Home /News /business /

CENTRAL GOVERNMENT HIKES VEHICLES REGISTRATION CHARGES 8 TIMES FOR 15 YEARS OLD VEHICLES SS GH

Old Vehicle: మీ దగ్గర పాత వాహనం ఉందా? ఆ ఛార్జీలు భారీగా పెరిగాయి

Old Vehicle: మీ దగ్గర పాత వాహనం ఉందా? ఆ ఛార్జీలు భారీగా పెరిగాయి
(ప్రతీకాత్మక చిత్రం)

Old Vehicle: మీ దగ్గర పాత వాహనం ఉందా? ఆ ఛార్జీలు భారీగా పెరిగాయి (ప్రతీకాత్మక చిత్రం)

Old Vehicle | మీ దగ్గర పాత వాహనం ఉందా? పాత వాహనం రిజిస్ట్రేషన్ రెన్యువల్ (Registration Renewal) చేయాలా? అయితే అలర్ట్. రెన్యువల్ ఛార్జీలు (Renewal Charges) భారీగా పెరిగాయి. ఇప్పుడు ఎంత ఛార్జీలు చెల్లించాలో తెలుసుకోండి.

పాత వాహనాల రిజిస్ట్రేషన్ రెన్యువల్ ఛార్జీలను (Renewal Charges) భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఇకపై 15 సంవత్సరాలు పైబడిన కార్ల యజమానులు.. వాటి రిజిస్ట్రేషన్‌ను రెన్యువల్ చేయడానికి ఎనిమిది రెట్లు ఎక్కువ రుసుము (Charges) చెల్లించాల్సి ఉంటుంది. మంగళవారం రోడ్డు రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నోటిఫికేషన్‌లో ఈ వివరాలు పొందుపర్చింది. కేంద్ర మోటారు వాహనాల (23వ సవరణ) నిబంధనలు- 2021 పేరుతో ఈ నోటిఫికేషన్ వెలువడింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. కేంద్రం ఇటీవల ప్రకటించిన జాతీయ వాహన తుక్కు విధానాన్ని పోత్సహించడానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని అధికారులు చెబుతున్నారు. గడువు తీరిన, కాలుష్యానికి కారణమవుతున్న పాత వాహనాలను దశలవారీగా సేకరించి తుక్కుగా మార్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజా నిబంధనలు రూపొందించారు.

Gas Cylinder Cashback Offer: పేటీఎంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేస్తే రూ.900 వరకు క్యాష్‌బ్యాక్

ప్రస్తుతం 15 ఏళ్లకు పైబడిన కారు రిజిస్ట్రేషన్ రెన్యువల్‌కు చెల్లిస్తున్న రుసుము రూ. 600గా ఉంది. కొత్త నిబంధనల ప్రకారం ఈ మొత్తం రూ.5,000 వరకు పెరిగింది. 15 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న మోటార్‌బైక్‌ల రిజిస్ట్రేషన్ రెన్యువల్‌కు ప్రస్తుతం ఉన్న రూ.300 రుసుము సైతం రూ.1,000కి పెరిగింది. ప్రస్తుతం 15 సంవత్సరాలు పైబడిన పాత బస్సు లేదా ట్రక్కు ఫిట్‌నెస్ రెన్యువల్ సర్టిఫికెట్ ఛార్జీ రూ.1500గా ఉండగా.. ఇది ఏకంగా రూ.12,500 వరకు పెరిగింది. దీంతోపాటు పాత మీడియం గూడ్స్ లేదా ప్యాసింజర్ మోటార్ వాహనాల ఫిట్‌నెస్ రెన్యువల్ సర్టిఫికెట్ రుసుము సైతం రూ.10,000కి పెరిగింది.

Home Loan: ఫెస్టివల్ ఆఫర్‌తో మీ హోమ్ లోన్‌పై రూ.10 లక్షల వడ్డీ తగ్గించుకోండి ఇలా

ఇప్పుడు వాహనదారులు దిగుమతి చేసుకున్న మోటార్‌బైక్స్ రిజిస్ట్రేషన్ రెన్యువల్‌కు రూ.10,000, కార్లకు రూ. 40,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ గడువు ముగిసిన తర్వాత మళ్లీ ఫిట్‌నెస్ పరీక్ష ఆలస్యమైతే.. ప్రతి రోజుకు రూ.50 చొప్పున అదనపు రుసుము కూడా వర్తిస్తుందని నోటిఫికేషన్ పేర్కొంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ రెన్యువల్‌కు దరఖాస్తు చేయడం ఆలస్యమైతే.. ప్రైవేట్ వాహనాలకు ప్రతి నెలా రూ.300, వాణిజ్య వాహనాలకు ప్రతి నెలా రూ.500 లేట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Auto News, Automobiles, Vehicle act

తదుపరి వార్తలు