BOI Fraud: బ్యాంక్ ఆఫ్ ఇండియాను నిలువునా ముంచేసిన బీజేపీ యువనేత...రంగంలోకి దిగిన సీబీఐ..

మహారాష్ట్రలో బ్యాంక్ ఆఫ్ ఇండియాని మోసం చేసి ఫోర్జరీ ద్వారా నిధులను దుర్వినియోగం చేసిన కేసులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ బృందం ముంబైలోని ఐదు చోట్ల దాడులు నిర్వహిస్తోంది. ఎండి మోహిత్ కాంభోజ్ సహా పలువురిపై కేసు నమోదు చేసింది.

news18-telugu
Updated: June 17, 2020, 8:19 PM IST
BOI Fraud: బ్యాంక్ ఆఫ్ ఇండియాను నిలువునా ముంచేసిన బీజేపీ యువనేత...రంగంలోకి దిగిన సీబీఐ..
ప్రతీకాత్మకచిత్రం
  • Share this:
మహారాష్ట్రలో బ్యాంక్ ఆఫ్ ఇండియాని మోసం చేసిన ఫోర్జరీ కేసులో కేసులో సీబీఐ దూకుడు పెంచింది. నిధులను దుర్వినియోగం చేసిన ఈ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ బృందం ముంబైలోని ఐదు చోట్ల దాడులు నిర్వహిస్తోంది. సిబిఐ కేసులో అవయన్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఆ సంస్థ ఎండి మోహిత్ కాంభోజ్ పై బ్యాంక్ ఆఫ్ ఇండియా సీబీఐకి ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆ ప్రైవేట్ సంస్థ మరియు సంస్థతో సంబంధం ఉన్న డైరెక్టర్లు, యజమానులు ఇతర నిందితులుపై కేసు నమోదైంది. ఈ కేసు బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ నుండి సుమారు 67 కోట్ల రూపాయల 22 లక్షల మోసానికి సంబంధించినది. అయితే, ఈ కేసులో చాలా మంది బ్యాంక్ ఉద్యోగుల భాగస్వామ్యం ఉందని సిబిఐ బృందానికి సమాచారం అందడంతో ఇప్పటికే పలువరు వ్యక్తులపై కేసు నమోదైంది.

2013 మరియు 2018 మధ్య ఈ మోసం జరిగింది..

ఈ మోసం 2013 నుండి 2018 మధ్య కాలంలో చోటుచేసుకుంది. నిందితుడు కంపెనీ M /s అవయన్ ఓవర్సీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ముంబైలో ఉంది. సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం, ఫారిన్ బిల్ నెగోసియేషన్ లిమిట్, FB కొనుగోలు-అమ్మకాలు, ఎగుమతి ప్యాకేజింగ్ క్రెడిట్ పరిమితి వంటి అనేక అంశాల్లో మోసం జరిగింది. ఈ మోసం చేయడంలో చాలా మంది బ్యాంకర్లు, అధికారులు కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. దర్యాప్తులో ఎవరి ప్రమేయం ఉందనేది సీబీఐ తేల్చనుంది.

ఈ బ్యాంక్ మోసం కేసులో నిందితులు ఎవరు?
ఈ బ్యాంక్ మోసం కేసులో సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో, చాలా మందిని నిందితులుగా పేర్కొన్నారు, ఇందులో ప్రముఖ పేర్లు ఈ క్రింది విధంగా ఉన్నాయి -

1. మోహిత్ కంబోజ్: సిబిఐ రిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ లో ఏ 1గా మోహిత్ కంబోజ్ పేరు ఉంది. మోహిత్ కంబోజ్ బీజేపీ రాజకీయ పార్టీతో సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి, అంతేకాదు పార్టీ ప్రధాన కార్యదర్శి కూడా. ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. సిబిఐ చార్జ్ షీట్ ప్రకారం, మోహిత్ కంబోజ్ మరియు అతని సంస్థ, M / s అవయన్ ఓవర్సీస్ ప్రైవేట్ కంపెనీ బ్యాంకును తప్పుడు దారి పట్టించడంపై కేసు నమోదైంది.

2. జితేంద్ర కపూర్: జితేంద్ర మదన్జీ కపూర్ పై కూడా సిబిఐ కేసు నమోదు చేసింది. ఈ నిందితులు కంపెనీలో డైరెక్టర్లుగా పనిచేస్తున్నారు. ఈయన యుపిలోని వారణాసినివాసితులు.3. నరేష్ మదన్జీ కపూర్: నరేష్ మదన్జీ కపూర్ కూడా మెస్సర్స్ అవయన్ ఓవర్సీస్ ప్రైవేట్ కంపెనీలో మరో నిందితుడు. ఇతను కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. ముంబైలోని మహీమ్ ప్రాంతంలో ఉన్న ఎల్జె రోడ్‌లోని నరేష్ మదన్జీ నివాసం ఉంది.

4. మెస్సర్స్ కెబిజె హోటల్ గోవా ప్రైవేట్ లిమిటెడ్: సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో మెస్సర్స్ కెబిజె హోటల్ గోవా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ గురించి కూడా పేర్కొంది. ఈ సంస్థ మోసానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ సంస్థ పేరును అవయన్ ఓవర్సీస్ ప్రైవేట్ కంపెనీగా మార్చారు. అయితే, ఇప్పుడు ఈ సంస్థ అంజుమా ప్రాపర్టీ ప్రైవేట్ లిమిటెడ్ అని పేరు పెట్టారు. అంటే కంపెనీ పేరు ఒకటి కన్నా ఎక్కువ సార్లు మార్చేశారు.

5. ఇర్తేష్ మిశ్రా: నిందితుడు కంపెనీలో డైరెక్టర్. ఈ కారణంగా సిబిఐ కేసు నమోదు చేసి ఇర్తేష్ మిశ్రాకు సంబంధించిన కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఇర్తేష్ మిశ్రా ముంబైలోని మహీమ్ ప్రాంతంలో నివసిస్తున్నారు.

6. సిద్ధాంత్ బొగ్లా: సిద్ధాంత్ బొగ్లాపై సిబిఐ దర్యాప్తు ప్రారంభించింది. వారు ముంబైలోని మహీమ్ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఆ మోసం చేయడంలో ఆయన చాలా పెద్ద పాత్ర పోషించారు.

దాడులలో ముఖ్యమైన పత్రాలు లభ్యం...
సిబిఐ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న అధికారి ప్రకటన ప్రకారం, ఈ కేసులో నిందితులపై పెద్ద మొత్తంలో ఆధారాలు, పత్రాలను సిబిఐ బృందం స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు బృందం ఆ పత్రాలను శోధించడంలో నిమగ్నమై ఉంది. దీనితో పాటు, అనేక చోట్ల దాడుల సమయంలో, నిందితుల ఇళ్ళు మరియు కార్యాలయాల నుండి సిబిఐ చాలా ముఖ్యమైన పత్రాలు మరియు ఆధారాలను స్వాధీనం చేసుకుంది.

First published: June 17, 2020, 8:14 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading