EMI కొనుగోళ్లకు LTC స్కీమ్ వర్తిస్తుందా? తెలుసుకోండి

EMI కొనుగోళ్లకు LTC స్కీమ్ వర్తిస్తుందా? తెలుసుకోండి (ప్రతీకాత్మక చిత్రం)

ఈ పథకం 2020 మార్చి 31 వరకు చెల్లుతుంది. అందుబాటులో ఉన్న LTCకి బదులుగా ఉంటుంది. ఈ పథకం ప్రయోజనాలకు బదులుగా ఓ అధికారి 2021లో ఆ ఏడాదికి చెందిన ఎల్టీసీని పొందవచ్చు.

  • Share this:
2018-21 మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు ప్రయాణ రాయితీ ఛార్జీలకు(LTC) సరిసమానమైన ప్రత్యేక నగదు ప్యాకేజిని ప్రభుత్వ ప్రకటించింది. ఈ పథకం కింద వస్తువులు, సేవలు కొనుగోలు చేసినప్పుడు 12 శాతం అంతకంటే ఎక్కువ జీఎస్టీ తిరిగి చెల్లించడానికి అర్హత పొందుతారు. అయితే EMI ప్రాతిపదికన కొనుగోళ్లు చేసుకోవచ్చా? లాంటి ప్రశ్నలు చాలా మంది ఉద్యోగుల్లో తలెత్తింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఉద్యోగుల్లో తరతూ తలెత్తే ప్రశ్నల(ఫ్రీక్వెంట్లీ ఆస్కెడ్ క్వశ్చన్స్-FAQ)కు సంబంధించి కొన్ని వివరణలను విడుదల చేసింది. 2018-21 సమయంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు LTCలకు సరిసమానమైన ప్రత్యేకమైన నగదు ప్యాకేజిని అక్టోబరు 12న ప్రభుత్వం ప్రకటించింది. ఎల్టీసీ ఛార్జిలకు సరిసమానమై నగదు చెల్లింపులకు ఆదాయ పన్ను మినహాయింపును కూడా పొడిగించింది. కేంద్ర ప్రభుత్వేతర ఉద్యోగులకు కూడా ఆ తర్వాత అక్టోబరు 20న FAQలను జారీ చేసింది.

LTC క్యాష్ వోచర్ పథకానికి సంబంధించి కొన్ని తాజా FAQలు..


1. ఉద్యోగి కార్యాలయం, స్వస్థలం ఒక్కటై ఉన్నప్పుడు బ్లాక్ ఇయర్ లో ఒకే సారి LTCకి అర్హులవుతారు. అది పూర్తయిన తర్వత పథకానికి అర్హత పొందుతాడా?

వివరణ: లేదు. పొందలేరు. బ్లాక్ ఇయర్ లో ఒక్క LTCకే అందుబాటులో ఉంటుంది.

2. ఉద్యోగి తగినన్ని సెలవులు లేకపోయిన లేదా కనీస బ్యాలెన్స్ అయిన 40 రోజులు లేకపోయినట్లయితే LTC ఎన్ క్యాష్మెంట్ కు అర్హత పొందుతారా?

వివరణ: సెలవులు ఎన్ క్యాష్ మెంట్ LTC నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. అలాంటి ఎన్ క్యాష్ మెంట్ అందుబాటులో లేకపోతే ఉద్యోగి సెలవు ఎన్ క్యాష్మెంట్ లేకుండా పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.

SBI Credit Card: ఎస్‌బీఐ క్రెడిట్ కార్డు తీసుకుంటే రూ.6500 బెనిఫిట్స్

EPF Balance: రెండు రోజుల్లో ఈపీఎఫ్ వడ్డీ మీ అకౌంట్‌లోకి... బ్యాలెన్స్ చెక్ చేయండి ఇలా

3. ఓ ఉద్యోగి ఇప్పటికే లీవ్ ఎన్ క్యాష్మెంట్ తో పాటు 2018-19 సంవత్సరానికి స్వస్థల LTC(తానొక్కడే)ని పొందగలిగితే ఇప్పుడు అతడు 2020-21 బ్లాక్ సంవత్సరం నుంచి తనతో పాటు 2018-19 ఏడాది కుటుంబ సభ్యుల LTC పథకం నగదు వోచర్ ను క్లెయిమ్ చేయగలరా?

వివరణ: అవును. చేయవచ్చు. ఎన్ క్యాష్మెంట్ కు అర్హత ఉన్న గరిష్ఠ కాలపరిమితి 60 రోజులకు మించకుండా ఉంటే అతడు లీవ్ ఎన్ క్యాష్మెంట్ క్లెయిమ్ చేయవచ్చు.

4. భార్యభర్తలిద్దరూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లయితే ఒకరు తమతో పాటు భాగస్వామి ఎల్టీసీ నగదు వోచర్ పథకాన్ని పొందుతున్నట్లయితే విడిగా లీవ్ ఎన్ క్యాష్మెంట్ ను పొందగలరా?

వివరణ: అవును. ఇలాంటి సందర్భాల్లో జీవిత భాగస్వామి ఎల్టీసీ లీవ్ ఎన్ క్యాష్మెంట్ విడిగా పొందుతారు.

5. ఉద్యోగి లీవ్ ఎన్ క్యాష్మెంట్ లెకుండా కేవలం LTC ఛార్జీలను మాత్రమే పొందగలిగి డీమ్డ్ ఛార్జీలు అర్హత కంటే మూడు రెట్లు తక్కువ లేదా సమానంగా ఖర్చు చేస్తే అతడికి ఎంత రీయంబర్స్ మెంట్ లభిస్తుంది?

వివరణ: ఇలాంటి సందర్భాల్లో రీయంబర్సమెంట్ ప్రో-రాటా ప్రాతిపదికన ఉంటుంది.

6. వస్తువులు లేదా సేవలు రుణం లేదా ఈఎంఐల రూపంలో కొనుగోలు చేస్తే ఈ పథకం పరిధిలోకి వస్తుందా?

వివరణ: 12 శాతం ఎక్కువ జీఎస్టీని ఆకర్షించే ఏదైనా వస్తువుల లేదా సేవల కొనుగోలు ఈ పథకం కింద రీయంబర్స్ మెంట్ కు అర్హత పొందుతుంది. EMI ప్రాతిపదికన కొనుగోళ్లు కూడా అనుమతిస్తారు. ఆర్డర్ జారీ చేసిన తర్వాత కొనుగోలు చేయడపడి ఉండాలి. అంటే అక్టోబరు 12కు ఇన్వాయిస్ చేసి ఉండాలి.

7. ఆల్ ఇండియా ఎల్టీసీ అధికారులకు మూడు స్వస్థలాలు ఉన్నట్లయితే 2020 ఏడాదికి ప్రత్యేక నగదు ప్యాకేజిని పొందగలరా? 2021కి కూడా LTCని పొందవచ్చా?

వివరణ: ఈ పథకం 2020 మార్చి 31 వరకు చెల్లుతుంది. అందుబాటులో ఉన్న LTCకి బదులుగా ఉంటుంది. ఈ పథకం ప్రయోజనాలకు బదులుగా ఓ అధికారి 2021లో ఆ ఏడాదికి చెందిన ఎల్టీసీని పొందవచ్చు.

Gold Scheme: ధంతేరాస్ రోజున గోల్డ్ స్కీమ్‌లో చేరుతున్నారా? ఈ విషయం మార్చిపోవద్దు

iPhone: కొత్త ఫోన్ కొనాలా? రూ.10,000 లోపే ఐఫోన్ సొంతం చేసుకోండి... ఇంకొన్ని గంటలే ఆఫర్

8. కొత్త నియామకాలకు ఎల్‌టిసి రూల్స్ చేత పాలించబడే తాజా నియామకం ఈ పథకాన్ని ఎంచుకున్న తర్వాత తన 8 వ సంవత్సరంలో ఉంటే, అతను 2021 జనవరి-మార్చి తేదీని కలిగి ఉన్న బిల్లులను సమర్పించగలరా? స్పష్టీకరణ:

వివరణ: అవును. కానీ ప్రత్యేక పథకం ప్రయోజనాలను పొందటానికి LTC లేదా ఓ LTC ఒక బ్లాక్ సంవత్సరం ముందుగానే ఉండాలి.

9. ఓ ఉద్యోగి ఇప్పటికే 10 రోజుల లీవ్ ఎన్ క్యాష్మెంట్లో 60 రోజుల సెలవు అయిపోయినట్లయితే?

వివరణ: లేదు. అతడు పరిగణించబడే ఛార్జీల విలువను మాత్రమే పొందగలరు.

10. ఓ ఉద్యోగి 208-19 ఏడాదికి నగదు పథకాన్ని పొందుతున్నట్లయితే వారు 2021 జనవరి నుంచి 2021 మార్చి వరకు బిల్లులను సమర్పించవచ్చా?

వివరణ: అవును. 2020 అక్టోబరు 10 లేదా తర్వాత లావాదావీలు 21 మార్చి 2021 వరకు సమర్పించబడతాయి.

11. ఎల్టీసీ అడ్వాన్స్ లేదా ఏదైనా అడ్వాన్స్ ఇస్తారా?

వివరణ: లీవ్ ఎన్ క్యాష్మెంట్ లో 100 శాతం వరకు గ్రహించిన ఛార్జీల విలువలో 50 శాతం వరకు ఉద్యోగి బ్యాంకు ఖాతాలో ముందుగానే చెల్లించవచ్చని పేర్కొన్నారు.

12.నేను 2019 హోమ్ ఎల్టీసీని పొందాను. LTC నగదు వోచర్ పథకానికి నా అర్హత స్థానం ఏంటి?

వివరణ: ఈ పథకం 2018-21 ఎల్టీసీ బ్లాక్ కు చెందింది. సాధారణంగా రెండు ఎల్టీసీ ఛార్జీలు ఉంటాయి. ఒక దాన్ని పొంది.. రెండోది మిగిలి ఉంటే అదే ప్రయోజనం కోసం ఉపయోగించబడుతుంది. 2018-21 బ్లాక్ ఏదైనా ఉపయోగించని ఎల్టీసీ అర్హత సాధించవచ్చు.

13. ఉత్పత్తుల కొనుగోళ్లకు 3 నుంచి 4 సార్లు ఖర్చు చేయడం ఎలా ట్రాక్ చేయబడుతుంది? ఈ-కామర్స్ వెబ్ సైట్ నుంచి ఆన్ లైన్ లో చేసిన కొనుగోలు ఆమోదయోగ్యమైనదేనా?

వివరణ: డిజిటల్ మోడ్ లో ఏదైనా కొనుగోలు ఇన్వాయిస్ ద్వారా మద్దతు ఇవ్వబడుతుంది. ఇన్వాయిస్ ఉత్పత్తి ఆధారంగా ఖర్చు లెక్కిస్తారు. ఈ పథకం ముఖ్యోద్దేశం.. ప్రతి కొనుగోలు విధానాన్ని ప్రోత్సహించడం. ఉద్యోగి తగిన డిజిటల్ మోడ్ ఎంచుకోవడం.
Published by:Santhosh Kumar S
First published: