• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • CENTRAL GOVERNMENT REVISED FAME 2 SUBSIDIES ELECTRIC TWO WHEELERS WILL BECOME CHEAPER SS GH

E-Vehicles: భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు... ఎందుకంటే

E-Vehicles: భారీగా తగ్గనున్న ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు... ఎందుకంటే (ప్రతీకాత్మక చిత్రం)

E-Vehicles | కేంద్ర ప్రభుత్వం ఫేమ్ 2 సబ్సిడీ నిబంధనల్ని సవరించింది. దీంతో ఎలక్ట్రిక్ టూ వీలర్ల ధరలు దిగిరానున్నాయి.

  • Share this:
ఇంధన వాహనాల నుంచి విద్యుత్తు వాహనాలవైపు ప్రజలను మళ్లించడానికి కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేసేవారికి ఇన్సెంటివ్‌లను పెంచాలని నిర్ణయంచింది. ఈ మేరకు ఫాస్టర్‌ అడాప్షన్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ఆఫ్‌ (హైబ్రిడ్‌) అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌‌ II (ఫేమ్‌II) స్కీమ్‌లో డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హెవీ ఇండస్ట్రీ (డీహెచ్‌ఐ) మార్పులు చేసింది. దీని వల్ల ఒక్కో ఎలక్ట్రిక్-టూ వీలర్‌ మీద ఇచ్చే ఇన్సెంటివ్‌ రూ.10 వేల నుంచి రూ.15 వేలకు పెరుగుతుంది. ప్రస్తుతానికి ఈ పెంపు తక్కువగా కనిపిస్తున్నా... భవిష్యత్తులో ఈ ఇన్సెంటివ్‌ల్లో ఇంకా మార్పులు ఉంటాయని సమాచారం.

ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మీద ప్రస్తుతం గరిష్ఠంగా 20 శాతం ఇన్సెంటివ్‌ ఇచ్చే అవకాశం ఉంది. స్కీమ్‌లో మార్పులు వల్ల అది 40 శాతానికి పెరిగింది. వివరంగా చెప్పాలంటే ఒక KWH బ్యాటరీ ఉన్న ఈ-టూవీలర్‌ మీద ఇప్పుడు రూ.15 వేలు ఇన్సెంటివ్‌ వస్తుంది. అదే 2 KWH బ్యాటరీ ఉన్న వాహనం మీద రూ.30 వేల ఇన్సెంటివ్‌ వస్తుంది. 3 KWH బ్యాటరీ వేకిల్ మీద రూ.45 వేల ఇన్సెంటివ్‌ వస్తుంది. అయితే దాని ధర రూ.లక్ష నుంచి రూ.1.5 లక్షల వరకు ఉండాలి అనేది నిబంధన. ఇలా అన్ని రకాల ఈ-టూవీలర్‌ల ధరలో మార్పులు కనిపిస్తాయి.

Gold: బంగారు నగలు కొంటున్నారా? రేపటి నుంచి ఈ కొత్త రూల్

Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్ సేల్... ఈ 15 స్మార్ట్‌ఫోన్లపై రూ.6,000 వరకు డిస్కౌంట్

ఈ క్రమంలో ఏథర్ ఎనర్జీ తమ ఎలక్ట్రిక్- టూవీలర్‌ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. కొత్త ఏథర్‌ 450ఎక్స్‌ వాహనంపై రూ.14,500 తగ్గించారు. దీని వల్ల ఆ వాహనం ఇకపై రూ.1,44,500కే లభిస్తుంది. అదే ఏథర్‌ 450 ప్లస్ అయితే రూ.1,25,500కు( బెంగళూరు ఎక్స్‌ షోరూం ధర)కు లభిస్తుంది. మిగిలిన ఈ - టూవీలర్‌ సంస్థలు బజాజ్‌ చేతక్‌, టీవీఎస్‌ ఐక్యూబ్‌, రెవాల్ట్‌, హీరో, ఒకినావా కూడా త్వరలో తమ వాహనాల ధరలు తగ్గిస్తాయని సమాచారం. ఇప్పటివరకు ఫేమ్‌IIలో 76 వేల ఈ - వాహనదారులు లబ్ధి పొందారు. ఇంకా చాలామంది కొత్తగా వాహనాలు తీసుకోవడానికి మొగ్గు చూపుతారని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇదే సమయంలో బ్యాటరీ సైజును బట్టి ఇన్సెంటివ్‌లో తేడాలు ఉండటం వల్ల భారీ బ్యాటరీ ఉన్న వాహనాల కొనుగోలుకు వినియోగదారులు ఆసక్తి చూపిస్తారని భావిస్తున్నారు. ఈ-టూవీలర్‌ తయారీదారులు కూడా భారీ బ్యాటరీ ఉన్న వాహనాలు సిద్ధం చేస్తారు.

Realme X7 Max 5G: రూ.26,999 విలువైన స్మార్ట్‌ఫోన్‌ను రూ.12,399 ధరకే కొనండి ఇలా

ATM Charges: ఏటీఎంలో డబ్బులు డ్రా చేస్తున్నారా? అయితే మీకు షాకే

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల వాహన తయారీదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ-టూవీలర్‌ విభాగంలో ఇదో ఆసక్తికరమైన ఆలోచన అని, మార్కెట్‌కు ఊతమిస్తుందని చెబుతున్నారు. ఫేమ్‌IIలో ఇన్సెంటివ్‌ను పెంచడం ఈ-టూవీలర్‌ విభాగంలో గేమ్‌ ఛేంజర్‌ అవుతుందని భావిస్తున్నారు. ప్రజలు పెట్రోల్‌ ఆధారిత వాహనాలను వీడి... ఈ-టూవీలర్‌ వైపు రావడానికి ఈ నిర్ణయం బాగా ఉపయోగపడుతుందని కంపెనీలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.
Published by:Santhosh Kumar S
First published: