Cement Rate | కొత్త ఇల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారా? లేదంటే ఇప్పటికే కొత్త ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించారా? అయితే మీకు ముఖ్యమైన అలర్ట్. ఎందుకంటే ఈ నెలలో సిమెంట్ ధరలు (Cement Price) పెరిగే అవకాశం ఉంది. సిమెంట్ (Cement) కంపెనీలు ధరల పెంపునకు సిద్ధం అయ్యాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇదే జరిగితే కొత్త ఇల్లు కట్టుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు.
సిమెంట్ కంపెనీలు సిమెంట్ ధరను ఒక్కో బస్తాకు రూ. 10 నుంచి రూ. 30 వరకు పెంచొచ్చని ఎంకాయ్ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పేర్కొంటోంది. ధరల పెంపు నవంబర్ నెలలో ఉండొచ్చని తెలియజేస్తోంది. కాగా సిమెంట్ ధర గత నెలలో బస్తాకు రూ. 3 నుంచి రూ. 4 వరకు పెరిగిన విషయం తెలిసిందే.
శుభవార్త.. రూ.2 వేలు పతనమైన బంగారం ధర.. నెల రోజుల్లోనే భారీగా దిగొచ్చిన గోల్డ్!
ఎంకాయ్ గ్లోబల్ ఇటీవల సెక్టోరల్ రిపోర్ట్‌ను విడుదల చేసింది. అక్టోబర్ నెలలో సిమెంట్ ధరలు సగటున బస్తాకు రూ.3 నుంచి 4 వరకు పెరిగాయని పేర్కొంది. నెలవారీ ప్రాతిపదికన చూస్తే.. దక్షిణ భారత దేశం, తూర్సు భారత దేశంలో సిమెంట్ ధర 2 నుంచి 3 శాతం వరకు పెరిగాయని తెలిపింది. అయితే ఉత్తర, మధ్య భారత దేశంలో మాత్రం సిమెంట్ ధరలు 1 నుంచి 2 శాతం వరకు తగ్గాయని పేర్కొంది.
వచ్చే వారంలో బ్యాంకులు 3 రోజులు పని చేయవు.. ఎప్పుడెప్పుడంటే?
సిమెంట్ కంపెనీలు నవంబర్ నెలలో 22న సిమెంట్ ధరలను పెంచనున్నాయని వివరించింది. బస్తా సిమెంట్ రేటు రూ.10 నుంచి రూ. 30 వరకు పెరగొచ్చని అంచనా వేసింది. అక్టోబర్ నెలలో రుతు పవనాలు, కార్మికుల కొరత వంటి అంశాల కారణంగా డిమాండ్‌పై ప్రభావం పడిందని తెలిపింది.
కాగా సిమెంట్ ధరల పెంపు అంశం నేపథ్యంలో ఇప్పడు ఇల్లు కట్టుకునే వారు ముందుగానే సిమెంట్‌ను కొనుగోలు చేడయం ఉత్తమం అని చెప్పుకోవచ్చు. లేదంటే ధరలు పెరిగితే మాత్రం అప్పుడు జేబుకు చిల్లులు పడతాయి. అదనపు డబ్బులను చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల మీరు ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. ధరల పెంపు అంచనాల నడుమ ముందుగానే మీకు అవసరమైన సిమెంట్‌ను కొనేయడం ఉత్తమం. సిమెంట్ ధరల పెంపు కారణంగా సిమెంట్ తయారీ కంపెనీల మార్జిన్లపై సానుకూల ప్రభావం ఉంటుందని ఎంకాయ్ గ్లోబల్ పేర్కొంటోంది. అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా ధరలు తగ్గుతున్నాయని తెలిపింది. దీని వల్ల సిమెంట్ కంపెనీలకు కలిసి వస్తుందని పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cement, Home loan, House, Price Hike