హోమ్ /వార్తలు /బిజినెస్ /

Ratan Tata: పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీస్‌గా రతన్ టాటా, మరో ఇద్దరు

Ratan Tata: పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీస్‌గా రతన్ టాటా, మరో ఇద్దరు

Ratan Tata: పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీస్‌గా రతన్ టాటా, మరో ఇద్దరు
(ప్రతీకాత్మక చిత్రం)

Ratan Tata: పీఎం కేర్స్ ఫండ్ ట్రస్టీస్‌గా రతన్ టాటా, మరో ఇద్దరు (ప్రతీకాత్మక చిత్రం)

Ratan Tata | పీఎం కేర్స్ ఫండ్ (PM Cares Fund) ట్రస్టీస్‌గా రతన్ టాటాతో పాటు మరో ఇద్దర్ని నియమించింది కేంద్ర ప్రభుత్వం. ప్రజా సేవలో ఉన్నవారితో అడ్వైజరీ బోర్డును కూడా ప్రకటించింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

కేంద్ర ప్రభుత్వం పీఎం కేర్స్ ఫండ్ (PM CARES Fund) ట్రస్టీస్‌గా దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్ టాటాతో పాటు మాజీ లోక్‌సభ స్పీకర్ కరియా ముండా, సుప్రీం కోర్ట్ మాజీ జడ్జ్ కేటీ థామస్‌లను నియమించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi), కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశం జరిగిన మరుసటి రోజు వారి నియామకాలను ప్రకటించడం విశేషం. ట్రస్టీస్‌తో పాటు పీఎం కేర్స్ ఫండ్ అడ్వైజరీ బోర్డును కూడా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రాజీవ్ మెహ్‌రిషి, ఇన్ఫోసిస్ ఫౌండేషన్ మాజీ ఛైర్‌పర్సన్ సుధా మూర్తి, టీచ్ ఫర్ ఇండియా కో-ఫౌండర్, ఇండీకార్ప్స్, పిరామల్ ఫౌండేషన్ సీఈఓ ఆనంద్ షాలను అడ్వైజరీ బోర్డులో నియమించింది ప్రభుత్వం.

కొత్త ట్రస్టీలు, సలహాదారుల భాగస్వామ్యంతో పీఎం కేర్స్ ఫండ్ పనితీరుపై విస్తృతమవుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రజా జీవితంలో వారి అపారమైన అనుభవంతో వివిధ ప్రజా అవసరాలకు ఫండ్‌ను అందించడంలో వారి అనుభవం ఉపయోగపడుతుందని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటనలో వెల్లడించింది.

Good News: రైతులకు ఆ రెండు బ్యాంకుల నుంచి గుడ్ న్యూస్... ఇక కొన్ని గంటల్లోనే

కేంద్ర ప్రభుత్వం కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడం కోసం పీఎం కేర్స్ ఫండ్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారి కారణంగా ఎదురయ్యే అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం కోసం ఈ ఫండ్ ఏర్పాటైంది. ఈ ఫండ్ ద్వారానే పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ గతేడాది మే 29న ప్రారంభమైంది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రుల్ని, సంరక్షకుల్ని కోల్పోయిన పిల్లలకు ఆర్థికంగా మద్దతు ఇచ్చే పథకం ఇది. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ ద్వారా 4,345 మంది పిల్లలకు ఆర్థిక మద్దతు లభిస్తోంది.

SBI Discount: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఎస్‌బీఐ కార్డుతో రూ.10,750 వరకు డిస్కౌంట్

పీఎం కేర్స్ ఫండ్‌కు వ్యక్తులు, సంస్థలు విరాళాలు ఇవ్వొచ్చు. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80జీ ప్రయోజనాలు 100శాతం లభిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డేటా ప్రకారం 2020-21 కాలంలో పీఎం కేర్స్ ఫండ్‌కు రూ.7,031.99 కోట్ల విరాళాలు వచ్చాయి. ఈ ఫండ్‌కు విరాళాలు మాత్రమే ఉంటాయి. వ్యక్తులు లేదా సంస్థల నుంచి విరాళాలతోనే ఫండ్ జమ అవుతుంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు ఉండదు.పీఎం కేర్స్ ఫండ్‌కు ఎక్స్ అఫీషియో ఛైర్మన్‌గా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉంటారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి, హోమ్ శాఖ మంత్రి, ఆర్థిక మంత్రులు ఈ ఫండ్‌కు ఎక్స్ అఫీషియో ట్రస్టీస్‌గా ఉన్నారు.

Published by:Santhosh Kumar S
First published:

Tags: Amit Shah, Pm cares, Pm modi, PM Narendra Modi, Ratan Tata

ఉత్తమ కథలు