• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • CENTRAL MINISTER GADKARI SAYS TOLL BOOTHS IN THE COUNTRY WILL BE REMOVED BY ONE YEAR HERE FULL DETAILS NS

ఏడాదిలోగా టోల్ ప్లాజాలను ఎత్తేస్తాం.. కేంద్ర మంత్రి గడ్కరీ సంచలన ప్రకటన

ఏడాదిలోగా టోల్ ప్లాజాలను ఎత్తేస్తాం.. కేంద్ర మంత్రి గడ్కరీ సంచలన ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని అన్ని టోల్ ప్లాజాలను ఏడాదిలోగా ఎత్తేస్తామని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ రోజు లోక్ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు.

  • Share this:
    కేంద్ర రవాణా, హైవేల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ ఈ రోజు కీలక ప్రకటన చేశారు. మ‌రో ఏడాది లోగా దేశంలోని మొత్తం టోల్ ప్లాజాలు మొత్తం ఎత్తేస్తామని ప్రకటించారు. గురువారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జీపీఎస్ ఆధారిత టోల్ సేక‌ర‌ణ చేప‌డ‌తామ‌ని ఆయన తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 93 శాతం వాహనాలు ఫాస్టాగ్ వాడుతున్నాయన్నారు. మిగిలిన 7 శాతం వాహ‌నాల‌కు రెట్టింపు టోల్ వేసినా కూడా ఇంకా ఫాస్టాగ్ తీసుకోలేద‌ని చెప్పారు. వాహ‌నాల‌పై ఉండే జీఎపీఎల్ ఇమేజింగ్ ద్వారా టోల్ సేక‌రిస్తామని గ‌డ్కరీ వెల్ల‌డించారు. ఫాస్టాగ్ ద్వారా టోల్ చెల్లించని వాహనాలపై పోలీసు విచారణకు ఆదేశించినట్లు గడ్కరీ తెలిపారు. వాహనాలకు ఫాస్టాగ్ లేక పోతే టోల్ దొంగతనం, జీఎస్టీ ఎగవేత లాంటి ఘటనలు చోటుచేసుకుంటాయని వివరించారు. ఫిబ్రవరి 16 నుండి ఫాస్టాగ్ లేని వాహనాలకు డబుల్ టోల్ ఫీజు చెల్లించాలన్న నిబంధన అమలవుతోందని తెలిపారు.

    ఇదిలా ఉంటే.. మీ వద్ద 15 ఏళ్లకు పైబడిన పాత వాహనం ఉందా?.. అయితే, మీకో బ్యాడ్​ న్యూస్​. ఎందుకంటే, 15 ఏళ్ల పైబడిన పాత వాహనాల ఆర్​సీ రెన్యువల్​, ఫిట్​నెస్​ సర్టిఫికేట్ ఛార్జీలను భారీగా పెంచుతూ కేంద్ర రోడ్డు రావాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్​ జారీ చేసింది. ఇకపై, 15 ఏళ్లు పైబడిన వాహనాల ఆర్​సీ రెన్యువల్​కు రూ.5,000 చెల్లించాల్సి ఉంటుంది. అంటే, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజుకు 8 రెట్లు ఎక్కువ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాక, ఆర్​సీ రెన్యువల్​ ఆలస్యం చేసే వారిపై కూడా భారీ జరిమానాలతో కొరడా ఝుళిపించనుంది. ఇకపై, ప్రైవేట్ వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్​లో ఆలస్యం చేస్తే, నెలకు రూ .300 నుండి 500 రూపాయల జరిమానా వసూలు చేయనుంది.

    ఒకవేళ, వాణిజ్య వాహనాలకు ఫిట్​నెస్ సర్టిఫికేట్ రెన్యువల్​ ఆలస్యం చేస్తే రోజువారీగా రూ .50 జరిమానా విధించనుంది. అదేవిధంగా, 15 ఏళ్ల కంటే పాత ద్విచక్ర వాహనాల ఆర్​సీ రెన్యువల్​ ఫీజును రూ.300 నుంచి రూ .1000కి పెంచనుంది. పాత బస్సు లేదా ట్రక్కు ఫిట్‌నెస్ రెన్యువల్​​ కోసం రూ .12,500 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇది, ప్రస్తుతం అమల్లో ఉన్న ఫీజు కంటే దాదాపు 21 రెట్లు ఎక్కువ అని చెప్పవచ్చు. కాగా, 2‌021 అక్టోబర్​ 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. వాహన స్క్రాపేజ్​ విధానాన్ని రూపొందించే ప్రణాళికలో భాగంగా రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఈ పెంపును ప్రతిపాదించినట్లు తెలుస్తోంది.
    Published by:Nikhil Kumar S
    First published: