హోమ్ /వార్తలు /బిజినెస్ /

Family Pension Rules: ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ ఇవే

Family Pension Rules: ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ ఇవే

Family Pension Rules: ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ ఇవే
(ప్రతీకాత్మక చిత్రం)

Family Pension Rules: ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్ రూల్స్ ఇవే (ప్రతీకాత్మక చిత్రం)

Family Pension Rules | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లేదా పెన్షనర్లు మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ లభిస్తుంది. రూల్స్ తెలుసుకోండి.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ వస్తుందన్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలు కూడా ఉన్నాయి. పదవీ విరమణ పొందిన ఉద్యోగి కుటుంబ సభ్యులు కూడా పెన్షన్ పొందేందుకు అర్హులు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ పెన్షన్ అండ్ పెన్షనర్స్ వెల్‌ఫేర్ నియమనిబంధనల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ పొందొచ్చు. ఇందుకు కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారికి 25 ఏళ్ల లోపు పెళ్లి కాని కొడుకులు ఉంటే పెన్షన్ పొందొచ్చు. పెళ్లికాని కూతుళ్లు, విడాకులు తీసుకున్న కూతుళ్లు, వితంతువులైన కూతుళ్లకు కూడా పెన్షన్ వస్తుంది. వారికి వయస్సు పరిమితి లేదు. ఇక మానసిక, శారీరక వికలాంగులైన పిల్లలకు కూడా పెన్షన్ వర్తిస్తుంది. అయితే వారికి ఎలాంటి జీవనాధారం లేకపోతేనే పెన్షన్ వర్తిస్తుంది. మరణించిన ఉద్యోగి లేదా పెన్షనర్‌పై ఆధారపడిన తల్లిదండ్రులు, తోబుట్టువులకు కూడా పెన్షన్ లభిస్తుంది.

PAN Aadhaar Link: కొత్త వెబ్‌సైట్‌లో పాన్ కార్డ్, ఆధార్ నెంబర్ లింక్ చేయండి ఇలా

Multibagger Stock: రూ.1,00,000 పెట్టుబడికి రూ.8,91,000 రిటర్న్స్

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ వేతనంలో 50 శాతం పెన్షన్ రూపంలో వస్తుంది. ప్రస్తుతం ఏడో పే కమిషన్ ద్వారా గరిష్ట బేసిక్ వేతనం రూ.2,50,000 ఉంది. అంటే ఉద్యోగులకు రిటైర్ అయిన తర్వాత గరిష్ట పెన్షన్ రూ.1,25,000 లభిస్తుంది. ఉద్యోగి లేదా పెన్షనర్ మరణిస్తే వారి కుటుంబ సభ్యులు నియమనిబంధనల మేరకు గరిష్టంగా రూ.1,25,000 వరకు పెన్షన్ పొందొచ్చు. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఆరు నెలలకు ఓసారి ప్రకటించి డియర్‌నెస్ రిలీఫ్ కూడా వర్తిస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కనీసం రూ.9,000 పెన్షన్ + డియర్‌నెస్ రిలీఫ్ లభిస్తోంది.

PM Ujjwala Scheme 2.0: ఉచితంగా గ్యాస్ కనెక్షన్, గ్యాస్ సిలిండర్... అప్లై చేయండి ఇలా

Aadhaar Number: ఆధార్ నెంబర్ వెరిఫై చేయాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబ సభ్యులు ఫ్యామిలీ పెన్షన్ పొందాలంటే కొన్ని డాక్యుమెంట్స్ అవసరం. మరణించిన పెన్షనర్, వారి జీవిత భాగస్వామికి కలిపి జాయింట్ అకౌంట్ ఉండాలి. ఫ్యామిలీ పెన్షన్ కోసం దరఖాస్తు ఇవ్వాలి. పెన్షనర్ డెత్ సర్టిఫికెట్ జత చేయాలి. దరఖాస్తు దారుల పుట్టిన తేదీ, వయస్సు ధృవీకరణ పత్రం సమర్పించాలి. ఫ్యామిలీ పెన్షన్ కోసం పెన్షనర్ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులు ఫామ్ 14 లో బ్యాంకుకు వివరాలు సమర్పించాల్సిన అవసరం లేదు.

First published:

Tags: Central Government, Central govt employees, Pension Scheme, Pensioners

ఉత్తమ కథలు