మీరు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌లో డబ్బులు దాచుకుంటున్నారా? సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్‌లో చేరారా? మీ అమ్మాయి చదువు, పెళ్లి కోసం సుకన్య సమృద్ధి యోజన పథకంలో పొదుపు చేస్తున్నారా? అయితే త్వరలో కేంద్ర ప్రభుత్వం మీకు షాకిచ్చే అవకాశం ఉంది. ఈ చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ప్రస్తుతం ఉన్న వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం తగ్గించే అవకాశం ఉందన్న వార్తలొస్తున్నాయి. ఏకంగా 50 బేసిస్ పాయింట్స్ అంటే అర శాతం వడ్డీ తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నది ఆ వార్తల సారాంశం. సీఎన్‌బీసీ టీవీ18 తో మాట్లాడుతూ ఓ సీనియర్ ప్రభుత్వ అధికారి ఈ విషయాన్ని వెల్లడించారు. "రెపో రేట్‌కు, చిన్న మొత్తాల పథకాలపై ఉన్న వడ్డీ రేట్లకు మధ్య వ్యత్యాసాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంది. అందుకే వీటి వడ్డీ రేట్లను తగ్గించే అవకాశముంది" అని ఆ అధికారి అభిప్రాయపడ్డారు. ఒకవేళ ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను తగ్గిస్తే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్-NSC, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్-SCSS, సుకన్య సమృద్ధి యోజన-SSY స్కీమ్స్‌తో పాటు ఇతర పొదుపు పథకాలపై ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
ఇక ఇప్పటికే యూఎస్ ఫెడరల్ రిజర్వ్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌తో పాటు ఇతర ప్రముఖ సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో ఆర్థిక మందగమనాన్ని నివారించడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI పాలసీ రేట్స్‌ని తగ్గిస్తుందన్న వాదన వినిపిస్తోంది. రెపో రేట్ 50 బేసిస్ పాయింట్స్ తగ్గించే అవకాశం ఉందని, పాలసీ రేట్ 25 బేసిస్ పాయింట్స్ తగ్గొచ్చని అంటున్నారు. సాధారణంగా రెండు మానెటరీ పాలసీ కమిటీ సమావేశాల మధ్య రెపో రేట్‌ని తగ్గిస్తుంటారు. కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ మార్కెట్లపై తీవ్రంగా ఉండటంతో మార్చి 3న ఫెడరల్ రిజర్వ్ 50 బేసిస్ పాయింట్స్ రేట్ తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ మార్చి 11న కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో రెపో రేట్ తగ్గించాలన్న ఒత్తిడి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై పెరుగుతోంది.
ఇవి కూడా చదవండి:
SBI: ఎస్‌బీఐలో డబ్బులు దాచుకున్నవారికి షాక్
SBI Home Loan: హోమ్ లోన్ కస్టమర్లకు గుడ్ న్యూస్... మళ్లీ వడ్డీ రేట్లు తగ్గించిన ఎస్‌బీఐ
PMVVY Scheme: ఈ స్కీమ్‌లో చేరితే నెలకు రూ.10,000 పెన్షన్... మార్చి 31 చివరి తేదీ
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Investment Plans, Money, Money making, Personal Finance, PPF, Save Money, Sukanya samriddhi yojana