హోమ్ /వార్తలు /బిజినెస్ /

Toll Plaza: ఇక టోల్ ప్లాజాలు ఉండవు.. సరికొత్త విధానానికి సిద్ధమవుతున్న కేంద్రం!

Toll Plaza: ఇక టోల్ ప్లాజాలు ఉండవు.. సరికొత్త విధానానికి సిద్ధమవుతున్న కేంద్రం!

Toll Plaza

Toll Plaza

Toll Plaza: ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చినా కొన్ని నగరాల్లో టోల్ ప్లాజా వద్ద రద్దీ తగ్గట్లేదు. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్రం సిద్ధమైంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

టోల్ ప్లాజాల (Toll Plazas) వద్ద తీవ్రమైన రద్దీ నెలకొనడం వల్ల వాహనదారులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చినా కొన్ని నగరాల్లో టోల్ ప్లాజా వద్ద రద్దీ తగ్గట్లేదు. అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రం ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్‌గా సరికొత్త ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్‌ (Automatic Number Plate Recognition System)ను అమలు చేయనుంది. టోల్ ప్లాజాలు తొలగించేసి వాటి స్థానంలో ఈ వ్యవస్థను తీసుకొస్తున్నామని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) మంగళవారం తెలిపారు. దీనికి సంబంధించిన పైలట్ ప్రాజెక్టులను ప్రారంభిస్తామని చెప్పారు.

సరికొత్త ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్‌ ద్వారా వాహన యజమానుల బ్యాంక్ అకౌంట్‌ నుంచి ఆటోమేటిక్‌గా టోల్ ఫీజు కలెక్ట్ అవుతుంది. దీనివల్ల కరెక్ట్‌గా టోల్ వసూలు చేయడం సాధ్యమవుతుందని, అలానే వాహనదారులకు చాలా సమయం ఆదా అవుతుందని నితిన్ గడ్కరీ అన్నారు. మైండ్‌మైన్ శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడుతూ, ఫాస్టాగ్స్‌ పరిచయం చేశాక నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) టోల్ వార్షిక ఆదాయం రూ.15,000 కోట్లు పెరిగిందని పేర్కొన్నారు.

ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్న ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ సిస్టమ్‌ త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుందన్నారు. ఆ సమయం నుంచి వాహనదారులకు టోల్ ప్లాజాల వద్ద వేచి చూడాల్సిన అవసరం రాదన్నారు. ఈ ఆటోమొబైల్ నంబర్ ప్లేట్ టెక్నాలజీలో ఆటోమేటిక్‌గా నంబర్ ప్లేట్ రీడ్ చేసే రీడర్ కెమెరాలు ఉంటాయని.. ఇది అందుబాటులోకి వస్తే దేశంలో ఎక్కడా టోల్ ప్లాజాలు కనిపించవన్నారు.

* కేంద్రం మదిలో 2 ఆప్షన్స్

ప్రభుత్వం టోల్ ఫీజు సేకరించడానికి 2 ఆప్షన్లను పరిశీలిస్తోంది. అందులో ఒకటి శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్. ఈ వ్యవస్థను అమలు చేయడానికి జీపీఎస్ (GPS)ను అన్ని కార్లలో అందిస్తారు. జీపీఎస్ ద్వారా టోల్ నేరుగా ప్రయాణికుల బ్యాంక్ అకౌంట్ నుంచి డిడక్ట్ అవుతుంది. శాటిలైట్ ఆధారిత టోల్ సిస్టమ్‌ను ఫాస్టాగ్స్‌కి బదులుగా తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు నితిన్ గడ్కరీ గత నెలలో తెలిపారు.

ఇది కూడా చదవండి : ఆ స్కీమ్‌లో ఉన్నవారికి షాక్... అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్

ఈ ఆప్షన్స్‌లో మరొకటి నంబర్ ప్లేట్ సిస్టమ్. ఈ నంబర్ ప్లేట్‌ టెక్నాలజీ కూడా తమ వద్ద అందుబాటులో ఉందని గడ్కరీ వెల్లడించారు. నంబర్ ప్లేట్ టెక్నాలజీ ప్రవేశపెట్టాక టోల్ ప్లాజాలు ఉండవని.. వాటి స్థానంలో అడ్వాన్స్‌డ్‌ కంప్యూటరైజ్డ్ డిజిటల్ సిస్టమ్ ఉంటుందని చెప్పుకొచ్చారు. దీని ద్వారా క్యూలలో వేచి ఉండాల్సిన ఇబ్బందులు తొలగిపోతాయని వివరించారు.

* ఫాస్టాగ్స్‌తో తగ్గిన వెయిటింగ్ పీరియడ్

2018-19లో టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు సగటు 8 నిమిషాలు పాటు వెయిట్ చేయాల్సి వచ్చేది. అయితే 2020-21, 2021-22లో ఫాస్టాగ్స్‌ తీసుకురావడంతో ఆ వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతం 47 సెకన్లకు తగ్గింది. అంటే ఎంత సమయం ఆదా అయిందో అర్థం చేసుకోవచ్చు. అయినా కూడా కొన్ని ప్రదేశాలలో ఫాస్టాగ్స్‌ ఉన్నా కూడా అంతగా ప్రయోజనం ఉండటం లేదు. ఎందుకంటే నగరాలకు సమీపంలోని టోల్ ప్లాజాల్లో ఆలస్యం నెలకొని ఉంది. ఇక రద్దీ సమయాల్లో కూడా టోల్ ప్లాజాల వద్ద కొంత ఆలస్యం జరుగుతోంది. కాగా కొత్తగా తీసుకురానున్న సిస్టమ్‌తో రద్దీ ఎంత ఉన్నా సరే ఆలస్యం అస్సలు జరగదు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Central Government, FASTag, Nitin Gadkari, Toll plaza

ఉత్తమ కథలు