హోమ్ /వార్తలు /బిజినెస్ /

Family Pension: ఫ్యామిలీ పెన్షన్ కావాలంటే ఏం చేయాలి? తెలుసుకోండి

Family Pension: ఫ్యామిలీ పెన్షన్ కావాలంటే ఏం చేయాలి? తెలుసుకోండి

Family Pension: ఫ్యామిలీ పెన్షన్ కావాలంటే ఏం చేయాలి? తెలుసుకోండి
(ప్రతీకాత్మక చిత్రం)

Family Pension: ఫ్యామిలీ పెన్షన్ కావాలంటే ఏం చేయాలి? తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

Family Pension | జీవిత భాగస్వామికి ఫించనుదారుతో ఉమ్మడి ఖాతా లేకపోతే కుటుంబ పెన్షన్ కోసం సీసీఎస్ నిబంధనల్లో సూచించిన విధంగా ఫారం-14లోని పెన్షనర్ లేదా మరణించిన ప్రభుత్వోద్యోగి కుటుంబ సభ్యులు పత్రాలు అదనంగా పొందవచ్చు.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఫించన్ వస్తుందనే సంగతి అందరికి తెలిసిందే. వారు మరణిస్తే ఆ పెన్షన్ ఫ్యామిలీ పెన్షన్ గా వారి జీవిత భాగస్వామికి వస్తుంది. అయితే ఈ కుటుంబ ఫించను (Family Pension) లబ్దిదారులు చాలా మంది పెన్షన్ అందుకోవడంలో జాప్యం జరుగుతోంది. ఈ సమస్యను పరిశీలించి బ్యాంకుల్లో సమయాన్ని తగ్గించి కుటుంబంలో జీవిత భాగస్వామికి ఫించన్ అందించేందుకు పెన్షన్ అకౌంటింగ్ కార్యాలయం మరోసారి ప్రకటన జారీ చేసింది. పెన్షన్ చెల్లింపు కోసం సులభమైన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఫించనుదారు ఫార్మాట్లతో పాటు సమర్పించాల్సిన కొన్ని కీలక పత్రాల గురించి తెలుసుకోవడం ముఖ్యం.

సీసీఎస్ పెన్షన్(రూల్స్)-1981 ప్రకారం "అధికార బ్యాంకుల ద్వారా కేంద్ర ప్రభుత్వ సివిల్ ఫించనుదారులకు పెన్షన్ చెల్లించే పథకం"లోని పేరాగ్రాఫ్ 24లో ఉన్న కుటుంబ పెన్షన్ చెల్లింపుల కోసం సులభమైన విధానాన్ని పొందుపరిచింది. కుటుంబ పెన్షన్ ఫించను చెల్లింపు, పీపీఓలో సూచించిన వ్యక్తికి కింద పేర్కొన్న డాక్యుమెంట్ల ద్వారా బ్యాంకుల నుంచి పేమెంట్ లభిస్తుంది.

EPFO: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త... కొత్త వడ్డీ రేటు ఎంతంటే

BSNL Broadband Plans: ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకుంటున్నారా? కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్స్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్

జీవిత భాగస్వామికి ఫించనుదారుతో ఉమ్మడి ఖాతా ఉంటే


-కుటుంబ పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తు

- ఫించనుదారు మరణ ధ్రువీకరణ పత్రానికి చెందిన కాపీ

-అతడు లేదా ఆమె వయస్సు/పుట్టినతేదీ రుజువు(80 ఏళ్ల లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వచ్చిన తర్వాత వచ్చే అదనపు ఫించను నియంత్రించడానికి పుట్టిన తేదీ అవసరం).

