ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్నెట్ సెర్చ్(Internet Search) సౌకర్యాన్ని కల్పిస్తున్న అమెరికా కంపెనీ గూగుల్‌పై(Google) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (CCI) రూ.1,337.76 కోట్ల జరిమానా(Penalty) విధించింది. ఆండ్రాయిట్ మొబైల్ డివైజ్ ఎకో సిస్టమ్ లో తన ఆధిపత్య స్థానాన్ని గూగుల్ దుర్వినియోగం చేస్తోందని సీసీఐ పేర్కొంది. ఈ మేరకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా గూగుల్‌పై ఈ జరిమానా విధించింది. అంతే కాకుండా.. గూగుల్ అందించే ఉచిత ఇన్ స్టాల్డ్ యాప్స్ ను తొలగించకుండా నిరోధించడం వంటివి చేయకుండదంటూ పలు సూచనలు చేసింది.
Competition Commission slaps Rs 1,337.76 crore penalty on Google for abusing dominant position in markets in android mobile device ecosystem
— Press Trust of India (@PTI_News) October 20, 2022
అన్యాయమైన వ్యాపార విధానాలను ఆపాలని సీసీఐ ప్రముఖ ఇంటర్నెట్ కంపెనీని ఆదేశించింది . నిర్ణీత గడువులోగా తన పనితీరును మార్చుకోవాలని గూగుల్‌ను ఆదేశించినట్లు కమిషన్ గురువారం అధికారిక సమాచారంలో తెలిపింది.
ప్రతీ ఒక్కరి చేతిలో ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ అనేది ఉంటుంది. అయితే ఆ మొబైల్ లో ప్రతీ అప్లికేషన్ పని చేయాలంటే.. దానిలో ఓఎస్ (ఆపరేటింగ్ సిస్టమ్ ) అనేది ఉండాలి. దీనిని గూగుల్ సంస్థ 2005లో కొనుగోలు చేసింది. ప్రతీ మొబైల్ కంపెనీలు కూడా ఇదే ఓఎస్ ను వాడుతున్నాయి. ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు.. గూగుల్ ప్లేస్టోర్, గూగుల్ క్రోమ్, యూట్యూబ్ తదితర అప్లికేషన్లను గూగుల్ కలిగి ఉంది. వీటిని వాడే సమయంలో నియమ నిబంధనల ఆధారంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులకు కూడా నిబంధనల ప్రకారం ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వాలి. కానీ గూగుల్ పోటీ వ్యతిరేక పద్దతులను అవలంబింస్తోందంటూ సీసీఐ ఈ జరిమానాను విధించింది.
గత కొన్ని రోజులుగా గూగుల్ పై యాంటీ ట్రస్ట్ ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. సెర్చ్ ఇంజిన్ పేజీతో పాటు.. న్యూస్ కేటగిరీల్లో ఉచితంగా వార్తలను ప్రచురించుకునేందుకు గూగుల్ అవకాశం కల్పిస్తున్న సంగతి తెలిసందే. దానికి ఆయా న్యూస్ పోర్టళ్లలో యాడ్స్ ఇస్తుంది. వీటికి సంబంధించిన ఆదాయాలను సదరు మీడియా సంస్థలకు పంచడంలో గూగుల్ అనైతిక పద్ధతులను అవలంబిస్తోందంటూ ఇటీవల సీసీఐకి ఫిర్యాదులు అందాయి. డిజిటల్ న్యూస్ పబ్లికేషన్స్ , ఇండియన్ న్యూస్ పేపర్ అసోసియేషన్ ల నుంచి ఫిర్యాదుల అందినట్లు సీసీఐ పేర్కొంది. వీటితో పాటు.. న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ కూడా సీసీఐకు ఫిర్యాదు చేసింది.
యాంటి ట్రస్ట్ సేవలు అనేది గూగుల్ కేవలం భారత్ లోనే కాదు.. యూరప్, యూఎస్ఏ, కెనడా, ఆస్ట్రేలియాల్లో కూడా నమోదు కావడం గమనార్హం. దీంతో గూగుల్ పై సీసీఐ పిడికిలి బిగించింది. తాజాగా ఈ జరిమానాను విధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Google, Google Drive, Google search, Penalty