హోమ్ /వార్తలు /బిజినెస్ /

Indian Railway: రైల్వే ప్రయాణికులకు కేంద్రం షాక్.. ఆ ఉచిత సేవలు ఇక బంద్.. వివరాలివే

Indian Railway: రైల్వే ప్రయాణికులకు కేంద్రం షాక్.. ఆ ఉచిత సేవలు ఇక బంద్.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కేంద్ర ప్రభుత్వం రైల్వే ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ఆ ఉచిత సర్వీస్ ను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

భారతీయ రైళ్లలో ఫాస్ట్ అండ్ ఫ్రీ ఇంటర్నెట్ సౌకర్యం అందించబోమని తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ట్రైన్‌లలో ఉచిత వై-ఫై ఆధారిత ఇంటర్నెట్ అందించే ప్రాజెక్ట్‌ను భారతీయ రైల్వేశాఖ ఉపసంహరించుకుంది. ఉచిత ఇంటర్నెట్ అందించడం అనేది ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని రైల్వే మంత్రిత్వ శాఖ పార్లమెంట్‌కు తెలియజేసింది. ఈ విషయంపై బుధవారం మాట్లాడిన కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌.. లోక్‌సభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. పైలట్ ప్రాజెక్టుగా హౌరా రాజధాని ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ద్వారా ఉచిత ఇంటర్నెట్ సేవలు అందించినట్లు ఆయన వెల్లడించారు. ఈ టెక్నాలజీ భారీ మూలధనంతో కూడుకున్నదని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ఈ టెక్నాలజీ బ్యాండ్‌విడ్త్ ఛార్జీల రూపంలో పునరావృతమయ్యే ఖర్చులతో కూడుకున్నదని వివరించారు. ఈ రెండు విషయాలను ప్రస్తావిస్తూ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదని స్పష్టం చేశారు.

IRCTC Char-Dham Yatra: చార్‌ధామ్ యాత్రికులకు గుడ్ న్యూస్... ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలివే

రైలు ప్రయాణికులకు ఇంటర్నెట్ బ్యాండ్‌విడ్త్ అవైలబిలిటీ కూడా సరిపోలేదని ఆయన చెప్పుకొచ్చారు. అందువల్ల ప్రాజెక్ట్‌ను తొలగించామని తెలిపారు. ట్రైన్‌లలో వై-ఫై ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించడానికి తక్కువ ఖర్చుతో మంచి ఫలితాలను అందించే టెక్నాలజీ ప్రస్తుతం అందుబాటులో లేదని వెల్లడించారు. ఇక హాల్ట్ రైల్వే స్టేషన్లు మినహా అన్ని రైల్వే స్టేషన్లలో 'వీడియో సర్వైలెన్స్ సిస్టమ్'ను ఏర్పాటు చేసే పనులకు ఆమోదం లభించిందని అశ్వినీ వైష్ణవ్‌ పార్లమెంట్‌కు తెలియజేశారు. ఇప్పటివరకూ 814 రైల్వేస్టేషన్లలో సీసీటీవీలు ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ లతో పాటు ప్యాసింజర్ రైళ్లతో సహా అన్ని కోచ్‌లలో సీసీటీవీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందని, ఇప్పటివరకూ 4,141 కోచ్‌లలో సీసీటీవీలను మార్చామని వెల్లడించారు.

ప్రస్తుతం భారతీయ రైల్వేశాఖ 6,000 కంటే ఎక్కువ రైల్వే స్టేషన్లలో స్వీయ-స్థిరమైన ప్రాతిపదికన జాతీయ ట్రాన్స్‌పోర్టర్ కు ఉచితంగా వై-ఫై సౌకర్యాన్ని అందిస్తోంది. రైల్వే మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వ రంగ సంస్థ అయిన రైల్‌టెల్ సహాయంతో ఈ సౌకర్యాన్ని అందిస్తోంది. 2019లో మాజీ రైల్వే మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. రాబోయే 4 - 4.5 సంవత్సరాలలో ట్రైన్‌లలో వైఫై సేవలను అందించాలని కేంద్రం యోచిస్తున్నట్టు చెప్పారు. కానీ సరైన టెక్నాలజీ లేకపోవడంతో ప్రస్తుతం ప్రభుత్వం ఉచిత ఇంటర్నెట్ ప్రాజెక్టును తొలగించింది.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Indian Railways, IRCTC, Railway passengers

ఉత్తమ కథలు