ఇండియాలో ప్రస్తుతం ఇ-కామర్స్ బిజినెస్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. చాలా మంది ప్రజలు ఆన్లైన్లో వస్తువులను కొనుగోలు (Online Shopping) చేస్తున్నారు. అయితే కొన్ని కంపెనీలు తమ ప్రొడక్ట్స్‌ను సేల్ చేసుకోవడానికి ఫేక్ రివ్యూలతో (Fake Reviews) కస్టమర్ల దృష్టిని మరలుస్తున్నాయి. ఇలాంటి వాటి కారణంగా చాలా మంది నష్టపోతున్నారు. ఈ పద్ధతులకు స్వస్తి పలికేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రపంచంలోనే తొలిసారిగా ఆన్లైన్ రివ్యూలకు ప్రమాణాలను అమలు చేస్తోంది.
నవంబర్ 25 నుంచి ఆన్లైన్ రివ్యూలపై ప్రభుత్వం విధించిన నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం కొత్తగా రూపొందించిన ప్రమాణాల ప్రకారం.. అన్ని ఇ-కామర్స్ కంపెనీలు, ట్రావెల్, టికెటింగ్ పోర్టల్‌లు, ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్‌లు తమ పోర్టల్లలో అందించే ప్రొడక్ట్స్, సర్వీసుల గురించి పెయిడ్ లేదా స్పాన్సర్డ్ రివ్యూలను స్వచ్ఛందంగా వెల్లడించాలి. అటువంటి కంపెనీలు కొనుగోలు చేసిన లేదా థర్డ్ పార్టీలు రాసిన రివ్యూలను కూడా ప్రచురించలేవు. ప్రొడక్ట్స్, సర్వీసులకు సంబంధించిన నకిలీ, మోసపూరిత రివ్యూల ముప్పును అరికట్టడానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) తీసుకొచ్చిన ఆన్లైన్ కన్స్యూమర్ రివ్యూస్, రేటింగ్‌లపై ప్రభుత్వం సోమవారం కొత్త ప్రమాణాలను వెల్లడించింది. ఏదైనా ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లో ఇటువంటి రివ్యూలను పోస్ట్ చేసే ఇండిపెండెంట్ థర్డ్ పార్టీలకు కూడా ఈ ప్రమాణాలు వర్తిస్తాయి.
Aadhaar Update: ఆధార్ అప్డేట్ తప్పనిసరా? చేయకపోతే ఏమవుతుంది?
BIS ప్రమాణాలను పాటించడంలో వైఫల్యం అన్‌ఫెయిర్ ట్రేడ్ ప్రాక్టీస్‌కి సమానమని, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద అటువంటి సంస్థలపై చర్యలు తీసుకోవచ్చని హెచ్చరించింది. సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ చీఫ్ కమీషనర్ నిధి ఖరే మాట్లాడుతూ.. అటువంటి కొనుగోలు చేసిన రివ్యూలను ఫ్రాడ్ రివ్యూలుగా అభివర్ణించారు. ఆన్లైన్ రివ్యూలు ప్రధానంగా మూడు రంగాలలో వినియోగదారులపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. వీటిలో టూర్ , ట్రావెల్, రెస్టారెంట్, తినుబండారాలు, వినియోగదారు డ్యూరబుల్స్ ఉన్నాయి. కొత్త ప్రమాణాల ప్రకారం.. BIS రివ్యూలను సొలిసిటెడ్, అన్సొలిసిటెడ్గా విభజించింది. ఏదైనా సంస్థలో రివ్యూలను హ్యాండిల్ చేయడానికి బాధ్యత వహించే వ్యక్తిని రివ్యూ అడ్మినిస్ట్రేటర్ అంటారు. రివ్యూవర్లు తమ రివ్యూస్‌ను విత్‌డ్రా చేసుకొనే అవకాశం కూడా ఉంటుంది.
Bharat Gaurav Kashi Darshan Train: రూ.20,000 ధరకే వారం రోజుల కాశీ యాత్ర... ప్యాకేజీ వివరాలివే
యూనియన్ కన్స్యూమర్ ఎఫైర్స్ సెక్రటరీ రోహిత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. పరిశ్రమకు సంబంధించి స్టాండర్డ్ రూట్ అవసరమని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతానికి స్వచ్ఛందంగా వెల్లడించేలా అమలు చేస్తామని, ముప్పు పెరుగుతుంటే, భవిష్యత్తులో దానిని తప్పనిసరి చేస్తామని తెలిపారు. ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఆ అవకాశం ఉంటుందని తెలిపారు. గూగుల్ , మెటా వంటి టెక్నాలజీ మేజర్ల సహా అన్ని పెద్ద కంపెనీల ప్రతినిధులు తుది ప్రమాణాలను రూపొందించిన కమిటీలో భాగమయ్యారని చెప్పారు. తద్వారా రివ్యూలు పరిశ్రమను దెబ్బతీస్తుండటంతో ఆయా కంపెనీల ప్రతినిధులు కూడా కొత్త ప్రమాణాలపై నమ్మకంగా ఉన్నారని పేర్కొన్నారు.
ఆన్లైన్ వినియోగదారుల రివ్యూల కోసం ఇటువంటి నిబంధనలు తీసుకొచ్చిన మొదటి దేశం ఇండియా అని చెప్పారు రోహిత్ కుమార్. రివ్యూలను హోస్ట్ చేసే వెబ్సైట్లను ధ్రువీకరించడానికి BIS రాబోయే 15 రోజుల్లో ఒక కన్ఫర్మిటీ అసెస్మెంట్ స్కీమ్‌ను తీసుకొస్తుందని స్పష్టం చేశారు. వినియోగదారుల సమాచారం కోసం వెబ్సైట్లు BIS ధ్రువీకరణను ప్రదర్శిస్తాయన్నారు. కొత్త ప్రమాణాల ప్రకారం ఆన్లైన్ ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారులను తప్పుదారి పట్టించకుండా ఉండటానికి రివ్యూలను సేకరించిన సమయాన్ని పేర్కొనాలని రోహిత్ కుమార్ సింగ్ చెప్పారు. నకిలీ రివ్యూల వ్యాపారం అందించే కంపెనీలు టర్కీ, మోల్డోవా వంటి దేశాలలో ఉన్నాయని, ఆయా కంపెనీలు వాటికి డబ్బు చెల్లించి రివ్యూలను పొందుతాయని వివరించారు. ఇదే జరుగుతుంటే, ఇకపై సాధ్యం కాదని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, AMAZON INDIA, E-commerce, Flipkart, Online shopping