Home /News /business /

CENTRAL GOVERNMENT TO PLANS TO REDUCE GOODS AND SERVICES TAX SLABS AND INCREASE TAX SS

GST Slabs: త్వరలో ప్రజలకు మరో షాక్... కొత్త శ్లాబ్‌తో పెరగనున్న పన్నులు

GST Slabs: త్వరలో ప్రజలకు మరో షాక్... కొత్త శ్లాబ్‌తో పెరగనున్న పన్నులు
(ప్రతీకాత్మక చిత్రం)

GST Slabs: త్వరలో ప్రజలకు మరో షాక్... కొత్త శ్లాబ్‌తో పెరగనున్న పన్నులు (ప్రతీకాత్మక చిత్రం)

GST Slabs | త్వరలో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (GST) శ్లాబ్స్ తగ్గనున్నాయి. నాలుగు శ్లాబ్స్ స్థానంలో మూడు శ్లాబ్స్ రానున్నాయి. ఒక శ్లాబ్‌ను తొలగించే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం.

    సామాన్యులకు త్వరలో మరో షాక్ తగలనుంది. ఇప్పటివరకు చెల్లిస్తున్న పన్నులు ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్‌ను (GST) రాబోయే రెండేళ్లలో పెంచాలని, శ్లాబ్స్ సంఖ్య కూడా తగ్గించాలని ఆలోచిస్తోంది. ఇది పన్ను వసూళ్లను పెంచడానికి తోడ్పడుతుందని, ఇప్పటికే 17 నెలల గరిష్ట స్థాయి 6.95 శాతం వద్ద ఉన్న ద్రవ్యోల్బణాన్ని (Inflation) తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిర్ణయంతో నిత్యావసర వస్తువుల ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం జీఎస్‌టీలో 5 శాతం, 12 శాతం, 18 శాతం, 28 శాతం శ్లాబ్స్ ఉన్నాయి. 18 శాతం శ్లాబ్‌లో 480 రకాల వస్తువులు ఉన్నాయి. ఈ ఒక్క శ్లాబ్ నుంచే 70 శాతం జీఎస్‌టీ వసూళ్లు వస్తాయని అంచనా.

    ప్రస్తుతం ఉన్న నాలుగు శ్లాబ్స్‌ని మూడుకు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. 12 శాతం, 18 శాతం శ్లాబ్స్ మధ్య 15 శాతం శ్లాబ్స్ తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఇక 5 శాతం శ్లాబ్ స్థానంలో 6 శాతం లేదా 7 శాతం శ్లాబ్ రానుంది. ఇక ఎక్కువగా ఉన్న 28 శ్లాబ్‌ను అలాగే ఉంచనుంది. కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్న మార్పులు జరిగితే 6 నుంచి 7 శాతం మొదటి శ్లాబ్, 15 శాతం రెండో శ్లాబ్, 28 శాతం మూడో శ్లాబ్ ఉంటుంది. ఈ ప్రతిపాదనల్ని మే మూడో వారంలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పరిశీలించవచ్చు.

    Old Currency Notes: పాత కరెన్సీ నోట్లు ఉన్నవారికి అలర్ట్... ఆర్‌బీఐ కీలక సూచనలు

    జీఎస్టీ రేటు హేతుబద్ధీకరణపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని మంత్రుల బృందం ఏప్రిల్ చివరి నాటికి నివేదిక రూపొందించనుంది. ఇక జీఎస్‌టీ వసూళ్ల విషయానికి వస్తే ఆర్థిక పునరుద్ధరణ , నకిలీ బిల్లర్లపై చర్యలు, పన్నుల ఎగవేతల్ని నిరోధించే డ్రైవ్‌ల కారణంగా మార్చి 2022లో జీఎస్‌టీ వసూళ్లు రూ.1,42,095 కోట్లకు చేరాయి. జీఎస్‌టీ అమలు చేసిననాటి నుంచే ఇదే ఆల్ టైమ్ హై కావడం విశేషం. అంతకన్నా ముందు జనవరిలో రూ.1,40,986 కోట్ల జీఎస్‌టీ వసూలు చేసింది కేంద్ర ప్రభుత్వం.

    Aadhaar Card: ఆధార్ కార్డ్ మర్చిపోతే సింపుల్‌గా ఇలా డౌన్‌లోడ్ చేయండి

    కేంద్ర ప్రభుత్వం 5 శాతం శ్లాబ్ స్థానంలో 6 శాతం లేదా 7 శాతం శ్లాబ్ తీసుకొస్తే ఇప్పటి వరకు 5 శాతం శ్లాబ్‌లో ఉన్న వస్తువుల ధరలు పెరగనున్నాయి. ప్రస్తుతం 5 శాతం జీఎస్‌టీ శ్లాబ్‌లో వంట నూనెలు, మసాలాలు, టీ, కాఫీ, చక్కెర, స్వీట్స్, కాజు, ఫర్టిలైజర్స్, క్యాబ్ సర్వీసెస్, ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్, టూర్ ఆపరేటర్ సేవల్లాంటివి ఉన్నాయి. అంటే వీటిపై 2 శాతం వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: GST, GST Council

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు