Lookout Notice: చందా కొచ్చర్‌కు మరో షాక్... లుక్ అవుట్ నోటీస్ జారీ చేసిన సీబీఐ

Lookout Notice: చందా కొచ్చర్‌కు మరో షాక్... లుక్ అవుట్ నోటీస్ జారీ చేసిన సీబీఐ (File Photo)

ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో చందా కొచ్చర్ పేరు కూడా ఉంది. ఆమెతో పాటు భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ దూత్‌లపైనా ఎఫ్ఐఆర్ నమోదైంది.

  • Share this:
    చందాకొచ్చర్... ఇటీవల వార్తల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. వీడియోకాన్‌కు ఐసీఐసీఐ రూ.3,250 కోట్ల రుణం కేసులో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలతో కేసులో చిక్కుకున్న చందాకొచ్చర్... దేశం విడిచి వెళ్లే అవకాశం ఉందన్న అనుమానంతో సీబీఐ లుక్ అవుట్ నోటీస్ జారీ చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఐసీఐసీఐ బ్యాంక్-వీడియోకాన్ కేసులో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లో చందా కొచ్చర్ పేరు కూడా ఉంది. ఆమెతో పాటు భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ అధినేత వేణుగోపాల్ దూత్‌లపైనా ఎఫ్ఐఆర్ నమోదైంది.

    బ్యాంకింగ్ రంగంలో చందా కొచ్చర్ పేరు అందరికీ తెలుసు. ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన ఐసీఐసీఐని కొన్నేళ్ల పాటు నడిపించిన ఆమె అత్యంత వివాదాస్పద రీతిలో వైదొలగాల్సి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. వీడియోకాన్ సంస్థకు రూ.3,250 కోట్ల రుణాన్ని మంజూరు చేసే విషయంలో వీడియోకాన్ సంస్థ నుంచి చందాకొచ్చర్‌ భర్తకు లబ్ధి చేకూరిందన్న ఆరోపణలతో ఆమె ప్రతిష్ట మసకబారింది. ఐసీఐసీఐ సీఈఓ పోస్టు నుంచి వైదొలగడం, సీబీఐ కేసు నమోదవడం, ఇప్పుడు సీబీఐ లుకవుట్ నోటీస్ జారీ చేయడం చూస్తుంటే ఆమె కెరీర్ ఏ స్థాయిలో పతనమైందో అర్థం చేసుకోవచ్చు.

    Vivo V15 Pro: 32 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరాతో వివో వీ15 ప్రో రిలీజ్


    ఇవి కూడా చదవండి:

    Jobs: పది పాసైతే వాలంటీర్ ఉద్యోగం... నెహ్రూ యువ కేంద్ర సంఘటన్‌లో 12,000 పోస్టులు

    WhatsApp Bug: మీ వాట్సప్‌లో బగ్ ఉందా? మీ ప్రైవసీకి ముప్పేనా?

    PAN-Aadhar Link: మీ పాన్-ఆధార్‌ లింకైందా? 30 సెకన్లలో తెలుసుకోండి
    First published: