కంపెనీలకు టాక్స్ తగ్గింపు... భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు

Tax : ఆర్ధిక మందగమన సమయంలో... కేంద్ర ప్రభుత్వం ఉద్దీపన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా... కార్పొరేట్ కంపెనీలకు పన్ను తగ్గించడంతో... స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లోకి దూసుకెళ్లాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: September 20, 2019, 11:33 AM IST
కంపెనీలకు టాక్స్ తగ్గింపు... భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
కంపెనీలకు టాక్స్ తగ్గింపు... భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు
Krishna Kumar N | news18-telugu
Updated: September 20, 2019, 11:33 AM IST
స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా భారీ లాభాల్లోకి వెళ్లాయి. సెన్సెక్స్ ఏకంగా 1200 పాయింట్లు లాభపడి... 37వేల మార్కుకు పైన కదలాడుతుంటే... నిఫ్టీ... 350 పాయింట్లకు పైగా బలపడి... 11 వేల మార్కుకు పైన కదలాడుతోంది. స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా ఈ రేంజ్‌లో లాభాల్లోకి వెళ్లడానికి కేంద్రం తాజాగా తీసుకున్న ఉద్దీపన చర్యే. దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్నును 30 నుంచీ 22 శాతానికి తగ్గించిన కేంద్ర ప్రభుత్వం... కొత్త కంపెనీల కార్పొరేట్ టాక్స్‌ను 25 శాతం నుంచీ 15 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచీ అమల్లోకి వస్తుందని తెలిపింది. దీని వల్ల దేశవ్యాప్తంగా కొన్ని లక్షల కంపెనీలకు మేలు జరగనుంది. అలాగే వాటిలో పనిచేస్తున్న కోట్ల మందికి ఉపశమనం లభించినట్లవుతుంది.

దేశం ఆర్థిక మందగమనంలో ఉన్న తరుణంలో... ఇప్పటికే కొన్ని చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం... అయినప్పటికీ సరైన ఫలితాలు కనిపించకపోవడంతో... తాజా పన్ను తగ్గింపు నిర్ణయం తీసుకుంది. ఐతే... ఇది ఎంత వరకూ కలిసొస్తుంది, దీని వల్ల ఆర్థిక మందగమనం తగ్గుతుందా అన్నది ఇప్పుడే చెప్పలేమంటున్నారు ఆర్థిక వేత్తలు. సెన్సెక్స్ పరుగులు పెడుతుండటాన్ని బట్టీ... పారిశ్రామిక వర్గాలకు కేంద్ర నిర్ణయం నచ్చిందనే సంకేతాలు వచ్చాయంటున్నారు.

First published: September 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...