రుణమాఫీ పథకాలు ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమే... ఆర్బీఐ మాజీ గవర్నర్ వై వీ రెడ్డి హెచ్చరిక

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా పథకాలు తెస్తున్నాయి. వ్యవసాయ రంగానికి ప్రయోజనం కంటే రైతులకు డబ్బును చేరవేయడమే లక్ష్యంగా అవి రూపుదిద్దుకుంటున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: February 18, 2019, 11:27 AM IST
రుణమాఫీ పథకాలు ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమే... ఆర్బీఐ మాజీ గవర్నర్ వై వీ రెడ్డి హెచ్చరిక
వై వీ రెడ్డి (File)
Krishna Kumar N | news18-telugu
Updated: February 18, 2019, 11:27 AM IST
రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ వై వీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెస్తున్న పథకాలు వ్యవసాయ రంగంతోపాటూ, ఆర్థిక వ్యవస్థకు పెను భారంగా పరిణమిస్తాయని అన్నారు. ఈ స్కీములు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్థిక పరిస్థితులపై వ్యతిరేక ప్రభావం చూపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పథకాల వల్ల తలెత్తే పరిస్థితులు ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసే ప్రమాదం ఉందన్న ఆయన... ఇలాంటి పథకాలు తెచ్చే బదులు... వ్యవసాయ పరిరక్షణ నిధి లాంటిది ఏర్పాటు చేసి... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందులో భాగస్వామ్యంగా ఉంటే బాగుంటుందన్నారు. రాజస్థాన్, జైపూర్‌లోని వ్యాస్ మెమొరియల్ లెక్చర్‌లో వై వీ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఎలాగైతే ఏటా రైతులకు ఎకరానికి రూ.8,000 ఇస్తోందో, అలాగే కేంద్రం చిన్న, మధ్య తరహా రైతులకు ఏటా రూ.6,000 ఇస్తామని బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించడంపై వై వీ రెడ్డి అభ్యంతరకరంగా మాట్లాడారు.

కేంద్రం ప్రకటించిన కొన్ని రోజులకే... ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా తాము అధికారంలోకి వస్తే, ఇలాంటి స్కీమే తెస్తామని హామీ ఇచ్చింది. ఇలాంటి స్కీం వల్ల కేంద్రం 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.70,000 కోట్లు రైతులకు ఇవ్వాల్సి ఉంటుందన్న ఆయన... ఇది ఆర్థిక వ్యవస్థకు భారంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి పథకం అమలు చెయ్యాలంటే... ముందు పాలనా యంత్రాంగం పటిష్టంగా ఉండాలనీ, ల్యాండ్ రికార్డులు పక్కాగా ఉండాలనీ, రాష్ట్రాలతో కేంద్రానికి సమన్వయం ఉండాలని కోరారు.


దేశ ఆర్థిక వృద్ధినీ, ఆర్థిక స్థిరత్వాన్నీ తీవ్రంగా ప్రభావితం చెయ్యగలిగే శక్తి ఈ పథకాలకు ఉంది. ఇవి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయి. కాబట్టి మనం లోతుగా ఆలోచించి, కొత్త మార్గంలో వెళ్లాలి. ఇందుకు దేశవ్యాప్తంగా అందరూ ఒకే మాటపై నిలబడాలి. ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భాగస్వామ్యం కావాలి. -
వై వీ రెడ్డి, ఆర్బీఐ మాజీ గవర్నర్
కొన్ని పేద రాష్ట్రాల్లో వ్యవసాయం అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉంది. ధనిక రాష్ట్రాల్లో పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది. కేంద్రం తెస్తున్న స్కీం అన్ని రాష్ట్రాలకూ ఒకే రకంగా వర్తించడం కరెక్టు కాదని అన్నారు వై వీ రెడ్డి. అంతేకాదు రాష్ట్రాలు ఎలాంటి గణాంకాలూ, వాస్తవ రికార్డులనూ పరిగణనలోకి తీసుకోకుండా రైతులకు రుణమాఫీ ప్రకటించేస్తుండటంపైనా ఆయన అభ్యంతరం తెలిపారు. ఇలాంటి నిర్ణయాలు రైతుల్లో బాధ్యతను దూరం చేసి... రుణమాఫీ కోసం ఎదురుచూసేలా చేస్తాయనీ, ఇదో ఫ్యాషన్ అయిపోతుందని ఒకింత ఘాటుగానే స్పందించారు వై వేణుగోపాల్ రెడ్డి.

 

ఇవి కూడా చదవండి :

Loading...

ఉల్లిపాయ తొక్కలతో ప్రయోజనాలు... అవేంటో తెలిస్తే, తొక్కలు అస్సలు పారేయరు...


రోజుకు 3 ఖర్జూరాలు చొప్పున వారం తినండి... మీకు కలిగే చక్కటి ప్రయోజనాలు ఇవి...


ఎంతకీ జ్వరం తగ్గట్లేదా... ఇలా చెయ్యండి... అరగంటలో తగ్గుతుంది...

First published: February 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...