బిగ్ బ్రేకింగ్: సీబీఐ పంజా...1000 మంది ఆఫీసర్లతో...బ్యాంకులను ముంచిన బడాబాబులపై రైడ్స్

ఈ దాడులు మొత్తం 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న పలు సంస్థలు, వ్యక్తుల నివాసాలపై కొనసాగుతున్నాయి. దాదాపు రూ.7,000 కోట్ల మేరకు 35 బ్యాంకులను మోసపోయిన కేసుల్లో సీబీఐ ఈ దాడులు జరిపినట్టు ఆ సంస్థ వర్గాల సమాచారం.

news18-telugu
Updated: November 5, 2019, 10:44 PM IST
బిగ్ బ్రేకింగ్: సీబీఐ పంజా...1000 మంది ఆఫీసర్లతో...బ్యాంకులను ముంచిన బడాబాబులపై రైడ్స్
ఉదయం ఆరు గంటలనుండి సోదాలు జరుగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల లో తన నివాసాలపై సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 11 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు జరుగుతున్నాయి.
  • Share this:
దేశ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులను పలు సంస్థలు, వ్యక్తులు మోసం చేసి నిధులు దారిమళ్లింపు కేసుల్లో సీబీఐ మంగళవారం దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించింది. ఈ దాడులు మొత్తం 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒకే సమయంలో ఆరోపణలు ఎదుర్కొన్న పలు సంస్థలు, వ్యక్తుల నివాసాలపై కొనసాగుతున్నాయి. దాదాపు రూ.7,000 కోట్ల మేరకు 35 బ్యాంకులను మోసపోయిన కేసుల్లో సీబీఐ ఈ దాడులు జరిపినట్టు ఆ సంస్థ వర్గాల సమాచారం. ఏపీ, తెలంగాణతో సహా, ఛండీగఢ్, ఢిల్లీ, గుజరాత్, హర్యానా, కర్ణాటక. కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, దాద్రా అండ్ నగర్ హవేలీ సహా మొత్తం 190 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సోదాల్లో దాదాపు 1000 ఆఫీసర్లు పాల్గొనగా, ఈ సంవత్సరంలో అతిపెద్ద సెర్చ్ ఆపరేషన్ గా భావిస్తున్నారు.

అయితే చాలా వరకూ ఈ సోదాలు మహారాష్ట్రలో 58 ప్రాంతాల్లో జరిగినట్లు గుర్తించగా, పంజాబ్ లో సైతం అత్యధికంగా 32 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఇక దేశ రాజధానిలో 12 ప్రాంతాల్లోనూ, మధ్య ప్రదేశ్, తమిళనాడులో 17 ప్రాంతాలు, యూపీలో 15, ఏపీలో 5, చండీగడ్ లో 2, తెలంగాణ, కేరళల్లో 4 చొప్పున ప్రాంతాల్లో సోదాలు జరిగాయి. ఈ సోదాల ఆధారంగా సీబీఐ అధికారులు అడ్వాంటేజ్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రమోటర్లు, శ్రీకాంత్ భాసీ, దినేష్, అర్కోట్ సెల్వరాజ్, మనీష్ కుమార్ సింగ్, గగన్ శర్మ, జిజో జాన్‌ అనే నిందితులపై కేసుల నమోదు చేశారు. వీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భోపాల్‌లో మోసపూరితంగా డాక్యుమెంట్లు పెట్టి రుణాల రూపంలో రూ. 6000 కోట్లు నిధులు పక్కదారి పట్టించినట్లు తెలుస్తోంది. సదరు కంపెనీ అగ్రో కమోడిటీస్ వ్యాపారంలో బల్క్ ట్రేడింగ్ నిర్వహిస్తుందని, బ్యాంకుకు చెల్లింపుల్లో అవకతవకలు తలెత్తడంతో దాదాపు రూ. 1266 కోట్లు బ్యాంకు నష్టపోయినట్లు గుర్తించారు.

అలాగే ఎనర్గో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్, సురానా ఇండస్ట్రీస్, జేబీఎల్ ఆగ్రో ఇండస్ట్రీస్, లాల్ సన్ జ్యువెలరీస్, నాథ్ జీ రోలర్ ఫ్లోర్ మిల్స్, ఎస్ఈఎల్, అడ్వాన్స్ సర్ఫక్టంట్స్, ఎస్కే నిట్, కృష్ణ నిట్ వేర్ టెక్నాలజీ కంపెనీలకు చెందిన ప్రమోటర్లు, అధినేతల నివాసాలు, కార్యాలయాలపై దాడులు జరిగాయి.
Published by: Krishna Adithya
First published: November 5, 2019, 10:26 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading