ఇది మన చుట్టుపక్కల ఉండే మెకానిక్‌ల గురించి ఆలోచించవలసిన సమయం, అంతేకాకుండా రేపటిరోజు కోసం సిద్దమవడంలో వారి సహాయం అందించండి, తద్వారా వారు #NonStop గా ముందుకు సాగడంలో మనకు సహాయపడగలుగుతారు. కఠినమైన పరిస్థితులు కఠినమైన సవాళ్ళను సృష్టిస్తాయి. భారతదేశ యువత అసమానతలను అధికమించి, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడంలో ఘనతను సాధించారు. అలాగే మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో కూడా అదే ఆత్మస్థైర్యంతో ముందుకు కొనసాగుతున్నారు. సహాయం అందించే చేతులకు కొదవలేని మన దేశంలో యువ వాలంటీర్లు ఆహారం, సంరక్షణ, ఆశ్రయం అవసరమైన వారికి సహాయం అందించడంలో ఎల్లప్పుడూ ముందుంటారు. సహాయం అవసరమైన మారుమూల ప్రాంత ప్రజలకు కూడా నిస్వార్థమైన సేవలను అందించడంలో వారి ద్విచక్ర వాహనాలు వారికి ఎంతగానో సహాయపడుతున్నాయి.
ఇవి కేవలం ఇకచోటునుండి మరొకచోటుకు వెళ్లడం మాత్రమే కాదు, బాధ్యాతాభావంతో మార్పు వైపుగా వేసే అడుగులలో యువతకు వారి ద్విచక్ర వాహనం వారికి ఒక స్నేహితుడిలా ఉంటుంది. యువ భారత గుర్తింపులో ద్విచక్ర వాహనాలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తున్నాయి. కోరుకున్న గమ్యానికి చేరుకోవాలని తపనపడే ఈ తరం కోసం, నమ్మకస్తులైన మెకానిక్‌లు వారి కలల సౌధాలను చక్కగా నిర్వహిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా ఎన్నో ఏళ్లుగా మా వాహనాలను నిరంతరం రక్షించడం ద్వారా ముందుకు సాగడంలో అవి మాకు ఎంతగానో సహాయపడ్డాయి.
దురదృష్టవశాత్తు, కష్టపడి పనిచేసే ఈ మెకానిక్‌లకు ఈ సమయంలో మన సహాయం ఎంతో అవసరం.
ఈ మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ మెకానిక్లపై, వారి వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపింది. ఆరోగ్య సమస్యలు, మరియు తగ్గిన వాహనాల వినియోగం కారణంగా చాలామంది వారి దుకాణాలను తాత్కాలికంగా మూసివేయవలసి వచ్చింది. అందువల్ల ఇది మెకానిక్‌ల ఆదాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది, అంతేకాకుండా వారి భవిష్యత్తు అవకాశాలను కూడా ప్రశ్నార్ధకంగా మార్చింది. నిరంతరాయంగా ముందుకు సాగడంలో ఎల్లపుడూ సహాయపడే మెకానిక్‌లు లేకుండా, భారత ప్రయాణ అనుభవాలు ఎల్లపుడూ ఒకేలా ఉండవు.
Castrol Activ గత కొన్నేళ్లుగా మెకానిక్‌ల సంక్షేమం, మరియు వారి వృద్ధి కోసం నిరంతరం కృషిచేస్తుంది. Castrol సూపర్ మెకానిక్ అనే కార్యక్రమం భారదేశంలోని కార్ మరియు బైక్ మెకానిక్‌ల నైపుణ్యాలను పరీక్షించి, వారి జ్ఞానం మరియు ప్రతిభను ప్రదర్శించి వారికి జాతీయ గుర్తింపు లభించేలా ప్రోత్సహిస్తుంది. గత 3 సంవత్సరాలుగా, భారతదేశంలోని 2 లక్షలకు పైగా మెకానిక్‌లు Castrol నిర్వహించిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు - తద్వారా నైపుణ్యాలను పెంచుకుని, గుర్తింపును పొందాలనే వారి కోరికకు భరోసా లభిస్తుంది.
కానీ ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. మన మెకానిక్‌లకు చేయూతను అందించాలనే బలమైన కోరికతో Castrol Activ మరియు Network18 కలిసి #ProtectIndiasEngine ప్రచారాన్ని ప్రారంభించాయి. పేరుకు తగినట్లుగానే ఇది ర్యాలీ ద్వారా తమ మద్దతును ప్రకటించే ప్రచారం, ఇది మెకానిక్‌ల పట్ల మనకున్న బాధ్యత, ఆందోళన గురించి తెలిపి, ప్రతీ ఒక్కరికి తమ మద్దతును తెలియపరిచే ఒక వేదికగా నిలుస్తుంది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖుర్రానా ఈ ప్రచారంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో మాకు ఎంతగానో సహకరిస్తున్నారు. ఎంత ఎదిగినప్పటికీ, ఎన్నో ఏళ్లుగా ద్విచక్ర వాహనం నడుపుతూ ప్రముఖ యూత్ ఐకాన్ గా నిలిచిన ఆయుష్మాన్ ఖుర్రానా ముఖ్యమైన సమయాల్లో మెకానిక్‌లు తనకు ఎలా సహాయపడ్డారనే కథను పంచుకుంటారు.
దక్షిణ భారతదేశానికి చెందిన ప్రముఖ నటులు షైన్ శెట్టి, గణేష్ వెంకట్రామ్ మరియు ప్రముఖ హిందీ నటుడు రవి దుబే కూడా ఈ ప్రచారానికి మరింత మద్దతుని అందించారు.
వారి సందేశం ఎంతో సులువైనది. మెకానిక్‌లు ఎన్నో ఏళ్లుగా మన వాహనాలకు నాన్‌స్టాప్ సంరక్షణ అందిస్తూనే ఉన్నారు, కానీ #ProtectIndiasEngine మరియు మెకానిక్‌లకు సహాకారం అందించవలసిన సమయం ఇప్పుడు మనవంతు. ఈ ప్రతిజ్ఞ తీసుకోవడానికి కేవలం రెండు నిమిషాల సమయం మాత్రమే పడుతుంది, కానీ దాని ప్రభావం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది.
Castrol Activ తాను అందుకున్న ప్రతీ ప్రతిజ్ఞకు రూ. 10 చొప్పున, గరిష్టంగా రూ.50 లక్షల వరకు అందిస్తుంది. ఈ డబ్బుని సరికొత్త సాంకేతికత, సురక్షితమైన వ్యాపార పద్ధతులు మరియు పరిశ్రమల పోకడల గురించి మెకానిక్‌లకు శిక్షణ ఇవ్వడం, వారిలో అవగాహన కలిగించడం కోసం వినియోగిస్తుంది.
తమ మద్దతును ప్రకటించడానికి వినియోగదారులు కేవలం www.protectindiasengine.com లో లాగిన్ చేసి, ప్రతిజ్ఞ బటన్ నొక్కండి. ప్రత్యామ్నాయంగా వారు 7574-003-002 నెంబరుకు కూడా మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. ఇది మన ప్రయత్నాలను గుర్తించి మరియు #ProtectIndiasEngine చేయవలసిన సమయం.
ఇది ఒక భాగస్వామ్య ప్రకటన.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Automobiles, Bike, SCOOTER, Two wheeler