FD Rates | ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తీపికబురు అందించింది. కస్టమర్లకు ఊరట కలిగే ప్రకటన చేసింది. కస్టమర్లకు ఒకేసారి రెండు శుభవార్తలు అందించింది. దీంతో బ్యాంక్‌లో (Bank) అకౌంట్ కలిగిన వారికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవచ్చు. మరీముఖ్యంగా బ్యాంక్‌లో డబ్బులు (Money) దాచుకోవాలని భావించే వారికి బెనిఫిట్ కలుగుతుందని చెప్పుకోవచ్చు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచింది. రూ. 2 కోట్లలోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచినట్లు బ్యాంక్ వెల్లడించింది. బ్యాంక్ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. మార్చి 15 నుంచి సేవింగ్స్ ఖాతాలపై రేట్ల పెంపు వర్తిస్తుంది. కస్టమర్లకు సేవింగ్స్ ఖాతాలపై గరిష్టంగా 3.3 శాతం వరకు వడ్డీ లభిస్తుంది. కాగా ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు పెంపు ఇప్పటికే అమలులోకి వచ్చింది. రెగ్యులర్ కస్టమర్లకు 6.75 శాతం వరకు, సీనియర్ సిటిజ్స్‌కు 7.25 శాతం వరకు వడ్డీ వస్తుంది.
బడ్జెట్ ధరలో అదిరే ఎలక్ట్రిక్ స్కూటర్ .. ఒక్కసారి చార్జ్ చేస్తే 120 కి.మి వెళ్లొచ్చు, 3 ఏళ్లు వారంటీ!
సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేటు బ్యాలెన్స్ ప్రాతిపదికన మారుతుంది. రూ. 10 కోట్ల వరకు బ్యాలెన్స్ కలిగిన వారికి 2.9 శాతం వడ్డీ వస్తుంది. రూ. 10 కోట్ల నుంచి రూ. 1000 కోట్ల వరకు బ్యాలెన్స్ కలిగిన వారికి వడ్డీ రేటు 3 శాతంగా ఉంటుంది. ఇకపోతే రూ. 1000 కోట్లకు పైన బ్యాలెన్స్ ఉన్న వారికి వడ్డీ రేటు 3.3 శాతంగా లభిస్తుంది.
కుప్పకూలిన అతిపెద్ద బ్యాంక్.. డబ్బులు లేక దివాలా, ఒకే రోజు రూ.6 లక్షల కోట్లు మాయం
ఇక వడ్డీ రేట్ల విషయానికి వస్తే.. 7 నుంచి 14 రోజుల ఎఫ్‌డీలపై 4 శాతం, 15 నుంచి 45 రోజుల ఎఫ్‌డీలపై 4.25 శాతం, 46 నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.5 శాతంగాఉంది. 91 నుంచి 179 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5 శాతం వడ్డీ పొందొచ్చు. 180 నుంచి 364 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5.5 శాతంగా ఉంది. ఏడాది నుంచి రెండేళ్ల ఎఫ్‌డీలపై 6.75 శాతం వడ్డీ సొంతం చేసుకోవచ్చు. 2 ఏళ్ల నుంచి మూడేళ్ల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 6.5 శాతం, మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై 6.25 శాతం వడ్డీ లభిస్తుంది. ఇకపోతే సీనియర్ సిటిజన్స్‌కు 0.5 శాతం అధిక వడ్డీ వస్తుంది. అందువల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు. కాగా మీరు ఎంచుకునే టెన్యూర్ ప్రాతిపదికన మీకు వచ్చే వడ్డీ కూడా మారుతుందని గుర్తించుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bank, Bank account, Bank news, Banks, Central Bank of India, FD rates, Fixed deposits, Saving account