కేంద్ర ప్రభుత్వానికి చెందిన పొదుపు పథకాల్లో (Savings Schemes) డబ్బులు దాచుకున్నవారికి శుభవార్త. కేంద్ర ప్రభుత్వం రాబోయే మూడు నెలలకు సంబంధించిన వడ్డీ రేట్లను (Interest Rates) భారీగా పెంచింది. పొదుపు పథకాన్ని బట్టి 20 బేసిస్ పాయింట్స్ నుంచి 110 బేసిస్ పాయింట్స్ వరకు వడ్డీ రేట్లు పెంచడం విశేషం. 100 బేసిస్ పాయింట్స్ 1 శాతంతో సమానం. 2023 జనవరి నుంచి మార్చి వరకు కొత్త వడ్డీ రేట్లు వర్తిస్తాయి. కేంద్ర ప్రభుత్వం 2022 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి కూడా 30 బేసిస్ పాయింట్స్ వడ్డీ రేట్లను పెంచిన సంగతి తెలిసిందే. అంతకుముందు వరుసగా తొమ్మిది త్రైమాసికాలు వడ్డీ రేట్లను పెంచలేదు. అంటే రెండేళ్ల మూడు నెలలు వడ్డీ రేట్లను పెంచలేదు. ఇప్పుడు వరుసగా రెండు త్రైమాసికాల్లో వడ్డీ రేటు పెంచడం విశేషం.
సేవింగ్స్ డిపాజిట్‌కు వడ్డీలో ఎలాంటి మార్పు లేదు. వార్షిక వడ్డీ 4 శాతం కొనసాగుతుంది.
1 ఏడాది టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 110 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 5.5 శాతం నుంచి 6.6 శాతానికి పెరిగింది.
2 ఏళ్ల టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 110 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 5.7 శాతం నుంచి 6.7 శాతానికి పెరిగింది.
Long Weekends in 2023: టూర్లకు వెళ్లేవారికి గుడ్ న్యూస్... వచ్చే ఏడాది 17 లాంగ్ వీకెండ్స్
3 ఏళ్ల టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 110 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 5.8 శాతం నుంచి 6.9 శాతానికి పెరిగింది.
5 ఏళ్ల టైమ్ డిపాజిట్ వడ్డీ రేటు 30 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 6.7 శాతం నుంచి 7 శాతానికి పెరిగింది.
5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. 5.8 శాతం కొనసాగుతుంది.
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ వడ్డీ రేటు 40 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 7.6 శాతం నుంచి 8 శాతానికి వడ్డీ పెరిగింది.
PAN Card: పాన్ కార్డ్ ఉన్నవారికి అలర్ట్... వారి కార్డులు చెల్లవు
మంత్లీ ఇన్‌కమ్ అకౌంట్ స్కీమ్ వడ్డీ రేటు 40 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 6.7 శాతం నుంచి 7.1 శాతానికి వడ్డీ పెరిగింది.
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 6.8 శాతం నుంచి 7 శాతానికి వడ్డీ పెరిగింది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. 7.1 శాతం వడ్డీ కొనసాగుతుంది.
కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ వడ్డీ రేటు 20 బేసిస్ పాయింట్స్ పెరిగింది. 7 శాతం నుంచి 7.2 శాతానికి వడ్డీ పెరిగింది. స్కీమ్ మెచ్యూరిటీ 123 నెలల నుంచి 120 నెలలకు తగ్గింది.
ఇక సుకన్య సమృద్ది యోజన స్కీమ్ వడ్డీ రేటులో ఎలాంటి మార్పు లేదు. 7.6 శాతం వడ్డీ కొనసాగుతుంది.
పైన చెప్పిన వడ్డీ రేట్లన్నీ 2023 జనవరి 1 నుంచి 2023 మార్చి 31 వరకు కొనసాగుతాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Money savings, Personal Finance, Post office scheme, Postal savings, PPF, Sukanya samriddhi yojana