Home /News /business /

CENTRAL RAILWAYS MAKES OVER RS 100 CRORE FROM TICKETLESS TRAVELERS GH VB

Railway Zone: టికెట్ లేని ప్రయాణికుల నుంచి.. ఎన్ని రూ. కోట్లు వసూలు చేశారో తెలుసా..

రైల్వే ప్రయాణికులు

రైల్వే ప్రయాణికులు

Central Railway Zone: టికెట్ తీసుకోని ప్రయాణిలకు రైల్వే శాఖ భారీ జరిమానాలు విధిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు మధ్య కాలంలో టికెట్ లేని ప్రయాణికుల నుంచి సెంట్రల్ రైల్వే జోన్ జరిమానా రూపంలో రూ.100.82 కోట్లు ఆర్జించింది.

టికెట్ తీసుకోని ప్రయాణిలకు రైల్వే శాఖ భారీ జరిమానాలు విధిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబరు మధ్య కాలంలో టికెట్ లేని ప్రయాణికుల నుంచి సెంట్రల్ రైల్వే జోన్ జరిమానా రూపంలో రూ.100.82 కోట్లు ఆర్జించింది. సెంట్రల్ రైల్వే జోన్ (Central Railway Zone) పరిధిలో టికెట్ లేకుండా ప్రయాణించిన 17 లక్షల మంది నుంచి ఈ మొత్తం వసూలు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి మాస్కులు లేకుండా ప్రయాణిస్తున్న 28,816 మంది ప్రయాణికుల నుంచి సెంట్రల్ రైల్వే రూ.26 లక్షల జరిమానా వసూలు చేసింది. రైల్వే టికెట్ బుకింగ్ కార్యాలయాల వద్ద కరోనా నిబంధనలు ఉల్లంఘించడం, రైళ్లలో ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయడం (Covid-19 approriate behaviour) ద్వారా 29,019 మంది నిబంధనలు ఉల్లింఘించినట్టు రైల్వే అధికారులు గుర్తించారు.

RBI Circular: ఆర్​బీఐ కీలక నిర్ణయం.. కస్టమర్లకు, బ్యాంకులకు కీలక ఆదేశాలు..


ఇక సబర్బన్ రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న 46,5000 మంది ప్రయాణికుల నుంచి సెంట్రల్ రైల్వే రూ.17.73 కోట్ల జరిమానా వసూలు చేసింది. ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుంచి కళ్యాణ్, కర్జాత్, కాసర, పాన్వల్, థానే, వాసీ మధ్య తిరిగే సబర్బన్ రైళ్లలో టికెట్ లేకుండా తిరిగే ప్రయాణీకుల నుంచి ఈ మొత్తం వసూలు చేశారు.

Wife: నా భర్తను విడిచిపెట్టండంటూ.. తన కొడుకుతో అడవి బాట పట్టిన భార్య.. ఏం జరిగిందంటే..


సెంట్రల్ రైల్వే జోన్‌లోని బుసావర్ డివిజన్ రూ.33.74 కోట్లతో జరిమానాల వసూళ్లతో మొదటి స్థానంలో, ముంబై డివిజన్ రూ.33.20 కోట్ల జరిమానాల వసూళ్లతో రెండో స్థానంలో నిలిచిందని సెంట్రల్ రైల్వే జోన్ పబ్లిక్ రిలేషన్స్ చీఫ్ ఆఫీసర్ శివాజీ షుటర్ తెలిపారు. సబర్బన్, నాన్ సబర్భన్ రైళ్లలో ప్రయాణిస్తూ మార్గదర్శకాలు ఉల్లింఘించిన వారి నుంచి ముంబై డివిజన్లో రూ.33.20 కోట్లు వసూలు చేసినట్టు ఆయన చెప్పారు.

డిసెంబర్ 2, 2021 పెళ్లి ముహూర్తం.. కాబోయే భర్త ఆమెతో ఆ ఒక్క మాట అన్నాడు.. ముగింపు ఊహించలేకపోయాడు..


‘‘ప్రయాణికులు కోవిడ్-19 నిబంధనలు పాటిస్తున్నారా లేదా అని చూడాల్సిన బాధ్యత మాకుంది. ప్రయాణాలు చేసే వారి ద్వారా ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించడం మా బాధ్యత. కొందరు టికెట్ లేకుండా ప్రయాణించడం, క్యాబ్ నిబంధనలు ఉల్లంఘించడం వంటి నేరాలకు పాల్పడుతున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు టికెట్ లేని ప్రయాణాలను అరికట్టడానికి విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాం’’ అని సెంట్రల్ రైల్వే పబ్లిక్ రిలేషన్స్ చీఫ్ ఆఫీసర్ శివాజీ షుటర్ తెలిపారు.

Nallamala Tourism: నల్లమల టూరిజం ప్యాకేజీ.. పెద్ద పులులతో పాటు.. నల్లమల అందాలను చూసే విధంగా ఏర్పాట్లు..


ఆగస్టు నుంచి లోకల్ రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య బాగా పెరిగింది. ప్రస్తుతం వ్యాక్సిన్ తీసుకున్న వారిని మాత్రమే లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు భారతీయ రైల్వే అనుమతిస్తోంది. లోకల్ రైళ్లలో ప్రయాణించాలనుకునే వారు రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ చూపిన తరువాత పాసులు పొందాల్సి ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: Indian Railway, Railway passengers

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు