RBI: 8.6 కోట్ల ఖాతాదారులకు గుడ్ న్యూస్... కేంద్రం కీలక నిర్ణయం

మీకు అర్బన్ కో-ఆపరేటీవ్ బ్యాంకు, మల్టీ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంకులో అకౌంట్ ఉందా? ఈ బ్యాంకుల్లో మీ డిపాజిట్లు ఉన్నాయా? కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: June 24, 2020, 4:40 PM IST
RBI: 8.6 కోట్ల ఖాతాదారులకు గుడ్ న్యూస్... కేంద్రం కీలక నిర్ణయం
RBI: 8.6 కోట్ల ఖాతాదారులకు గుడ్ న్యూస్... కేంద్రం కీలక నిర్ణయం (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
కో-ఆపరేటీవ్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న ఖాతాదారులకు శుభవార్త. అర్బన్ కో-ఆపరేటీవ్ బ్యాంకులు, మల్టీ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంకుల్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI పర్యవేక్షణలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కో-ఆపరేటీవ్ బ్యాంకుల్ని ఆర్‌బీఐ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర కేబినెట్ ఆర్డినెన్స్‌కు ఆమోద ముద్ర వేసిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించారు. ఆర్డినెన్స్‌పై రాష్ట్రపతి ఆమోదం పొందిన తేదీ నుంచి తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపారు. కో-ఆపరేటీవ్ బ్యాంకులను ఆర్‌బీఐ పర్యవేక్షణలోకి తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉందని 2020 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బిల్లుకు ఆమోదముద్ర పడకపోవడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.

మొత్తం 1,540 కో-ఆపరేటీవ్ బ్యాంకుల్ని ఆర్‌బీఐ పర్యవేక్షణలోకి తీసుకురావాలన్న నిర్ణయం 8.6 కోట్ల ఖాతాదారులకు మేలు చేయనుంది. ఈ బ్యాంకుల్లో వారు దాచుకున్న రూ.4.84 లక్షల కోట్లు సురక్షితం.

ప్రకాశ్ జవదేకర్, కేంద్ర మంత్రి


ఈ ఆర్డినెన్స్‌తో 1,482 అర్బన్ కో-ఆపరేటీవ్ బ్యాంకులు, 58 మల్టీ స్టేట్ కో-ఆపరేటీవ్ బ్యాంకులు ఆర్‌బీఐ పర్యవేక్షణ అధికారాల కిందకు వస్తాయి. ఆర్‌బీఐ అధికారాలు షెడ్యూల్డ్ బ్యాంకులకు వర్తించినట్టే కో-ఆపరేటీవ్ బ్యాంకులకూ ఇకపై వర్తిస్తాయి.

ఇవి కూడా చదవండి:

Paytm: డబ్బులు లేవా? అయినా రూ.1,00,000 వరకు షాపింగ్ చేయొచ్చు

SBI: కరెన్సీ నోట్లు పాడయ్యాయా? ఎస్‌బీఐలో ఫ్రీగా మార్చుకోండి ఇలా 

PAN-Aadhaar Link: జూన్ 30 లోగా పాన్, ఆధార్ లింక్ చేయకపోతే ఈ చిక్కులు తప్పవు
First published: June 24, 2020, 4:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading