Insurance: త్వరలో 3 ఇన్స్యూరెన్స్ కంపెనీల విలీనం... కేబినెట్‌కు ప్రతిపాదన పంపిన ఆర్థిక శాఖ

Insurance Companies merger | నేషనల్ ఇన్స్యూరెన్స్, ఓరియెంటల్ ఇండియా ఇన్స్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీల విలీనం చేసే ప్రతిపాదనను కేబినెట్‌కు పంపింది ఆర్థిక శాఖ.

news18-telugu
Updated: October 7, 2019, 4:55 PM IST
Insurance: త్వరలో 3 ఇన్స్యూరెన్స్ కంపెనీల విలీనం... కేబినెట్‌కు ప్రతిపాదన పంపిన ఆర్థిక శాఖ
Insurance: త్వరలో 3 ఇన్స్యూరెన్స్ కంపెనీల విలీనం... కేబినెట్‌కు ప్రతిపాదన పంపిన ఆర్థిక శాఖ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: October 7, 2019, 4:55 PM IST
ఈ మధ్య ప్రభుత్వ బ్యాంకుల విలీనం వార్తలు తరచూ వింటూనే ఉన్నాం. బ్యాంకులు మాత్రమే కాదు... త్వరలో ప్రభుత్వ ఇన్స్యూరెన్స్ కంపెనీలు కూడా విలీనం కానున్నాయి. నేషనల్ ఇన్స్యూరెన్స్, ఓరియెంటల్ ఇండియా ఇన్స్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీలను ప్రభుత్వం విలీనం చేసే ఆలోచనలో ఉంది. ఈ మూడు కంపెనీలను కలిపి ఒకే కంపెనీగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మూడు ప్రభుత్వ ఇన్స్యూరెన్స్ కంపెనీలు విలీనమైతే భారతదేశంలోనే అతిపెద్ద ఇన్స్యూరెన్స్ కంపెనీగా మారుతుంది. ఇన్స్యూరెన్స్ కంపెనీలన్నింటి ప్రీమియం లెక్కేస్తే ఈ మూడు కంపెనీల ప్రీమియం 25 శాతం ఉంటుంది. నేషనల్ ఇన్స్యూరెన్స్, ఓరియెంటల్ ఇండియా ఇన్స్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీల విలీనం చేసే ప్రతిపాదనను కేబినెట్‌కు పంపింది ఆర్థిక శాఖ.

మూడు ప్రభుత్వ రంగ బీమా కంపెనీలను విలీనం చేసే సమయంలో రూ.12,500 కోట్లను ప్రభుత్వం ఇచ్చే అవకాశముంది. ఈ నిధుల ద్వారా ఇన్స్యూరెన్స్ కంపెనీ మరింత బలోపేతం అయ్యే అవకాశముంది. వాస్తవానికి 2018-19 బడ్జెట్‌లోనే నేషనల్ ఇన్స్యూరెన్స్, ఓరియెంటల్ ఇండియా ఇన్స్యూరెన్స్, యునైటెడ్ ఇండియా ఇన్స్యూరెన్స్ కంపెనీలను విలీనం చేయాలన్న ప్రతిపాదన ఉన్నా కాగితాలకే పరిమితమైంది. ప్రస్తుతం ఫైల్ కేబినెట్ దగ్గరకు చేరింది. కేబినెట్ ఆమోదించగానే వీటి విలీన ప్రక్రియ మొదలవుతుంది.

Redmi 8A: నాచ్ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో రెడ్‌మీ 8ఏ... ఎలా ఉందో చూడండి





ఇవి కూడా చదవండి:

JIO Phone offer: రూ.1500 విలువైన ఫోన్ రూ.699 ధరకే... 2జీ హ్యాండ్‌సెట్ మార్కెట్‌పై కన్నేసిన జియో

Amazon Sale: అమెజాన్‌లో మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్... ఆఫర్స్ ఇవే
Loading...
SAIL Jobs: స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 296 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు తెలుసుకోండి
First published: October 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...