హోమ్ /వార్తలు /బిజినెస్ /

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.25 లక్షల వరకు రుణం

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.25 లక్షల వరకు రుణం

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.25 లక్షల వరకు రుణం
(ప్రతీకాత్మక చిత్రం)

7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ.25 లక్షల వరకు రుణం (ప్రతీకాత్మక చిత్రం)

7th Pay Commission | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Central Government Employees) ప్రభుత్వం నుంచి అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఏడో పే కమిషన్ సిఫార్సుల మేరకు బెనిఫిట్స్ లభిస్తుంటాయి. ఓ పథకం ద్వారా రూ.25 లక్షల వరకు రుణం పొందొచ్చు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు (Central Government Employees) ప్రభుత్వం నుంచి లభించే బెనిఫిట్స్‌లో హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ కూడా (HBA) ఒకటి. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు తక్కువ వడ్డీకే గృహ రుణాలు (Home Loans) పొందొచ్చు. ప్రస్తుతం 7.1 శాతం వార్షిక వడ్డీ రేటుతో హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ లభిస్తోంది. 2023 మార్చి 31 వరకు ఇదే వడ్డీతో అడ్వాన్స్ తీసుకోవచ్చు. హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేటును తగ్గిస్తూ కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2022 ఏప్రిల్ 1న ఆఫీస్ మెమొరండం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేవరకు 7.1 శాతం వార్షిక వడ్డీ వర్తిస్తుంది.

ఏడో పే కమిషన్ సిఫార్సుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ బెనిఫిట్ లభిస్తుంది. ఉద్యోగులు కొత్త ఇంటి నిర్మాణం, ఇంటి నిర్మాణం కోసం ప్లాట్ కొనడం, ఇప్పటికే ఉంటున్న ఇంటిని విస్తరించడం, సిద్ధంగా ఉన్న ఇళ్లను కొనడం, హౌజింగ్ బోర్డులు, డెవలప్‌మెంట్ అథారిటీలు, రిజిస్టర్డ్ బిల్డర్ల నుంచి ఫ్లాట్స్ కొనుగోలు చేయడం కోసం అడ్వాన్స్ తీసుకోవచ్చు. దీనిపై వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే బ్యాంకులు, ఫైనాన్సింగ్ సంస్థలతో పోలిస్తే హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ వడ్డీ రేటు తక్కువ. ఉదాహరణకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో హోమ్ లోన్ తీసుకుంటే వడ్డీ రేటు 8.40 శాతం నుంచి ప్రారంభం అవుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ తీసుకుంటే 7.1 శాతం వార్షిక వడ్డీ చెల్లిస్తే చాలు.

Gold Jewellery: పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం కొంటున్నారా? బిల్లులో ఈ వివరాలు ఉండాలి

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నిర్మాణం కోసం ప్రైవేట్ సంస్థలు, హడ్‌కో, ప్రభుత్వం నుంచి తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించడానికి కూడా హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ తీసుకునే వెసులుబాటు ఉంది. ఉద్యోగికి ఎంత రుణం వస్తుందని అనేదానిపై కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ 2017 రూల్స్ ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 34 నెలల బేసిక్ వేతనాన్ని అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. గరిష్టంగా రూ.25 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఒకవేళ కొనాలనుకున్న ఇల్లు, ఫ్లాట్ విలువ రూ.25 లక్షల లోపు ఉన్నట్టైతే వాటి విలువ ఎంత ఉంటే అంత రుణం వస్తుంది.

ఇక ఇప్పటికే ఉన్న ఇంటిని విస్తరించాలనుకుంటే 34 నెలల బేసిక్ వేతనాన్ని అడ్వాన్స్‌గా తీసుకోవచ్చు. కానీ గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం లభిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణం, ఇంటి విస్తరణ చేయాలనుకుంటే నిజమైన వ్యయంలో 80 శాతం వరకే అడ్వాన్స్ లభిస్తుంది. అయితే సంబంధిత గ్రామీణ ప్రాంతం పట్టణం లేదా నగరం పరిధిలోకి వస్తుందని డిపార్ట్‌మెంట్ హెడ్ సర్టిఫై చేస్తే 100 శాతం అడ్వాన్స్ తీసుకోవచ్చని హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ 2017 రూల్స్ చెబుతున్నాయి.

Bank Strike: బ్యాంకులో పనులున్నాయా? ఆ రోజు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్ పొందాలంటే కనీసం 10 ఏళ్ల నిరంతర సర్వీస్ ఉండాలి. దీన్ని 5 ఏళ్లకు తగ్గించాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు అయితే హౌజ్ బిల్డింగ్ అడ్వాన్స్‌ను వేర్వేరుగా పరిగణించాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది. ఇక ఇప్పటికే బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థల నుంచి గృహ రుణాలు తీసుకున్న ఉద్యోగులు ఈ పథకానికి మారేలా నిబంధనల్ని సవరించాలని కూడా కమిషన్ సిఫార్సు చేసింది.

First published:

Tags: 7th Pay Commission, Central govt employees, Home loan, Housing Loans, Personal Finance

ఉత్తమ కథలు