హోమ్ /వార్తలు /బిజినెస్ /

Farmers: రైతులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం, ఇక ఇంటి వద్దకే..

Farmers: రైతులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం, ఇక ఇంటి వద్దకే..

Farmers: రైతులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం, ఇక ఇంటి వద్దకే..

Farmers: రైతులకు శుభవార్త.. కేంద్రం కీలక నిర్ణయం, ఇక ఇంటి వద్దకే..

Insecticide Act | రైతులకు తీపికబురు. కేంద్ర ప్రభుత్వం రూల్స్‌ సవరించింది. కంపెనీలు ఆన్‌లైన్‌లో పెస్టిసైడ్స్‌ను విక్రయించొచ్చు. అయితే దీనికి కచ్చితంగా లైసెన్స్ కావాల్సిందే. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌‌లో వీటిని కొనొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Fertilizers | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతులకు తీపికబురు అందించింది. రైతులు (Farmers) ఇకపై ఆన్‌లైన్‌లోనే (Online) పరుగు మందులు కొనుగోలు చేయొచ్చు. ఇకామర్స్ వెబ్‌సైట్ల ద్వారా పెస్టిసైడ్స్‌ను కొనొచ్చు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం పెస్టిసైడ్స్ రూల్స్‌ను సవరించింది. దీంతో అన్నదాతలు పెస్టిసైడ్స్‌ను ఆన్‌లైన్‌లో కొనొచ్చు. ఇంటి వద్దకే డెలివరీ పొందొచ్చు. దీని వల్ల రైతులకు ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు.

కొన్ని కొన్ని ప్రాంతాల్లో అన్ని పెస్టిసైడ్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. అంటే అన్ని కంపెనీల ప్రొడక్టులు పూర్తి స్థాయిలో లభించకపోవచ్చు. దీని వల్ల రైతులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. అయితే ఇకపై ఈ సమస్యలు ఉండవు. ఆన్‌లైన్‌లో పెస్టిసైడ్స్ అందుబాటులోకి రావడంతో రైతులు ఎక్కడి నుంచైనా అవసరమైన పెస్టిసైడ్స్‌ను కొనొచ్చు. ఇంటి వద్దకే వచ్చేస్తాయి.

ఐసీఐసీఐ బ్యాంక్ గుడ్ న్యూస్.. కస్టమర్లకు అదిరిపోయే కొత్త సర్వీసులు!

ఈకామర్స్ వెబ్‌సైట్ల ద్వారా పెస్టిసైడ్స్ విక్రయాలను కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీని కోసం ఇన్‌సెక్టిసైడ్ యాక్ట్‌ను సవరించింది. రూల్స్ సవరణ తర్వాత ఈకామర్స్ కంపెనీలు కూడా ఇకపై చట్టబద్దంగానే పెస్టిసైడ్స్‌ను విక్రయించొచ్చు. కేవలం అమెజాన్ , ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలకు మాత్రమే వీటిని విక్రయించడానికి అనుమతి ఉంటుంది.

ఈ 2 కార్లు అదుర్స్.. ఒక్కసారి చార్జింగ్ పెడితే 500 కిలోమీటర్లు వెళ్లొచ్చు.. రూ.51 వేలతో బుక్ చేసుకోవచ్చు!

అయితే ఆన్‌లైన్‌లో పెస్టిసైడ్స్‌ను విక్రయించడానికి కంపెనీలు కచ్చితంగా లైసెన్స్ పొందాల్సి ఉంటుంది. లైసెన్స్ కలిగిన వారు మాత్రమే ఆన్‌లైన్‌లో పెస్టిసైడ్స్‌ను విక్రయించాల్సి ఉంటుంది. అలాగే కంపెనీలకు లైసెన్స్ ఉందా? లేదా? అనే విషయాన్ని ఈకామర్స్ సంస్థలు వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఈ నిర్ణయం వల్ల పెస్టిసైడ్ మార్కెట్‌లో పోటీ పెరుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే రైతుల ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు. కాగా ప్రతి ఏటా లక్షల మంది రైతులు వివిధ రకాల పెస్ట్స్ కారణంగా చాలా నష్టపోతున్నారు.

కాగా మరోవైపు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ స్కీమ్ కింద డబ్బులు పొందే వారికి ఇకేవైసీ తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అందువల్ల పీఎం కిసాన్ రైతులు కచ్చితంగా ఇకేవైసీ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇకేవైనీ చేసుకోకపోతే డబ్బులు రాకపోవచ్చు. అందుకే వెంటనే ఈ పని పూర్తి చేసుకోండి. ఆన్‌లైన్‌లోనే దీన్ని పూర్తి చేయొచ్చు. పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆధార్ నెంబర్ సాయంతో సులభంగానే ఇకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. లేదంటే దగ్గరిలోని కామన్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లి ఇకేవైసీ పూర్తి చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లోనే మీరే ఇకేవైసీ చేసుకుంటే ఉచితంగానే పని పూర్తి అవుతుంది. అదే కామన్ సర్వీస్ సెంటర్‌కు వెలితే రూ. 15 మేర చార్జీ చెల్లించుకోవాల్సి ఉంటుంది.

First published:

Tags: Farmers, Fertilisers, PM KISAN, PM Kisan Scheme

ఉత్తమ కథలు