హోమ్ /వార్తలు /బిజినెస్ /

PM Fasal Bima Yojana: రైతులకు శుభవార్త... ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు రూ.16,000 కోట్లు

PM Fasal Bima Yojana: రైతులకు శుభవార్త... ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు రూ.16,000 కోట్లు

PM Fasal Bima Yojana: రైతులకు శుభవార్త... ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు రూ.16,000 కోట్లు
(ప్రతీకాత్మక చిత్రం)

PM Fasal Bima Yojana: రైతులకు శుభవార్త... ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనకు రూ.16,000 కోట్లు (ప్రతీకాత్మక చిత్రం)

PM Fasal Bima Yojana | రైతులకు శుభవార్త. రైతుల పంటకు బీమా కల్పించే ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన-PMFBY పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.16,000 కోట్లు కేటాయించింది.

కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన-PMFBY పథకానికి 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ.16,000 కోట్లు కేటాయించింది. రైతులు తమ పంటలకు బీమా పొందేందుకు ఈ పథకం ఉపయోగపడుతుంది. రైతులకు ఎక్కువ మొత్తంలో ప్రయోజనం కల్పించేందుకు ఈ పథకం ఉపయోగపడుతుందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి రూ.305 కోట్లు ఎక్కువగా కేటాయింపులు వచ్చాయని, దేశంలో వ్యవసార రంగ అభివృద్ధికి ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తుందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ అభిప్రాయపడింది. అసలు ఏంటి ఫసల్ బీమా యోజన పథకం, ఈ స్కీమ్‌తో రైతులకు లాభమేంటీ? తెలుసుకోండి.

కేంద్ర ప్రభుత్వం ఐదేళ్ల క్రితం 2016 జనవరి 13న ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన-PMFBY పథకాన్ని ప్రారంభించింది. అకాల వర్షాలు, ఇతర వాతావరణ పరిస్థితుల కారణంగా రైతులు తమ పంటను నష్టపోతున్నారన్న వార్తల్ని మనం తరచూ చూస్తూనే ఉంటాం. అకాల వర్షాలు, వరదలు, తుఫానుల కారణంగా ఎకరాలకొద్ది పంట నష్టపోతుంటారు రైతులు. అందుకే రైతు తన పంటకు బీమా తీసుకునే సదుపాయం కల్పిస్తుంది ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకం. విత్తనాలు నాటడం దగ్గర్నుంచి పంటకోతల వరకు ఎప్పుడు ఎలాంటి నష్టం వచ్చినా ఈ పథకం ద్వారా బీమా లభిస్తుంది. ఆర్థికంగా నష్టపోయిన రైతులు వ్యవసాయానికి దూరం కాకుండా ఈ పథకం ఆదుకుంటుంది.

LPG Gas Cylinder Subsidy: మీకు గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తుందా? త్వరలో షాక్ తప్పదు

SBI Cheque Book: ఎస్‌బీఐ చెక్ బుక్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేయండిలా

కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ శాఖ లెక్కల ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద పంట బీమా పథకం ఇది. ప్రీమియం విషయంలో మూడో అతిపెద్ద బీమా పథకం. ఈ పథకానికి రైతులు ఎవరైనా దరఖాస్తు చేయొచ్చు. రుణాలు తీసుకొని పంటలు పండిస్తున్నవారికి కూడా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన-PMFBY వర్తిస్తుంది. అన్ని రకాల ఆహార పంటలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఏటేటా 5.5 కోట్ల మంది రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేస్తుంటారు. వీరిలో 84 శాతం మంది చిన్న రైతులే. బీమా పొందేందుకు రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఖరీఫ్ పంటలకు 2 శాతం, రబీ పంటలకు 1.5 శాతం ప్రీమియం చెల్లించాలి. హార్టికల్చర్ పంటలకు 5 శాతం ప్రీమియం చెల్లించాలి.

Railway Concessions: మీరు విద్యార్థులా? నిరుద్యోగులా? రైలులో ఉచిత ప్రయాణం, టికెట్‌పై రాయితీ

Aadhaar Card: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? ఇలా మార్చేయండి

పంట నష్టపోయిన రైతులు 72 గంటల్లో దగ్గర్లో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్‌కు లేదా క్రాప్ ఇన్స్యూరెన్స్ యాప్‌లో రిపోర్ట్ చేయాలి. అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్‌కు బీమా డబ్బులు వస్తాయి. ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను https://pmfby.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఈ పథకం ద్వారా ఇఫ్పటి వరకు 89,73,755 మంది రైతులు ప్రయోజనం పొందారు. మొత్తం 1,83,56,666 దరఖాస్తులు వచ్చాయి. వారిలో రుణాల ద్వారా పంటలు వేసిన రైతుల నుంచి వచ్చిన దరఖాస్తులు 1,16,21,569 కాగా, రుణాలు తీసుకోని రైతుల దరఖాస్తులు 67,35,097. మొత్తం సమ్ అష్యూర్డ్ రూ.74 వేల కోట్లపైనే. లాక్‌డౌన్ సమయంలో 70 లక్షల మంది అర్హులైన రైతుల అకౌంట్‌లోకి రూ.8,741 కోట్లు ట్రాన్స్‌ఫర్ చేయడం విశేషం.

First published:

Tags: Farmer, Farmers, PM Kisan Maan Dhan Yojana, PM Kisan Scheme, Pradhan Mantri Fasal Bima Yojana, Pradhan Mantri Kisan Maandhan Yojana, Pradhan Mantri Kisan Samman Nidhi

ఉత్తమ కథలు