అన్ని రకాల చిన్న పొదుపు ఖాతాలపై వడ్డీ రేట్లను భారీగా తగ్గిస్తూ మునుపటి ఆర్థిక సంవత్సరం చివరి రోజు అనగా మార్చి 31న తీసుకున్న నిర్ణయంపై కేంద్రం వెనక్కు తగ్గింది. తొలుత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్‌ఎస్‌సీ) వంటి చిన్న పొదుపు పథకాల్లో వడ్డీ రేట్లను 40 నుంచి -110 బేసిస్ పాయింట్ల మేరకు తగ్గింపును సూచించిన ప్రభుత్వం 24 గంటల్లోనే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. 2020–21 చివరి త్రైమాసికంలో ఉన్న వడ్డీ రేట్లే వచ్చే త్రైమాసికంలో కూడా యాథాతథంగా కొనసాగుతాయని, తగ్గింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటున్నామని, పొరపాటున ఈ ఆదేశాలు జారీ అయ్యాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు. కాగా, వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని 24 గంటల్లోనే వెనక్కి తీసుకోవడం చర్చనీయాంశమైంది. దేశంలో నాలుగు రాష్ట్రాలు, 1 కేంద్ర పాలిత ప్రాతంలో జరుతున్న ఎన్నికల నేపథ్యంలో మధ్యతరగతి ఓటర్లపై ఈ నిర్ణయం పెద్ద ప్రభావాన్నే చూపుతుందని భావించిన కేంద్రం వెంటనే యూజర్న్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనప్పటికీ, ఈ నిర్ణయం మధ్యతరగతి ప్రజలకు ఊరటనిచ్చిందనే చెప్పవచ్చు. కాగా, కేంద్రం తొలుత విడుదల చేసిన ఆర్డర్స్ ప్రకారం.. పీపీఎఫ్ పై వడ్డీ రేటు 7.1 శాతం నుండి 6.4 శాతానికి తగ్గించగా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్స్, మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్రా వడ్డీరేట్లను వరుసగా 6.5%, 5.7%, 5.9%, 6.2% వేరకు తగ్గించింది. ఒకవేళ ఈ వడ్డీ రేట్లు అమల్లోకి వస్తే 1974 నుండి అమలవుతున్న వడ్డీ రేట్లలో ఇదే అత్యల్పం అయ్యేది.
Special Trains: తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు... 66 స్పెషల్ ట్రైన్స్ జాబితా ఇదే
IRCTC Shimla Tour: షిమ్లాకు హనీమూన్ వెళ్లాలా? హైదరాబాద్ ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే
సాధారణంగా, చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరించబడతాయి. ఇవి బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లను అనుగుణంగా ఉంటాయి. కాగా, వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవడంతో 2021–22 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో కూడా పాత వడ్డీ రేట్లే కొనసాగనున్నాయి. ఏడాదిలోపు సేవింగ్స్ డిపాజిట్లపై 4 %, ఏడాది నుంచి మూడేళ్లలోపు సేవింగ్స్ డిపాజిట్లపై 5.5 %, ఐదేళ్ల సేవింగ్స్ డిపాజిట్లపై 6.7 %, ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్(ఆర్డీ)పై 5.8 %, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌పై 7.4 %, మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ 6.6 %, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌పై 6.8%, పీపీఎఫ్‌పై 7.1%, కిసాన్ వికాస్ పాత్రపై 6.9%, సుకన్య సమృద్ధి అకౌంట్‌పై 7.6% వడ్డీ రేట్లు లభిస్తాయి. కాగా, ఈ వడ్డీ రేట్లు 2021 ఏప్రిల్1 నుంచి 30 వరకు అమల్లో ఉండనున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Personal Finance, PPF, Save Money, Sukanya samriddhi yojana