CBDT GUIDELINES ARE YOU BUYING GOLD AFTER THE PRICE HAS DROPPED BUT THESE TERMS ARE FOR YOU GH EVK
CBDT Guidelines: ధర తగ్గిన తర్వాత బంగారం కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ నిబంధనలు మీకోసమే..!
ప్రతీకాత్మకచిత్రం
CBDT Guidelines | యూఎస్ డాలర్ 2022 మార్చిలో 20 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరడం.. మరోపక్క భారత కరెన్సీ రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పడిపోవడంతో దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. బంగారం కొనుగోలుదారులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలన?
యూఎస్ డాలర్ 2022 మార్చిలో 20 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరడం.. మరోపక్క భారత కరెన్సీ రూపాయి విలువ జీవితకాల కనిష్టానికి పడిపోవడంతో దేశంలో బంగారం ధరలు తగ్గుతున్నాయి. దీంతో దేశీయ మార్కెట్లలో బంగారం కొనుగోలు ఆసక్తిని సృష్టించింది. ఈ సమయంలో బంగారం కొనుగోలుదారులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ నిపుణుల ప్రకారం.. దేశంలో ఎవరైనా తమ దగ్గర ఉండే బంగారు ఆభరణాలు, వాటి పరిమాణంపై ఎటువంటి పరిమితులు లేవు. అయితే వివాదాలను నివారించడం కోసం ఒక నిర్ణీత స్థాయి మించి బంగారం అభరణాలు(ఇన్వాయిస్ లేనివి) ఉంటే అధికారులు స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది.
ఆదాయపు పన్ను శాఖ (Income Tax Dept.) నిబంధనల ప్రకారం.. ఇన్వాయిస్ లేకుండా ఒక వివాహిత వద్ద 500 గ్రాముల బంగారం (Gold) ఉండవచ్చు. అదే పెళ్లికాని అమ్మాయి, పురుషుల వద్ద అయితే వరుసగా 250 గ్రాములు, 100 గ్రాముల చొప్పున ఉండవచ్చు.
పురుషులు- మహిళలకు CBDT నిర్దేశించిన బంగారం పరిమితిపై క్లియర్ వ్యవస్థాపకుడు అర్చిత్ గుప్తా మాట్లాడుతూ.. ఐటీ అధికారులు నిర్ణీత పరిమితి వరకు ఉన్న బంగారు ఆభరణాలు, నగలను స్వాధీనం చేసుకోలేరన్నారు. CBDT నిబంధనలు ఒక కుటుంబానికి చెందిన బంగారు ఆభరణాలను కవర్ చేస్తుందన్నారు. కుటుంబ సభ్యులు కాని వారి వద్ద ఉన్న బంగారు ఆభరణాలను పరిమాణంతో నిమిత్తం లేకుండా ఐటీ అధికారులు స్వాధీనం చేసుకోనే అవకాశం ఉందన్నారు.
పరిమితి కంటే ఎక్కువ బంగారు ఆభరణాలు ఉంటే.. అందుకు నగదు ఎలా సమకూర్చుకున్నారో రుజువు చేస్తే పన్ను అధికారులు దాన్ని స్వాధీనం చేసుకోరు. ఉదాహరణకు.. వారసత్వంగా బంగారు ఆభరణాలు మీ దగ్గర ఉంటే, మరణించిన వ్యక్తి ITR మద్దతు ఉన్న వీలునామా ద్వారా డాక్యుమెంటరీ సాక్ష్యాలను మీరు తప్పక చూపాల్సి ఉంటుంది. SAG ఇన్ఫోటెక్ MD అమిత్ గుప్తా మాట్లాడూతూ... బంగారం కొనుగోలుదారులు ఇన్వాయిస్ను తప్పనిససరిగా ఉంచుకోవాలని సూచించారు. ఇన్వాయిస్ లేని బంగారాన్ని ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 132 ప్రకారం సీజ్ చేయడానికి నిర్దిష్ట పరిమితులు ఉన్నాయన్నారు.
బంగారం కొనుగోలు చేస్తే, ఆ సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) ఫైల్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఆస్తి వివరాలలో బంగారాన్ని చేర్చాలని పేర్కొన్నారు. ఇన్వాయిస్ లేకుండా పరిమితికి మించి బంగారం ఉంటే, దాన్ని ఐటీ అధికారులు సీజ్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలో సెబీ రిజిస్టర్డ్ టాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ జితేంద్ర సోలంకి వివరించారు .
దేశంలో ఇన్వాయిస్ లేకుండానే పూర్వీకుల నుండి బంగారాన్ని పొందుతున్నారని.. అయితే అది ఎంత పరిమాణంలో ఉందో తెలుసుకోవడం ముఖ్యమన్నారు. పరిమితికి మించి పూర్వీకులు లేదా బంధువుల నుంచి బంగారం అదనంగా వచ్చి చేర్చినట్లయితే, ITR ఫైలింగ్ సమయంలో ఆస్తి వివరాలలో వచ్చిన బంగారం గురించి కచ్చితంగా పేర్కొనాలని సూచించారు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.