జీవితంలో ఎదురయ్యే అనుకోని అవసరాలకు సరిపడా డబ్బు అందరి దగ్గరా ఉండదు. ఆ ఆపదను తీర్చుకోవడానికి చాలా మంది రుణాలను ఆశ్రయిస్తారు. బయట అధిక వడ్డీలకు అప్పులు చేయడం కంటే.. బ్యాంకుల సేవలను ఉపయోగించుకోవడం మేలు. బ్యాంకులు అందించే పర్సనల్ లోన్ కంటే కూడా గోల్డ్ లోన్ (Gold Loan) తీసుకోవడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతారు. గోల్డ్ లోన్‌పై వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. పైగా లోన్ మంజూరుకు పెద్దగా టైమ్ పట్టదు. నిమిషాల్లోనే అవసరమైన డబ్బు చేతికి అందుతుంది. తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించిన తరువాత బ్యాంకులు కుదవ పెట్టిన ఆభరణాలను తిరిగి ఇచ్చేస్తాయి. ఇందులో రిస్క్ కూడా పెద్దగా ఉండదు. అయితే గోల్డ్ లోన్‌లపై బ్యాంకులను బట్టి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. Bankbazaar.com డేటా ప్రకారం.. రెండేళ్ల కాలపరిమితితో కూడిన రూ.5 లక్షల గోల్డ్ లోన్లపై 9 శాతం కంటే తక్కువ వడ్డీ రేటు వసూలు చేస్తున్న బ్యాంకుల వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రభుత్వ రంగ బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండేళ్ల కాలపరిమితితో కూడిన రూ.5 లక్షల గోల్డ్ లోన్‌పై సంవత్సరానికి 8.1 శాతం అత్యల్ప వడ్డీని వసూలు చేస్తోంది. దీంతో లోన్ తీసుకున్నవారు ప్రతి నెలా ఈఎంఐగా రూ.22,636 చెల్లించాల్సి ఉంటుంది.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకింగ్ దిగ్గజం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండేళ్ల కాలపరిమితి గల రూ.5 లక్షల గోల్డ్ లోన్‌పై 8.2 శాతం వడ్డీ రేటును విధిస్తోంది. రుణం తీసుకున్నవారు ప్రతి నెలా రూ.22,659 ఈఎంఐ చెల్లించాల్సి వస్తుంది.
పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్
గోల్డ్ లోన్లపై చౌక వడ్డీ రేట్లను విధించే బ్యాంకుల జాబితాలో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ కూడా మూడో స్థానంలో నిలిచింది. ఈ బ్యాంక్ రూ.5 లక్షల బంగారు రుణంపై 8.25 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఈ గోల్డ్ లోన్ తీసుకున్నవారు నెలకు ఈఎంఐగా రూ.22,671 చెల్లించాలి.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ రెండేళ్ల కాలపరిమితి గల రూ.5 లక్షల గోల్డ్ లోన్‌పై 8.30 శాతం వడ్డీని విధిస్తోంది. ఈఎంఐగా రూ.22,682 చెల్లించాల్సి ఉంటుంది.
యూకో బ్యాంక్ , బ్యాంక్ ఆఫ్ బరోడా
ప్రభుత్వ యాజమాన్యంలోని యూకో బ్యాంక్ కూడా గోల్డ్ లోన్లపై తక్కువ వడ్డీని వసూలు చేస్తోంది. రెండేళ్ల కాలపరిమితి గల రూ.5 లక్షల గోల్డ్ లోన్‌పై ఈ బ్యాంక్ 8.5 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. ఈ లోన్‌పై రూ.22,728 ఈఎంఐగా బ్యాంకు నిర్ణయించింది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా రూ.5 లక్షల గోల్డ్ లోన్‌పై 8.5 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. ఈఎంఐగా రూ.22,728ను నిర్ణయించింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్
ప్రభుత్వ యాజమాన్యంలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ రూ.5 లక్షల బంగారు రుణాలపై సంవత్సరానికి 8.65 శాతం వడ్డీని వసూలు చేస్తోంది. రుణ గ్రహీతలు ఈఎంఐగా రూ.22,762 చెల్లించాల్సి ఉంటుంది. మరో ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ బ్యాంక్ కూడా రూ.5 లక్షల గోల్డ్ లోన్‌పై సంవత్సరానికి 8.65 శాతం వడ్డీని వసూలు చేస్తుంది.
ఫెడరల్ బ్యాంక్
ప్రైవేట్ రంగానికి చెందిన ఫెడరల్ బ్యాంక్ రెండేళ్ల కాలపరిమితి గల రూ.5 లక్షల గోల్డ్ లోన్‌పై 8.99 శాతం వడ్డీని వసూలు చేస్తుంది. ఈఎంఐగా రూ.22,840 చెల్లించాల్సి వస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank loans, Gold loans, Sbi loans