చందాకొచ్చర్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు... భర్త దీపక్ కొచ్చర్‌పై సీబీఐ కేసు నమోదు

దీపక్ కొచ్చర్, వేణుగోపాల్

Chanda Kochhar Case : ప్రతిఫలానికి ప్రతిఫలం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ చీఫ్ వేణుగోపాల్‌పై ఉచ్చు బిగుస్తోంది. త్వరలో జైలుకు వెళ్తారా?

  • Share this:
కార్పొరేట్ క్రైమ్‌ కేసులు దేశ పరువు తీస్తున్నాయి. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఐసీఐసీఐ బ్యాంక్‌కి ఒకప్పుడు చీఫ్‌గా వ్యవహరించిన చందాకొచ్చర్‌పై వచ్చిన ఆరోపణలు... కార్పొరేట్ రంగాన్ని కుదిపేశాయి. తాజాగా ఈ కేసులో వేల కోట్ల రూపాయల పేరుతో... అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎుర్కొంటున్న చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ చీఫ్ వేణుగోపాల్ దూత్‌లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఔరంగాబాద్, ముంబైలోని వీడియోకాన్ ప్రధాన కార్యాలయాల్లో తనిఖీలు చేసిన సీబీఐ అధికారులు కొన్ని కీలక పత్రాల్ని తమతో తీసుకెళ్లారు. తద్వారా ఈ కేసుకు సంబంధించిన పక్కా ఆధారాలు లభించినట్లు తెలిసింది.

అసలేంటి కేసు? : కార్పొరేట్ క్రైమ్ కేసులు సామాన్యులకు ఏమాత్రం అర్థం కావు. అంత పక్కాగా స్కెచ్ వేస్తారు కొందరు అధినేతలు. అలాంటి కేసుల్లో ఇదొకటి. సింపుల్‌గా చెప్పాలంటే... వీడియోకాన్ కంపెనీ... 2012లో ఐసీఐసీఐ నుంచీ రూ.3,250 కోట్లు రుణం తీసుకుంది. అంత రుణం ఇవ్వడానికి ప్రధాన కారణం తెరవెనక జరిగిన డీల్ అని తెలుస్తోంది. రుణం తీసుకున్న వీడియోకాన్... చందాకొచ్చర్ భర్త స్థాపించిన న్యూపవర్ రెనెవబుల్స్ కంపెనీలో కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టింది. ఆ తర్వాత కొన్నాళ్లకే... వీడియోకాన్‌ కంపెనీకి ఇచ్చిన రుణాలను... నిరర్థక రుణాలుగా తేల్చేశారు చందాకొచ్చర్. ఇదంతా పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి.

గత అక్టోబర్‌లో ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి చందాకొచ్చర్ తప్పుకున్నారు. ఈ కేసులో ప్రతిఫలానికి ప్రతిఫలం కింద చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్, ఆమె కుటుంబసభ్యులు ప్రయోజనం పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. మొదట్లో చందాకొచ్చర్‌ తప్పేమీ లేదన్న బ్యాంక్ బోర్డు... ఆ తర్వాత ఓ ఏజెన్సీ ద్వారా అంతర్గత దర్యాప్తు జరిపించింది. ఆ క్రమంలో చందాకొచ్చర్‌ను సెలవుపై పంపింది. తాజాగా తాజాగా దీపక్ కొచ్చర్, వేణుగోపాల్ దూత్‌పై సీబీఐ కేసు నమోదు చేసింది. త్వరలోనే అరెస్టులు కూడా ఉంటాయని తెలుస్తోంది.

 

Video : ఖమ్మంలో ఆర్టీసీ బస్సు - లారీ ఢీ... బస్సు బోల్తా...
First published: