Good News: ఆ ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం... ఎంతంటే

Good News: ఆ ఉద్యోగులకు బోనస్ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం... ఎంతంటే (ప్రతీకాత్మక చిత్రం)

Good News | కేంద్ర ప్రభుత్వం గ్రూప్ సీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ, గ్రూప్ బీలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులందరికీ నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ లేదా అడ్ హక్ బోనస్‌ (ad-hoc bonus) ప్రకటించింది. ఎంత బోనస్ లభిస్తుందో తెలుసుకోండి.

  • Share this:
    కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు వరుసగా శుభవార్తలు చెబుతోంది. ఇప్పటికే రైల్వే ఉద్యోగులకు (Railway Employees) ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దసరా, దీపావళి ఫెస్టివల్ సీజన్ కారణంగా రైల్వే ఉద్యోగులకు ఏకంగా 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా (Salary Bonus) ప్రకటించింది. సాధారణంగా 72 రోజుల వేతనాన్ని బోనస్‌గా ప్రకటిస్తుంది. కానీ ఈసారి మరో ఆరు రోజులు అదనంగా బోనస్‌ను ప్రకటిస్తూ మొత్తం 78 రోజుల బోనస్ అందిస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇప్పుడు మరి కొందరు ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్‌ను ప్రకటించింది. దీన్నే అడ్ హక్ బోనస్ అని కూడా పిలుస్తారు.

    IRCTC Tirumala Tour: విజయవాడ నుంచి రూ.3,220 ధరకే తిరుపతి టూర్ ప్యాకేజీ... శ్రీవారి ప్రత్యేక దర్శనం కూడా

    నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ లేదా అడ్ హక్ బోనస్‌కు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖకు చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండీచర్ ప్రకటన చేసింది. గ్రూప్ సీలోని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ, గ్రూప్ బీలోని నాన్ గెజిటెడ్ ఉద్యోగులందరికీ ఈ బోనస్ ఇస్తున్నామని ప్రకటించింది. అంటే ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ స్కీమ్ పరిధిలో లేని ఉద్యోగులకు నాన్ ప్రొడక్టివిటీ లింక్డ్ లేదా అడ్ హక్ బోనస్ లభించనుంది. కేంద్ర పారామిలిటరీ బలగాలు, సాయుధ బలగాల ఉద్యోగులకు కూడా ఈ బోనస్ వర్తిస్తుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండీచర్ తెలిపింది. ఉద్యోగులకు గరిష్టంగా రూ.7,000 వరకు ఈ బోనస్ లభిస్తుంది.

    Jio Plans: ఈ ప్లాన్స్ రీఛార్జ్ చేసి ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఫ్రీగా చూడండి

    ఈ బోనస్ పొందడానికి అర్హతల వివరాలు చూస్తే ఉద్యోగులు 2021 మార్చి 31 నాటికి సర్వీసులో ఉండాలి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వరుసగా ఆరు నెలలు సేవలు అందించి ఉండాలి. వారికే ఈ బోనస్ లభిస్తుంది. ఆరు నెలల నుంచి పూర్తి ఏడాది పనిచేసినవారికి ప్రో-రాటా పద్ధతిలో బోనస్ లభిస్తుంది. ఇక వారానికి 6 రోజుల చొప్పున కనీసం ఏడాదికి 240 రోజులు మూడేళ్లపాటు సేవలు అందించినవారికి కూడా ఈ బోనస్ లభిస్తుంది.

    SBI Savings Account: ఎస్‌బీఐ అకౌంట్ ఆన్‌లైన్‌లో ఓపెన్ చేయండి ఇలా

    ఇక త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా శుభవార్త అందనుంది. కేంద్ర ప్రభుత్వం 2021 జూలై డీఏను ప్రకటించాల్సి ఉంది. ఈసారి 3 శాతం డీఏ పెంచే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం లభిస్తున్న 28 శాతం డీఏకు అదనంగా మరో 3 శాతం డీఏ లభిస్తుంది. మొత్తం 31 శాతం డీఏ లభించే అవకాశం ఉంది. ఇక దీంతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2020 జనవరి నుంచి 2021 జూలై వరకు మూడు డీఏల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆ బకాయిలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే అవకాశం ఉంది.
    Published by:Santhosh Kumar S
    First published: