CENTRAL BOARD OF DIRECT TAXES ISSUED NOTIFICATION WITH PAN CARD NEW RULE FOR DEPOSITS AND WITHDRAWALS SS
PAN Card New Rule: లావాదేవీలు జరిపేవారికి అలర్ట్... పాన్ కార్డ్ కొత్త రూల్
PAN Card New Rule: లావాదేవీలు జరిపేవారికి అలర్ట్... పాన్ కార్డ్ కొత్త రూల్
(ప్రతీకాత్మక చిత్రం)
PAN Card New Rule | పాన్ కార్డ్ విషయంలో మరో కొత్త రూల్ అమలులోకి వచ్చింది. బ్యాంకులో డబ్బులు డిపాజిట్ చేయడం లేదా విత్‌డ్రా (Cash Withdrawals) చేసేవారికి ఈ కొత్త రూల్ వర్తిస్తుంది.
ఆర్థిక లావాదేవీల కోసం పాన్ కార్డ్ (PAN Card) వాడేవారికి అలర్ట్. పాన్ కార్డ్ విషయంలో కొత్త రూల్‌ను ప్రకటించింది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT). ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేసినా, డిపాజిట్ చేసినా పాన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ (Aadhaar Number) తప్పనిసరిగా వెల్లడించాలి. CBDT రూల్స్ ప్రకారం భారీ మొత్తంలో విత్‌డ్రా చేసినా, డిపాజిట్ చేసినా పాన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ వెల్లడించాల్సిందే. అంతేకాదు బ్యాంకులో లేదా పోస్ట్ ఆఫీసులో కరెంట్ అకౌంట్, క్యాష్ క్రెడిట్ అకౌంట్ ఓపెన్ చేసినా పాన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ వివరాలు ఇవ్వాలి. ఇందుకోసం ఆదాయపు పన్ను నిబంధనలు-1962 లో పలు సవరణలు చేసింది CBDT.
ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకేసారి రూ.20 లక్షలు లేదా వేర్వేరు సందర్భాల్లో మొత్తం కలిపి రూ.20 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ చేసినా, విత్‌డ్రా చేసినా ఈ రూల్ వర్తిస్తుంది. కోఆపరేటీవ్ బ్యాంకుల్లో కూడా డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్‌కు కూడా వర్తిస్తుంది. పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డులోని డెమోగ్రఫిక్, బయోమెట్రిక్ సమాచారం ప్రిన్సిపాల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ (సిస్టమ్స్), డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ (సిస్టమ్స్) ఈ వివరాలను సెక్షన్ 139ఏ ప్రకారం ధృవీకరిస్తుంది.
ఇలా భారీ మొత్తంలో లావాదేవీలు చేయాలనుకునే వ్యక్తి తన దగ్గర పాన్ కార్డ్ లేనట్టైతే లావాదేవీ చేసే తేదీకి కనీసం ఏడు రోజుల ముందు పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని CBDT నోటిఫికేషన్ చెబుతోంది. ఇప్పటికే ఒక రోజులో బ్యాంకులో రూ.50,000 కన్నా ఎక్కువ డిపాజిట్ చేయడానికి పాన్ కార్డ్ వివరాలు వెల్లడించాలన్న రూల్ ఉంది.
ఆదాయపు పన్ను చట్టంలోని నిబంధనల ప్రకారం 18 రకాల లావాదేవీలకు పాన్ కార్డ్ వివరాలు తప్పనిసరిగా వెల్లడించాలి. వాహనాల కొనుగోలు లేదా అమ్మకం, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం, క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డుకు దరఖాస్తు చేయడం, హోటల్ లేదా రెస్టారెంట్లో ఒకేసారి రూ.50,000 కన్నా ఎక్కువ నగదు చెల్లింపులు చేయడం, రూ.50,000 కన్నా ఎక్కువగా మ్యూచువల్ ఫండ్ యూనిట్స్ కొనడం లాంటి పలు సందర్భాల్లో పాన్ కార్డ్ హోల్డర్లు తప్పనిసరిగా తమ పాన్ నెంబర్ వెల్లడించాల్సిందే.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.