ?

KCRను మళ్లీ టెన్షన్ పెడుతున్న ఈటల రాజేందర్.. అజ్ఞాతంలోకి ఆ నాయకుడు ?

Salt: మీరు వాడే ఉప్పు మంచిదేనా ? ఇలా చెక్ చేసుకోండి.. చాలా ముఖ్యం

Health Tips: మీరు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారా ? వెంటనే ఈ కూరగాయలకు దూరంగా ఉండండి

త్వరలోనే సొంత డిజిటల్​ కరెన్సీ
ఓవైపు క్రిప్టోకరోన్సీలను బ్యాన్​ చేస్తూనే సొంత డిజిటల్​ కరెన్సీని తీసుకొచ్చే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తీసుకొచ్చిన విధంగా ఇక్కడ కూడా డిజిటల్​ కరెన్సీని తీసుకురావాలని యోచిస్తోంది. చైనా తన సొంత డిజిటల్​ కరెన్సీని ప్రవేశపెట్టనున్నందున.. ఇక్కడ కూడా సొంత డిజిటల్​ కరెన్సీని ప్రవేశపెట్టాలని ఆర్​బీఐ యోచిస్తోది. దీని కోసం ఇప్పటికే ఫ్రేమ్​ వర్క్​ను రూపొందించే పనిలో పడింది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే దీనికి సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టనుంది.
Published by:Kishore Akkaladevi
First published:

Tags: Bitcoin, Cryptocurrency, Nirmala sitharaman

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు