హోమ్ /వార్తలు /బిజినెస్ /

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజే బ్యాంకు ఖాతాల్లోకి పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు..!

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజే బ్యాంకు ఖాతాల్లోకి పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు..!

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజే బ్యాంకు ఖాతాల్లోకి పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు..!

PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. ఆ రోజే బ్యాంకు ఖాతాల్లోకి పీఎం కిసాన్ 12వ విడత డబ్బులు..!

PM Kisan: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(పీఎం కిసాన్) పథకంలో భాగంగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6,000 కేంద్రం ఇస్తోంది. ఇప్పటి వరకు 11 వాయిదాల చొప్పున డబ్బులను ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

దేశంలోని 10 కోట్ల మందికి పైగా రైతులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ (Indian PM Narendra Modi) ప్రభుత్వం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన(PM Kishan) ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పథకంలో భాగంగా రైతుల (Farmers) కు పెట్టుబడి సాయం కింద ఏటా రూ.6,000 కేంద్రం ఇస్తోంది. ఇప్పటి వరకు 11 వాయిదాల చొప్పున డబ్బులను ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేసింది. ఈ క్రమంలోనే త్వరలో 12వ విడత డబ్బులనూ ప్రభుత్వం అందజేయనుంది. ఈ డబ్బుల కోసం లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.

* మూడు వాయిదాల్లో పెట్టుబడి

కేంద్రం ఈ రూ.6,000 పెట్టుబడిని మూడు వాయిదాల్లో అందిస్తుంది. నాలుగు నెలల తేడాతో రూ.2,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం రైతులకు నగదు అందిస్తుంది. ఈ డబ్బులు నేరుగా (Direct Benefit Transfer- DBT) రైతుల బ్యాంకు ఖాతాల్లోనే జమవుతున్నాయి. అమౌంట్ విడుదలకు సంబంధించిన సన్నాహకాలు పూర్తయినట్లు తెలుస్తోంది. మరో రెండు వారాల్లో రైతుల ఖాతాల్లో జమయ్యే అవకాశం కనిపిస్తోంది. అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన రాలేదు.

* నేరుగా రైతు ఖాతాలో నగదు జమ

పీఎం కిసాన్ లబ్ధిదారులు ఇప్పటికే ఈ కేవైసీ చేయించుకున్న సంగతి తెలిసిందే. ఆధార్‌కు మొబైల్ నెంబర్ లింక్ చేయడం ద్వారా పీఎం కిసాన్‌కు సంబంధించిన సమాచారం రైతులకు నేరుగా చేరుతుంది. ఈ కేవైసీ స్టేటస్‌లో ఫండ్ ట్రాన్స్‌ఫర్ ఆర్డర్ (FTO) అని వస్తే మీ ఖాతాల్లోకి డబ్బు నేరుగా జమ అవుతుందని భావించాలని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోంది. దేశంలో ఇప్పటికే రైతులకు పెద్ద సంఖ్యలో కిసాన్ క్రెడిట్ కార్డులను(KCC) ప్రభుత్వం అందిస్తుంది. ‘రైతు భాగస్వామ్యం-ప్రాధాన్యత హమారీ’ కార్యక్రమంలో భాగంగా కేంద్రం కేసీసీ కార్డులను అందజేస్తుంది. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసేందుకు సన్నాహకాలు కొనసాగుతున్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

* లబ్ధిదారులు ఈ 12వ విడత సాయం తమకు అందుతుందా? లేదా? అనేది సులభంగా ఈ విధంగా తెలుసుకోవచ్చు.

పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కు వెళ్లిన తర్వాత ‘ఫార్మర్స్ కార్నర్’ ఆప్షన్‌పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత ‘బెనిఫీషియర్ స్టేటస్’ ఆప్షన్‌పైన క్లిక్ చేయాలి. అనంతరం ఆధార్ కార్డు నెంబర్ గానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ గానీ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ‘గెట్ డేటా’ బటన్ పైన క్లిక్ చేస్తే చాలు.. లబ్ధిదారుడికి సంబంధించిన పూర్తి సమాచారం డిస్‌ప్లే అవుతుంది.

దరఖాస్తు స్టేటస్ తెలుసుకోవడంలో ఏదైనా సమస్య ఉంటే 155261 అనే టోల్ ఫ్రీ నెంబర్‌కు కూడా మీరు కాల్ చేయొచ్చు. అలా మీరు మీ 12వ విడతకు సంబంధించిన డబ్బులు పడతాయో లేదో తెలుసుకోవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Farmers, Personal Finance, PM KISAN, PM Kisan Maan Dhan Yojana, PM Kisan Scheme

ఉత్తమ కథలు