
ప్రతీకాత్మక చిత్రం
2019-20 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువును జూలై 31 నుంచి ఆగస్టు 31 వరకు పొడిగించారు.
ఐటీఆర్, ఆదాయ పన్ను రిటర్న్స్ దాఖలు చేసేందుకు తుది గడువును నెల రోజుల పాటు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, సీబీడీటీ అధికారికంగా వెలువరించింది. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం ప్రత్యేకంగా పేర్కొన్న పన్ను చెల్లింపుదారులు 2019-20 అసెస్మెంట్ ఇయర్‌కు సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలు గడువును జూలై 31 నుంచి ఆగస్టు 31 వరకు పొడిగించారు. కాగా ఆడిటింగ్ చేయించవలసిన అవసరం లేని పన్ను చెల్లింపుదారులతో పాటు, హిందూ అవిభాజ్య కుటుంబాలు, అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్, వ్యాపార సంస్థలకు ఇది వర్తించనుంది. కాగా పన్ను చెల్లింపుదారులు ఇబ్బందులు ఎదర్కొనకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు.
Published by:Krishna Adithya
First published:July 23, 2019, 22:38 IST