ఇండియాలో 60% పెరిగిన కోటీశ్వరులు!

వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. రూ.కోటి కన్నా ఎక్కువ ఆదాయం వస్తోందని చెప్పిన వారి సంఖ్య 2014-15లో 48,416 కాగా... 2017-18లో ఆ సంఖ్య 81,344. ఈ విభాగంలో 68% వృద్ధి కనిపించింది.

news18-telugu
Updated: October 22, 2018, 5:06 PM IST
ఇండియాలో 60% పెరిగిన కోటీశ్వరులు!
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
భారతదేశంలో కోటీశ్వరుల సంఖ్య పెరుగుతోంది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) చెబుతున్న మాట ఇది. వార్షికంగా రూ.కోటి కన్నా ఎక్కువగా ఆర్జిస్తున్న ట్యాక్స్‌పేయర్స్ సంఖ్య గత నాలుగేళ్లలో 1.40 లక్షలు పెరిగిందని సీబీడీటీ చెబుతోంది. అంతకుముందుతో పోలిస్తే ఇది 60% వృద్ధి.

"రూ.కోటి కన్నా ఎక్కువ ఆదాయం చూపిస్తున్న పన్ను చెల్లింపుదారుల(కార్పొరేట్లు, సంస్థలు, హిందూ అవిభాజ్య కుటుంబాలు) సంఖ్య పెరుగుతోంది. 2014-15లో 88,649 మంది ట్యాక్స్ పేయర్స్ తమ ఆదాయం రూ.కోటి కన్నా ఎక్కువ అని చూపించారు. 2017-18లో ఆ సంఖ్య 1,40,139. అంటే 60% వృద్ధి కనిపించింది."

సీబీడీటీ


అదేవిధంగా వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా పెరుగుతోంది. రూ.కోటి కన్నా ఎక్కువ ఆదాయం వస్తోందని చెప్పిన వారి సంఖ్య 2014-15లో 48,416 కాగా... 2017-18లో ఆ సంఖ్య 81,344. ఈ విభాగంలో 68% వృద్ధి కనిపించింది. అంతేకాదు... గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో రిటర్న్స్ ఫైల్ చేసినవారి సంఖ్య 80% పెరిగింది. 2013-14లో 3.79 కోట్ల మంది రిటర్న్స్ ఫైల్ చేస్తే 2017-18లో 6.85 రిటర్న్స్ దాఖలు చేశారు.

గత నాలుగేళ్లలో ఆదాయపు పన్ను శాఖ అధికారుల కృషి వల్లే ఇది సాధ్యమైందని చెబుతున్నారు సీబీడీటీ ఛైర్మన్ సుశీల్ చంద్ర.

ఇవి కూడా చదవండి:

నవంబర్ 20 లోపే రెడ్‌మీ నోట్ 6 ప్రో లాంఛింగ్!

షావోమీ దివాళీ సేల్‌లో ఆఫర్లివే!

వాట్సప్ డేటా బ్యాకప్: నవంబర్ 12 డెడ్‌లైన్!

కల్తీ పాలను ఎలా గుర్తించాలి? ఈ టిప్స్ ఫాలో అవండి!

నోకియా స్మార్ట్‌ఫోన్ల ధరలు తగ్గాయి!

Video: వాట్సప్ డేటా బ్యాకప్ ఎలా చేసుకోవాలి?

Photos: ఆంగ్రియా... ఇండియాలో తొలి డొమెస్టిక్ లగ్జరీ క్రూజ్!
Published by: Santhosh Kumar S
First published: October 22, 2018, 5:06 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading