Home /News /business /

CBI AND ED PLANS FOR MEHUL CHOKSI AIRLIFT RESERVES A LONG RANGE AIR INDIA FLIGHT BA

PNBScam: మెహుల్ చోక్సీ ఎయిర్ లిఫ్ట్: సీబీఐ, ఈడీ మాస్టర్ ప్లాన్

మెహుల్ చోక్సీ (ఫైల్ ఫొటో)

మెహుల్ చోక్సీ (ఫైల్ ఫొటో)

పంజాబ్ నేషనల్ స్కాంలో కీలక సూత్రధారుల్లో ఒకరైన మెహుల్ చోక్సీని ‘ఎయిర్ లిఫ్ట్‌’ చేయాలని నిర్ణయించింది. మెహుల్ చోక్సీ కరీబియన్ దీవుల్లో ఉన్నట్టు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు సమాచారం అందింది.

    భారత్‌లో ఆర్థిక మోసాలకు పాల్పడి, విదేశాలకు పారిపోయిన వారి భరతం పట్టే దిశలో కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేయనుంది. పంజాబ్ నేషనల్ స్కాంలో కీలక సూత్రధారుల్లో ఒకరైన మెహుల్ చోక్సీని ‘ఎయిర్ లిఫ్ట్‌’ చేయాలని నిర్ణయించింది. మెహుల్ చోక్సీ కరీబియన్ దీవుల్లో ఉన్నట్టు సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు సమాచారం అందింది. దీంతో ఆయన్ను వెనక్కు తీసుకొచ్చేందుకు ఈ రెండు దర్యాప్తు సంస్థలు ఓ మాస్టర్ ప్లాన్ వేశాయి.

    నీరవ్ మోడీ (File)
    నీరవ్ మోడీ (File)


    మెహుల్ చోక్సీతో పాటు మరో వజ్రాల వ్యాపారి జతిన్ మెహతాను కూడా ‘ఎయిర్ లిఫ్ట్‌’ చేసేందుకు సిద్ధమయ్యారు. దీని కోసం ఓ భారీ ఎయిరిండియా విమానాన్ని రిజర్వ్ చేసినట్టు అధికార వర్గాల ద్వారా సమాచారం. మధ్యలో ఆగాల్సిన అవసరం లేకుండా, నాన్ స్టాప్‌గా సుదూర ప్రాంతాలకు వెళ్లగలిగే ఎయిరిండియా విమానాన్ని దర్యాప్తు సంస్థలు రిజర్వ్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలో సీబీఐ, ఈడీ బృందం వెస్టిండీస్ వెళ్లనుంది.

    ఎయిరిండియా విమానం (ప్రతీకాత్మక చిత్రం)
    ఎయిరిండియా విమానం (ప్రతీకాత్మక చిత్రం)


    కొన్ని కరీబియన్ దీవుల్లో డబ్బులు కట్టి అక్కడి పౌరసత్వాన్ని పొందొచ్చు. చాలా మంది ఆర్థిక నేరస్తులకు స్వర్గధామంగా మారింది. ఈ దీవుల్లో పౌరసత్వం ఉంటే 132 దేశాలకు వీసా లేకుండా వెళ్లిపోవచ్చు. మెహుల్ చోక్సీ ఆంటిగ్వా పౌరసత్వాన్ని తీసుకున్నారు. జతిన్ మెహతా సెంట్ కిట్స్ పౌరసత్వాన్ని కొనుక్కున్నారు. కరీబియన్ దీవుల్లో ఉన్న మెహుల్ చోక్సీని ఎయిర్ లిఫ్ట్ చేసి తీసుకురావడంతో పాటు వచ్చే దారిలో నీరవ్ మోదీని కూడా పట్టుకొచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.

    మేహుల్ చోక్సీకి రెడ్ కార్నర్ నోటీస్ | Interpol Issues Red Corner Notice Against Mehul Choksi Who is Holed Up in Antigua
    మేహుల్ చోక్సీ ఫైల్ ఫోటో


    కరీబియన్ దీవుల్లోని డొమినికా, సెంట్ లూసియా లాంటి దీవుల్లో రూ.70లక్షలు చెల్లిస్తే ఆ దేశ పౌరసత్వంతోపాటు పాస్ పోర్టు కూడా ఇస్తారు. అదే, సదరు వ్యక్తి భార్య లేదా భర్తకు కూడా ఆ పాస్ పోర్టు కావాలంటే డొమినికాలోరూ 1.16కోట్లు, సెంట్ లూసియాలో రూ.1.24కోట్లు చెల్లిస్తే చాలు. వేలాది కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయే బడాబాబులకు ఇలాంటివి పెద్ద కష్టం కాదు.
    First published:

    Tags: CBI, Enforcement Directorate, Mehul Choksi, Nirav Modi, PNB Scam, West Indies

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు