ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలోని (PM Kisan Scheme) రైతులకు గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ పథకానికి చెందిన 11వ ఇన్‌స్టాల్‌మెంట్‌ను ఇంకొన్ని గంటల్లో విడుదల చేయనుంది. సుమారు 11 కోట్లకు పైగా రైతుల అకౌంట్లలోకి రూ.2,000 చొప్పున జమ చేయనుంది ప్రభుత్వం. రైతులు పీఎం కిసాన్ స్కీమ్ 11వ ఇన్‌స్టాల్‌మెంట్ (PM Kisan 11th Installment) కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మొదటి వాయిదా ఇది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతులకు ప్రతీ ఏటా రూ.2,000 చొప్పున మూడు వాయిదాల్లో రూ.6,000 జమ చేస్తోంది.
పీఎం కిసాన్ స్కీమ్ ద్వారా రైతులు డబ్బులు పొందాలంటే ఇకేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. కాబట్టి రైతులు ఇకేవైసీ ప్రాసెస్ పూర్తి చేయాలి. ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మరి లబ్ధిదారులు తమకు పీఎం కిసాన్ స్కీమ్ డబ్బులు వచ్చాయో లేదో ఇలా చెక్ చేయొచ్చు.
లబ్ధిదారుల వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే పీఎం కిసాన్ డబ్బులు జమ కావు. గతంలో అనేక సందర్భాల్లో ఇదే జరిగింది. లబ్ధిదారులు సమర్పించిన డాక్యుమెంట్లలో, బ్యాంకు అకౌంట్లలో పేర్లు వేర్వేరుగా ఉండటం లేదా ఇతర కారణాలతో డబ్బులు రావు. అందుకే వివరాలు తప్పుగా ఉంటే సరిచేసుకోవడం అవసరం. ఇందుకోసం ఈ స్టెప్స్ ఫాలో కావాలి.
Step 1- పీఎం కిసాన్ స్కీమ్ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ఓపెన్ చేయాలి.
Step 2- Updation of Self Registered Farmer పైన క్లిక్ చేయాలి.
Step 3- ఆధార్ నెంబర్, ఇమేజ్ కోడ్ ఎంటర్ చేయాలి.
Step 4- సెర్చ్ చేస్తే వివరాలు కనిపిస్తాయి.
Step 5- వివరాలు అన్నీ పూర్తిగా చెక్ చేయాలి.
Step 6- తప్పులు ఉంటే ఎడిట్ చేయాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.