చేతకాకపోతే సంస్థను మూసేయండి... బీఎస్ఎన్‌ఎల్‌కి కేంద్రం సూచన

BSNL Issue : బీఎస్ఎన్ఎల్ అనగానే మనందరికీ ఓ ఫీలింగ్. ఎక్కడో గ్రామాల్లో కూడా సిగ్నల్స్ వస్తాయని. కానీ ఆ సంస్థ పోటీని తట్టుకోలేకపోతోంది. నష్టాల్లో కూరుకుపోయింది. అందుకే కేంద్రం సంస్థను మూసేయమని సలహా ఇచ్చింది.

Krishna Kumar N | news18-telugu
Updated: February 13, 2019, 8:14 AM IST
చేతకాకపోతే సంస్థను మూసేయండి... బీఎస్ఎన్‌ఎల్‌కి కేంద్రం సూచన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏదైనా నష్టాల్లో ఉన్న సంస్థను తిరిగి నిలబెట్టాలంటే చాలా కష్టం. ఎన్ని చేసినా, ఎంత చేసినా అది అప్పుల్లోనే ఉంటే... ఇక దాన్ని మూసేయడమే మంచిది. అందులో పెట్టుబడులను వేరే సంస్థల్లోకి మళ్లించడం బెటర్ ఆప్షన్. ఈ దిశగా ఆలోచించమని ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNLకి సూచించింది కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో అత్యంత ఎక్కువ నష్టాల్లో ఉన్నది ఈ సంస్థే. 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.31,287 కోట్ల రూపాయల లాస్‌లో ఉంది. ఈ విషయమై టెలికం సెక్రెటరీ అరుణా సుందరరాజన్... BSNL అధికారులతో సమావేశమై చర్చించిన తర్వాత... ఇక సంస్థను మూసేసుకోవడం బెటరని సూచించారు. ప్రత్యర్థి సంస్థలతో పోటీ, వాలంటరీ రిటైర్మెంట్ స్కీం, ఉద్యోగులకు ముందస్తు రిటైర్మెంట్ ప్లాన్స్ వంటివి BSNL బొక్కబోర్లా పడేలా చేశాయని ఆ సంస్థ ఛైర్మన్ అనుపం శ్రీవాస్తవ తెలిపారు.

bsnl, bsnl plans, bsnl recruitment 2019, bsnl recharge plan, bsnl news, bsnl updates, telecom company, bsnl losses, బీఎస్ఎన్ఎల్, టెలికం న్యూస్,
ప్రతీకాత్మక చిత్రం


BSNLలో ఉన్న మరో సమస్యేంటంటే... అందులోని చాలా మంది ఉద్యోగులు ముసలివారే. వాలంటరీ రిటైర్మెంట్ స్కీం తెచ్చినా వాళ్లు ఉద్యోగాన్ని వదలట్లేదు. రిటైర్మెంట్ ఏజ్‌ను 60 ఏళ్ల నుంచీ 58 ఏళ్లకు తగ్గించాలని సంస్థ కేంద్రాన్ని కోరుతోంది. అలా చేస్తే, 2019-20లో రూ.3,000 కోట్లు ఆదా అవుతాయని చెబుతోంది. ప్రస్తుతం సంస్థలో 56-60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఉద్యోగులు 67,000 మంది ఉన్నారు. రిటైర్మెంట్ ఏజ్‌ను 58 ఏళ్లకు తగ్గిస్తే... వీళ్లలో సగం మందికి రిటైర్మెంట్ ఇచ్చే వీలుంటుంది.

BSNLకి సొంతంగా రూ.15,000 కోట్ల రూపాయల విలువచేసే భవనాలు, భూములూ ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా... నష్టాల నుంచీ బయటపడే మార్గం ఉంది. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటామని సంస్థ చెబుతోంది. 

Video: అమెరికాలో ఐస్ ఏజ్...గడ్డకట్టిన నదులు, సరస్సులు
First published: February 13, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>