హోమ్ /వార్తలు /బిజినెస్ /

Cooking Oil: వంట నూనె ధరల్ని లీటర్‌పై రూ.15 వెంటనే తగ్గించాలని కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

Cooking Oil: వంట నూనె ధరల్ని లీటర్‌పై రూ.15 వెంటనే తగ్గించాలని కంపెనీలకు కేంద్రం ఆదేశాలు

Cooking Oil: వంట నూనె ధరల్ని లీటర్‌పై రూ.15 వెంటనే తగ్గించాలని కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
(ప్రతీకాత్మక చిత్రం)

Cooking Oil: వంట నూనె ధరల్ని లీటర్‌పై రూ.15 వెంటనే తగ్గించాలని కంపెనీలకు కేంద్రం ఆదేశాలు (ప్రతీకాత్మక చిత్రం)

Cooking Oil | వంట నూనెల ధరలు మరింత దిగిరాబోతున్నాయి. ఇప్పటికే వంట నూనెల ధరలు (Cooking Oil Prices) లీటర్‌పై రూ.10 నుంచి రూ.20 వరకు తగ్గింది. మరో రూ.15 తగ్గించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. వంట నూనెల ధరల్ని (Cooking Oil Prices) తగ్గించేందుకు చర్యలు తీసుకుంటోంది. లీటర్ నూనెపై వెంటనే రూ.15 తగ్గించాలని వంట నూనెలు తయారు చేసే కంపెనీలను ఆదేశించింది. లీటర్‌పై గరిష్ట రిటైల్ ధర (MRP) రూ.15 తగ్గించాలని ఎడిబుల్ ఆయిల్ అసోసియేషన్స్‌ని ఆదేశించింది. జులై 6న ఎడిబుల్ ఆయిల్స్ కంపెనీలతో ఆహార, ప్రజాపంపిణీ శాఖ జరిపిన సమావేశంలో వంటనూనెల ధరల్ని తగ్గించాలని కోరిన సంగతి తెలిసిందే. ధరల్ని వెంటనే తగ్గించాలని ఆదేశిస్తూ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో వెల్లడించింది.

వంటనూనెల ధరలను తక్షణమే తగ్గించి, ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని, మరియు రిఫైనర్‌లకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. తయారీదారులు, నూనెను శుద్ధి చేసేవారు పంపిణీదారులకు ధరల్ని తగ్గించడం ద్వారా వినియోగదారులకు ప్రయోజనం అందించాలని, ఇది క్రమ పద్ధతిలో జరగాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Credit Card: క్రెడిట్ కార్డ్ బిల్‌ని ఈఎంఐగా మారుస్తున్నారా? ఈ విషయం తెలుసా?

గత నెలలో గ్లోబల్ ఎడిబుల్ ఆయిల్ ధరలు టన్నుకు USD 300-450 తగ్గిన సంగతి తెలిసిందే. కాబట్టి దేశీయంగా వంట నూనెల ధరల్ని తగ్గించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. భారతదేశం తన వార్షిక ఎడిబుల్ ఆయిల్ డిమాండ్‌లో దాదాపు 56 శాతం దిగుమతులే ఉన్నాయి. దీంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఆహార చమురు ధరలు పెరిగినప్పుడు భారతదేశంలో ధరలు పెరుగుతాయి. అంతర్జాతీయంగా ధరలు తగ్గడంతో భారతదేశంలో కూడా ధరలు తగ్గబోతున్నాయి.

కేంద్ర ప్రభుత్వం ప్రతీరోజూ వంటనూనెల ధరల్ని పర్యవేక్షిస్తోంది. వంటనూనెల ధరల్ని అదుపు చేసేందుకు కావాల్సిన చర్యలు తీసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఎడిబుల్ ఆయిల్ ధరలు బాగా తగ్గుతున్నాయని, అందుకే రీటైల్ ధరల్ని తగ్గించడం కోసం భారత ప్రభుత్వం రంగంలోకి దిగిందని, అందులో భాగంగా SEAI, IVPA, SOPA సహా ప్రముఖ పరిశ్రమ ప్రతినిధులతో ఆహార, ప్రజా పంపిణీ శాఖ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసిందని సదరు మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌లో వివరించింది.

Good News: ప్రజలకు మరో గుడ్ న్యూస్... వాటి ధరలు కూడా తగ్గబోతున్నాయి

వినియోగదారుల వ్యవహారాల శాఖ అందించిన సమాచారం ప్రకారం జూన్ 1 నుంచి దేశంలో ఆవ నూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, పామాయిల్ రిటైల్ ధరలు 5 శాతం నుంచి 11 శాతం తగ్గాయి. ఈ ధరలు మరింత తగ్గబోతున్నాయి.

First published:

Tags: Cooking oil, Edible Oil, Personal Finance, Sunflower oil

ఉత్తమ కథలు