హోమ్ /వార్తలు /బిజినెస్ /

Bank News: కస్టమర్లకు అదిరే శుభవార్త.. ప్రభుత్వ బ్యాంక్ కీలక నిర్ణయం!

Bank News: కస్టమర్లకు అదిరే శుభవార్త.. ప్రభుత్వ బ్యాంక్ కీలక నిర్ణయం!

Bank News: కస్టమర్లకు అదిరే శుభవార్త.. ఈ ప్రభుత్వ బ్యాంక్ కీలక నిర్ణయం!

Bank News: కస్టమర్లకు అదిరే శుభవార్త.. ఈ ప్రభుత్వ బ్యాంక్ కీలక నిర్ణయం!

FD Rates | బ్యాంక్ కస్టమర్లకు అదిరే శుభవార్త. తాజాగా మరో బ్యాంక్ కూడా డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచేసింది. దీంతో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగనుంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Fixed Deposits | ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా తీపికబురు అందించింది. కీలక నిర్ణయం తీసుకుంది. డిపాజిట్ రేట్లు (FD) పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని వల్ల బ్యాంక్‌లో డబ్బులు దాచుకోవాలని భావించే వారికి ఊరట కలుగుతుందని చెప్పుకోవచ్చు. గతంలో కన్నా ఇకపై అధిక రాబడి (Money) సొంతం చేసుకోవచ్చు. బ్యాంక్ ఎఫ్‌డీ రేట్ల పెంపు నిర్ణయం ఇప్పటికే అమలులోకి వచ్చింది.

బ్యాంక్ ఎఫ్‌డీ రేట్ల పెంపును గమనిస్తే.. రూ. 2 కోట్లలోపు డిపాజిట్లకు వర్తిస్తుంది. సాధారణ కస్టమర్లకు ఇప్పుడు 7 రోజుల నుంచి పదేళ్ల వరకు ఎఫ్‌డీలపై 4 శాతం నుంచి 6.25 శాతం వరకు వడ్డీ వస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్‌కు అయితే 4.5 శాతం నుంచి 6.75 శాతం వడ్డీ వస్తుంది. ఏడాది నుంచి రెండేళ్ల వరకు టెన్యూర్‌లోని ఎఫ్‌డీలపై గరష్టంగా 6.75 శాతం వడ్డీ ఉంది. సీనియర్ సిటిజన్స్‌కు అయితే 7.25 శాతం వరకు వడ్డీ లభిస్తుంది.

శుభవార్త.. రూ.3,400 పతనమైన బంగారం ధర!

7 రోజుల నుంచి 14 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4 శాతంగా ఉంది. 15 నుంచి 45 రోజుల ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 4.25 శాతం వడ్డీ పొందొచ్చు. 46 నుంచి 90 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 4.5 శాతంగా ఉంది. 91 నుంచి 179 రోజుల ఎఫ్‌డీలపై వడ్డీ రేటు 5 శాతంగా లభిస్తోంది. 180 నుంచి 364 రోజుల ఎఫ్‌డీలపై అయితే వడ్డీ రేటు 5.5 శాతంగా ఉంది. ఏడాది నుంచి రెండేళ్ల వరకు టెన్యూర్‌లోని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటు 6.75 శాతంగా ఉంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల ఎఫ్‌డీలపై 6.5 శాతం వడ్డీ లభిస్తోంది. మూడేళ్ల నుంచి పదేళ్ల వరకు టెన్యూర్‌లోని డిపాజిట్లపై వడ్డీ రేటు 6.25 శాతంగా ఉంది.

ఫోన్‌పే, గూగుల్ పే వాడే వారికి శుభవార్త.. క్షణాల్లో రూ.5 లక్షల లోన్!

సీనియర్ సిటిజన్స్‌కు అయితే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అదనపు వడ్డీ బెనిఫిట్ ఉంది. 0.5 శాతం మేర అధిక వడ్డీని సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా బ్యాంక్ 444, 555, 999 రోజులతో ఫిక్స్‌డ్ డిపాజిట్ సేవలు అందిస్తోంది. వీటిపై వరుసగా 7.85 శాతం, 7.5 శాతం, 7 శాతం చొప్పున వడ్డీ పొందొచ్చు. ఆర్‌బీఐ కీలక పాలసీ రేటు రెపో రేటును పెంచుకుంటూ రావడం ఇందుకు కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లు పెంచుతున్నాయి. ఇప్పటికే చాలా బ్యాంకులు ఈ దారిలో పయనించాయి. ఇప్పుడు ఈ బ్యాంక్‌ కూడా వీటి జాబితాలోకి చేరింది. కాగా బ్యాంకులు కూడా రుణ రేట్లు పెంచేశాయి. దీని వల్ల రుణ గ్రహీతలపై ప్రతికూల ప్రభావం పడుతోంది.

First published:

Tags: Banks, Central Bank of India, FD rates, Fixed deposits, Money