మీరు సుకన్య సమృద్ధి యోజన (Sukanya Samriddh Yojana) అకౌంట్‌లో డబ్బులు జమ చేస్తున్నారా? పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) అకౌంట్ ఉందా? కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచింది. 2022 జనవరి, ఫిబ్రవరి, మార్చి వరకు పాత వడ్డీ రేట్లే అమలులో ఉంటాయి. ప్రస్తుతం బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు భారీగా తగ్గిన సంగతి తెలిసిందే. దీంతో చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు తగ్గుతాయన్న ఆందోళన ఖాతాదారుల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచుతున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లే 2022 మార్చి వరకు కొనసాగుతోంది.
ప్రస్తుతం పీపీఎఫ్ అకౌంట్‌హోల్డర్లకు వార్షిక వడ్డీ 7.1 శాతం లభిస్తుండగా, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు 7.4 శాతం ఉంది. ఇక సుకన్య సమృద్ధి అకౌంట్‌పై 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో ఎక్కువ వడ్డీ ఇస్తున్న స్కీమ్ ఇదే. ఇక ఐదేళ్ల మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ స్కీమ్‌కు 6.6 శాతం వడ్డీ, 5 ఏళ్ల నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్‌కు 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. ఒక ఏడాది టర్మ్ డిపాజిట్‌కు 5.5 శాతం, ఐదేళ్ల డిపాజిట్‌కు 6.7 శాతం వడ్డీ లభిస్తుంది.
GST Rules: జనవరి 1 నుంచి ధరలు పెరిగే, తగ్గే వస్తువులు ఇవే
ఈ పొదుపు పథకాల వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం ప్రతీ మూడు నెలలకోసారి సవరిస్తూ ఉంటుంది. వడ్డీ రేట్లు పెరగొచ్చు లేదా తగ్గొచ్చు లేదా స్థిరంగా ఉండొచ్చు. రాబోయే మూడు నెలలకు వడ్డీ స్థిరంగా కొనసాగుతుంది. కాబట్టి నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్ (NSC), కిసాన్ వికాస్ పత్ర, సుకన్య సమృద్ధి యోజన (SSY) లాంటి పథకాలకు వడ్డీ రేట్లు మారవు.
ఈ పథకాలపై 2021 జూలై నుంచి వడ్డీ రేట్లు స్థిరంగా ఉన్నాయి. మరోవైపు పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాలపైనా వడ్డీ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లతో పోలిస్తే ప్రభుత్వానికి చెందిన పొదుపు పథకాల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే సామాన్యులంతా ఈ పొదుపు పథకాల్లో డబ్బులు జమ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం ప్రధాన బ్యాంకులన్నీ ఒకటి నుంచి 10 ఏళ్ల డిపాజిట్లపై 5 నుంచి 5.5 శాతం వడ్డీ మాత్రమే ఇస్తున్నాయి.
Earn Rs 10 Crore: రిటైర్మెంట్ లోపే రూ.10 కోట్ల సంపద... ఇలా పొదుపు చేస్తే చాలు
సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్ లాంటి చిన్నమొత్తాల పొదుపు పథకాలపై ఎక్కువ వడ్డీ పొందొచ్చు. ఈ పథకాల్లో 6 శాతంపైనే వడ్డీ పొందొచ్చు. ఎక్కువ వడ్డీ కావాలంటే సుకన్య సమృద్ధి యోజన పథకంలో డబ్బులు జమ చేయొచ్చు. అయితే తల్లిదండ్రులు తమ కూతురు పేరు మీద మాత్రమే ఈ అకౌంట్ ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. అది కూడా ఒక కూతురు పేరు మీదే అకౌంట్ ఓపెన్ చేయొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: PPF, Save Money, Sukanya samriddhi yojana