హోమ్ /వార్తలు /బిజినెస్ /

Special Economic Zones: ఈ ఎకనమిక్ జోన్స్ ఉద్యోగులందరికీ కేంద్రం బంపరాఫర్.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కి గ్రీన్ సిగ్నల్..

Special Economic Zones: ఈ ఎకనమిక్ జోన్స్ ఉద్యోగులందరికీ కేంద్రం బంపరాఫర్.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కి గ్రీన్ సిగ్నల్..

Work From Home

Work From Home

Special Economic Zones: స్పెషల్ ఎకనమిక్ జోన్స్ లోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. సెజ్‌లలో ఉద్యోగులు అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

కొవిడ్‌ సమయంలో ప్రపంచ వ్యాప్తంగా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ (Work From Home) విధానం మొదలైంది. ఇప్పటికీ చాలా కంపెనీలలో ఈ విధానం అమల్లో ఉంది. కొన్ని కంపెనీలో హైబ్రిడ్‌ మోడల్‌ (Hybrid Model)ను అనుసరిస్తున్నాయి. అయితే ఇప్పుడు స్పెషల్ ఎకనమిక్ జోన్స్(SEZ-Special Economic Zones)లోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం ఓ గుడ్‌న్యూస్ చెప్పింది. సెజ్‌లలో ఉద్యోగులు అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home) అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్ (Piyush Goyal) మీడియా సమావేశంలో వెల్లడించారు.

కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో చిన్న నగరాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, సేవల ఎగుమతులు(Export Of Services) పెరుగుతాయని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. కొన్నేళ్లుగా అనేక వర్గాల నుంచి వస్తున్న అభ్యర్థనలు పరిశీలించిన ప్రభుత్వం ఎకనమిక్‌ జోన్లలో వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌కు అనుమతించిందని తెలిపారు.

అన్ని సెజ్ సెక్టార్‌లలో వర్క్ ఫ్రమ్ హోమ్‌ని అనుమతించాలని నిర్ణయించామని బోర్డ్ ఆఫ్ ట్రేడ్ సమావేశం అనంతరం కేంద్రమంత్రి తెలిపారు. దీనికి సంబంధించి అనే వర్గాల నుంచి అభ్యర్థనలు రాగా, ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

* దేశంలో 8 స్పెషల్ ఎకనమిక్ జోన్స్

వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ నియమాలు స్పెషల్ ఎకనమిక్ జోన్స్‌కు వర్తిస్తాయి. ఇవి భారతదేశంలోని ఇతర ప్రాంతాల కంటే భిన్నమైన ఆర్థిక నిబంధనలకు లోబడి ఉంటాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చారు. ప్రస్తుతం భారతదేశంలో ఎనిమిది SEZలు ఉన్నాయి. శాంతా క్రజ్ (మహారాష్ట్ర), కొచ్చిన్ (కేరళ), కాండ్లా, సూరత్ (గుజరాత్), చెన్నై (తమిళనాడు), విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్), ఫాల్టా (పశ్చిమ బెంగాల్), నోయిడా (ఉత్తర ప్రదేశ్) సెజ్‌లు ఈ లిస్ట్‌లో ఉన్నాయి.

ఇది కూడా చదవండి : రోజూ రూ.50 పెట్టుబడితో రూ.35 లక్షలు అందించే పోస్టాఫీస్‌ స్కీమ్‌.. అర్హత, ప్రయోజనాలు ఇవే..

* జులై కొత్త ప్రకటన

స్పెషల్ ఎకనమిక్ జోన్స్‌లో గరిష్టంగా ఒక సంవత్సరం పాటు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనుమతిస్తామని జులైలో కేంద్రం తెలిపింది. కాంట్రాక్టు ఉద్యోగుల సహా మొత్తం ఉద్యోగులలో గరిష్టంగా 50 శాతం వరకు పొడిగించవచ్చని స్పష్టం చేసింది. యూనిట్‌లోని కాంట్రాక్టు ఉద్యోగుల సహా మొత్తం ఉద్యోగులలో గరిష్టంగా 50 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం పొడిగించవచ్చని ప్రభుత్వం ఆ నోటిఫికేషన్లో తెలిపింది. అవసరాల మేరకు అధిక సంఖ్యలో ఉద్యోగులకు (50 శాతం కంటే ఎక్కువ) అవకాశం ఇవ్వడానికి సెజ్‌ల డెవలప్‌మెంట్ కమిషనర్(DC)కి వెసులుబాటు కల్పించింది.

దీనికి సంబంధించి వాణిజ్య విభాగం విడుదల చేసిన నోటిఫికేషన్‌లో.. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేయడానికి గరిష్టంగా ఒక సంవత్సరం వరకు అనుమతి ఉంది. యూనిట్ల అభ్యర్థనపై DC అనుమతితో ఇందుకు అనుమతి ఉంటుందని స్పష్టం చేసింది. కొత్త నియమం ప్రకారం ఇంటి నుంచి పని చేసే ఉద్యోగులకు డివైజ్‌లు, సురక్షితమైన కనెక్టివిటీని అందించడానికి సెజ్‌ యూనిట్ బాధ్యత వహిస్తుందని జులై నోటీసులో పేర్కొంది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Central Government, Piyush Goyal, Work From Home