-అతడు/ఆమె అర్హత లేని మొత్తానికి లేదా అతడు/ఆమె అర్హత ఉన్న మొత్తానికి మించి వారి ఖాతాకు జమ అయ్యే మొత్తాన్ని తిరిగి చెల్లించడం

జీవిత భాగస్వామికి ఫించనుదారుతో ఉమ్మడి ఖాతా లేకపోతే


జీవిత భాగస్వామికి ఫించనుదారుతో ఉమ్మడి ఖాతా లేకపోతే కుటుంబ పెన్షన్ కోసం సీసీఎస్ నిబంధనల్లో సూచించిన విధంగా ఫారం-14లోని పెన్షనర్ లేదా మరణించిన ప్రభుత్వోద్యోగి కుటుంబ సభ్యులు పత్రాలు అదనంగా పొందవచ్చు. సీపీసీసీకి చెందిన అన్ని అభ్యర్థనలు, నిబంధనల ప్రకారం బ్యాంకు శాఖ చేత సమయం తగ్గించి, పెన్షన్ ను జీవిత భాగస్వామి పేరుపై ఫ్యామిలీ పెన్షన్ గా మార్చాల్సి వస్తే పీపీఓల్లో సహా అధీకృతం చేసే నిబంధన ఇప్పటికే అందుబాటులో ఉంది. దీన్ని ఫించన్ల ఛీఫ్ కంట్రోలర్ అనుమతిస్తారు.

IRCTC Tour: పూరీ, కోణార్క్ వెళ్తారా? ఐదు రోజుల టూర్ ప్యాకేజీ రూ.5,250 మాత్రమే

SBI: మీకు ఎస్‌బీఐ అకౌంట్ ఉందా? బ్యాంకుకు వెళ్లకుండానే ఈ సర్వీస్ పొందొచ్చు

ఇటీవల కుటుంబ ఫించను పరిమితిని రూ.45,000 నుంచి రూ.1,25,000ల వరకు పెంచారు. అతడు లేదా ఆమె మరణం తర్వాత వారి పిల్లలు అర్హత సాధించినట్లయితే రెండు ఫించన్లు తీసుకునేందుకు అనుమతించే మొత్తంపై పెన్షనర్ వెల్ఫేర్ విభాగం(DoPPW) వివరణ ఇచ్చింది. కుటుంబ ఫించన్ల మొత్తాన్ని ఇప్పుడు నెలకు రూ.1,25,000లకు పరిమితం చేశామని స్పష్టం చేసింది. ఇది మునుపటి కంటే రెండున్నర రెట్లు ఎక్కువ.

సెంట్రల్ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్-1972లోని నిబంధన-54, సబ్-రూల్ (11) ప్రకారం, భార్య, భర్త ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులై ఈ రూల్ నిబంధనల ప్రకారం అర్హత ఉంటే, వారి మరణం తరువాత వారి పిల్లలకు తల్లిదండ్రులకు సంబంధించిన రెండు కుటుంబ పెన్షన్లకు అర్హులవుతారు. ఇలాంటి కేసులలో రెండు కుటుంబ పెన్షన్లు నెలకు రూ .45,000, రూ .27,000 మించరాదని మునుపటి సూచనలు సూచించాయి, ఇవి వారి వేతనంలో వరుసగా 50 శాతం, 30 శాతం చొప్పున నిర్ణయించబడ్డాయి. 6వ సీపీసీ సిఫార్సుల ప్రకారం ఈ మొత్తం అత్యధికంగా 90,000 రూపాయలుగా నిర్దేశించారు.

అయితే 7వ వేతన సంఘం సిఫార్సులు అమలు చేసిన తర్వాత అత్యధికంగా నెలకు రూ.2,50,000లుగా నిర్ణయించారు. అందువల్ల సీపీఎస్ ఫించను నిబంధన 54(11)లో సూచించిన మొత్తాన్ని రూ.1,25,000లను సవరించారు. ఇది 2,50,000ల్లో 50 శాతం అంటే 1,25,000లు. 30 శాతం సొమ్ము అయిన రూ.75,000లు అందుకునే అవకాశముంది.

First published:

Tags: Pension Scheme, Pensioners

ఉత్తమ కథలు