హోమ్ /వార్తలు /బిజినెస్ /

Business Idea: అద్భుత అవకాశం... కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5,00,000 వరకు ప్రోత్సాహకం... ఈ వ్యాపారం మీరూ ప్రారంభించవచ్చు ఇలా

Business Idea: అద్భుత అవకాశం... కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5,00,000 వరకు ప్రోత్సాహకం... ఈ వ్యాపారం మీరూ ప్రారంభించవచ్చు ఇలా

Business Idea: అద్భుత అవకాశం... కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5,00,000 వరకు ప్రోత్సాహకం... ఈ వ్యాపారం మీరూ ప్రారంభించవచ్చు ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

Business Idea: అద్భుత అవకాశం... కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.5,00,000 వరకు ప్రోత్సాహకం... ఈ వ్యాపారం మీరూ ప్రారంభించవచ్చు ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

Business Idea | తక్కువ పెట్టుబడితో ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకునేవారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వం ఓ మంచి వ్యాపార అవకాశాన్ని (Business Opportunity) ఇస్తోంది. రూ.5,00,000 వరకు ప్రోత్సాహకం కూడా ఇస్తోంది.

ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాలను (PMBJKs) కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేంద్రాల ద్వారా తక్కువ ధరకే పేదలకు నాణ్యమైన మందులు అందిస్తోంది. ఎవరైనా ఈ వ్యాపారం ప్రారంభించే అవకాశం కల్పిస్తోంది. 2022 మే 31 నాటికి దేశంలో 8,735 జన్ ఔషధి కేంద్రాలు (Janaushadhi Kendras) ఉన్నాయి. ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి పరియోజన (PMBJP) ద్వారా 739 జిల్లాలు కవర్ అవుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశవ్యాప్తంగా జన్ ఔషధి కేంద్రాలను పెంచాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 2024 మార్చి నాటికి మొత్తం 10,000 జన్ ఔషధి కేంద్రాలను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు 2014-15 ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమైంది. ఆ ఏడాది రూ.8 కోట్ల వార్షిక టర్నోవర్ సాధిస్తే 2022 మే నాటికి టర్నోవర్ రూ.100 కోట్ల మార్క్ చేరుకోవడం విశేషం. 2021 మే లో టర్నోవర్ రూ.83.77 కోట్లు. ఈ స్కీమ్ ద్వారా పౌరులకు రూ.600 కోట్లు ఆదా అయిందని ప్రభుత్వం చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం జన్ ఔషధి కేంద్రాల ద్వారా ప్రజలకు తక్కువ ధరకే జనరిక్ మెడిసిన్ అందిస్తోంది. జన్ ఔషధి కేంద్రాల్లో మెడిసిన్ బయటి మార్కెట్‌తో పోలిస్తే 50 శాతం నుంచి 90 శాతం తక్కువకే లభిస్తాయి.

Govt Scheme: ఏడాదికి కేవలం రూ.20 చెల్లిస్తే రూ.2 లక్షల బెనిఫిట్... అస్సలు వదులుకోవద్దు

ఫార్మాసూటికల్స్ అండ్ మెడికల్ డివైజెస్ బ్యూరో ఆఫ్ ఇండియా (PMBI) ఆధ్వర్యంలో 1600 పైగా మందులు, 250 పైగా సర్జికల్ డివైజ్‌లు, న్యూట్రాసూటికల్, ఆయుష్ ప్రొడక్ట్స్, సువిధ శానిటరీ ప్యాడ్స్ అమ్ముతోంది. సువిధ శానిటరీ ప్యాడ్ ధర రూ.1 మాత్రమే కావడం విశేషం. దేశంలోని అన్ని జన్ ఔషధి కేంద్రాలకు మెడిసిన్ సరఫరా చేసేందుకు గురుగ్రామ్, చెన్నై, గువాహతి, సూరత్లో వేర్ హౌజెస్ ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 39 డిస్ట్రిబ్యూటర్లు జన్ ఔషధి కేంద్రాలకు మెడిసిన్ సరఫరా చేస్తారు.

తాజాగా కేంద్ర ప్రభుత్వం 406 జిల్లాల్లో 3,579 బ్లాక్స్‌లో జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది కేంద్ర ప్రభుత్వం. చిన్న పట్టణాలు, బ్లాక్స్‌లో కూడా వీటిని ఏర్పాటు చేస్తోంది. ఎవరైనా వీటిని ఏర్పాటు చేయొచ్చు. కేంద్ర ప్రభుత్వం రూ.2,50,000 నుంచి రూ.5,00,000 మధ్య ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంది. ఫర్నీచర్, కంప్యూటర్, ప్రింటర్ లాంటివి కొనడానికి మహిళలకు, దివ్యాంగులకు, ఎస్‌సీ, ఎస్‌టీ వర్గాల వారికి ఒకసారి రూ.2,00,000 ఇన్సెంటీవ్ లభిస్తుంది.

Rs 1 Crore Returns: జీతం వచ్చేసిందా? ఇలా పొదుపు చేస్తే రూ.1 కోటి మీదే

వ్యక్తులు లేదా స్వచ్ఛంద సంస్థలు జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలంటే బీ ఫార్మాసీ, డీఫార్మసీ చదివినవారిని ఉద్యోగులుగా నియమించాల్సి ఉంటుంది. ఎంఆర్‌పీ పైన 20 శాతం లాభం లభిస్తుంది. కనీసం 120 చదరపు అడుగుల స్థలం ఉండాలి. నాన్ రీఫండబుల్ అప్లికేషన్ ఫీజు రూ.5,000 చెల్లించాలి. మరి మీరు కూడా జన్ ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేయాలంటే ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి.

ముందుగా http://janaushadhi.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.

హోమ్ పేజీలో APPLY FOR KENDRA ట్యాబ్ పైన క్లిక్ చేయాలి.

వివరాలన్నీ చదివిన తర్వాత Check Available Location పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత రాష్ట్రం, జిల్లా సెలెక్ట్ చేయాలి.

మీరు ఎంచుకున్న ప్రాంతంలో జన్ ఔషధి కేంద్రం ఏర్పాటు చేసే అవకాశం ఉంటే Click here to Apply పైన క్లిక్ చేయాలి.

ఆ తర్వాత రిజిస్ట్రేషన్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Business Ideas, Business plan, Personal Finance, Small business

ఉత్తమ కథలు