హోమ్ /వార్తలు /బిజినెస్ /

Health Insurance: క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ పని చేయడం లేదా.. ? డోంట్ వర్రీ. ఇలా చేస్తే చాలు.. మీకు క్లెయిమ్ వచ్చేస్తుంది ?

Health Insurance: క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ పని చేయడం లేదా.. ? డోంట్ వర్రీ. ఇలా చేస్తే చాలు.. మీకు క్లెయిమ్ వచ్చేస్తుంది ?

క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ పని చేయడం లేదా.. ? డోంట్ వర్రీ. ఇలా చేస్తే చాలు..  మీకు క్లెయిమ్ వచ్చేస్తుంది ?

క్యాష్ లెస్ ఇన్సూరెన్స్ పని చేయడం లేదా.. ? డోంట్ వర్రీ. ఇలా చేస్తే చాలు.. మీకు క్లెయిమ్ వచ్చేస్తుంది ?

హెల్త్‌ ఇన్సూరెన్స్‌(Health Insurance)ను రెండు రకాలుగా క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఒకటి రీయింబర్స్‌మెంట్‌, రెండోది క్యాష్‌లెస్‌(Cashless). రీయింబర్స్‌మెంట్‌లో ముందుగా బిల్లు మొత్తం చెల్లించి, ఆ మొత్తాన్ని తర్వాత తిరిగి పొందాల్సి ఉంటుంది.

ఇంకా చదవండి ...

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ (Health Insurance)ను రెండు రకాలుగా క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఒకటి రీయింబర్స్‌మెంట్‌, రెండోది క్యాష్‌లెస్‌(Cashless). రీయింబర్స్‌మెంట్‌లో ముందుగా బిల్లు మొత్తం చెల్లించి, ఆ మొత్తాన్ని తర్వాత తిరిగి పొందాల్సి ఉంటుంది. నెట్‌వర్క్‌లో భాగం కాని ఆసుపత్రుల కోసం, క్లెయిమ్ సెటిల్‌మెంట్ కోసం రీయింబర్స్‌మెంట్ మోడ్ ఉపయోగపడుతుంది. ఇందులో అన్ని బిల్లులు, రసీదులు, వైద్య పత్రాలను ఇన్సూరెన్స్‌ కంపెనీకి సమర్పించాలి. వారు వాటిని ధ్రువీకరించి, బ్యాంక్ ఖాతాకు చెల్లించిన మొత్తాన్ని రీయింబర్స్ చేస్తారు. అదే విధంగా క్యాష్‌లెస్ మోడ్‌ అనేది సులభమైన, వేగవంతమైన ప్రక్రియ. దీని కింద హాస్పిటల్‌(Hospital)లోని ఇన్సూరెన్స్‌ హెల్ప్‌డెస్క్‌ని సంప్రదించి, హెల్త్ ఇ-కార్డ్‌ను చూపించాలి. పాలసీ లిమిట్ వరకు బిల్లులను సెటిల్ చేయడానికి ఆసుపత్రి, ఇన్సూరెన్స్‌ కంపెనీ సెటిల్‌ చేసుకుంటాయి. క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌ను పొందేందుకు, చికిత్స పొందుతున్న ఆసుపత్రిని ఇన్సూరెన్స్‌ కంపెనీ నెట్‌వర్క్ ఆసుపత్రిగా నమోదు చేసుకోవాలి.

క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌ ప్రయోజనాలు ఏంటి?

క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌ ప్రక్రియ సులభంగా, వేగంగా ఉంటుంది. క్యాష్‌లెస్ మోడ్‌లో క్లెయిమ్ చేస్తుంటే పెద్ద మొత్తంలో నగదు కోసం ఏర్పాట్లు చేయాల్సిన అవసరం లేదు. అప్లికేషన్‌లు నింపేపని, పొరబాట్లు దొర్లితే పర్యవసనాలు ఎదుర్కొనే ప్రమాదాన్ని తప్పిస్తుంది. ఇందులో ఇన్సూరెన్స్‌ కంపెనీ నేరుగా ఆస్పత్రితో సంప్రదించి క్లెయిమ్‌కు అవసరమైన ప్రక్రియను పూర్తి చేస్తుంది.

క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌ ఎలా పని చేస్తుంది?

సాధారణంగా క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌కు ఆస్పత్రిలో చేరినప్పుడు ముందస్తు అనుమతి అవసరం. ఈ క్లెయిమ్‌ను సపోర్ట్‌ చేసే నెట్‌వర్క్‌ ఆస్పత్రిలోనే చికిత్స పొందాల్సి ఉంటుంది. ఇన్సూరెన్స్‌ కంపెనీ నెట్‌వర్క్‌ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతుంటే క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌ ఇలా చేయాలి.. ఆసుపత్రిలో ఉంటే ఇన్సూరెన్స్ డెస్క్ ద్వారా ఆసుపత్రిలో చేరాలి. వైద్యులు సూచించిన చికిత్స, చికిత్స ఖర్చు మొదలైన వాటి గురించి ఇన్సూరెన్స్‌ కంపెనీకి తెలియజేయాలి.

హాస్పిటల్ ఇన్సూరెన్స్ డెస్క్ హెల్త్ కార్డ్, ఐడెంటిటీ ప్రూఫ్, పాలసీ డాక్యుమెంట్‌లు ఇతర కొన్ని పత్రాలను సమర్పించమని అడుగుతుంది. వారు ఈ డాక్యుమెంట్‌లను నేరుగా ఇన్సూరెన్స్‌ కంపెనీకి సమర్పిస్తారు. ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతిదానిని పరిశీలించి.. వారు చెల్లించే మొత్తానికి ప్రీ ఆథరైజేషన్‌ అందిస్తుంది. ప్రీ-ఆథరైజేషన్ అనేది రోగి చికిత్స కోసం ప్రారంభంలో చెల్లించాల్సిన మొత్తం. దీని తరువాత, ఆసుపత్రిలో చేరవచ్చు. అవసరమైన చికిత్స చేయించుకోవచ్చు.

డిశ్చార్జ్ చేయడానికి ముందు, ఆసుపత్రి డెస్క్ తుది బిల్లును పరిశీలన కోసం ఇన్సూరెన్స్‌ కంపెనీకి పంపుతుంది. అన్నింటినీ పరిశీలించి ఇన్సూరెన్స్‌ కంపెనీ క్లెయిమ్‌ సెటిల్‌ చేస్తుంది. ఆస్పత్రికి ఇన్సూరెన్స్‌ చేసుకున్న వ్యక్తి ఎలాంటి నగదు చెల్లించాల్సిన అవసరం లేదు. వాస్తవానికి, ఇన్సూరెన్స్‌ పాలసీ కవర్‌ చేసిన ఖర్చులు ఏవైనా ఉంటే.. పాలసీదారుడు జేబులో నుంచి చెల్లించాలి. ఈ ప్రక్రియ చాలా సులువుగా ఉంటుంది. పెద్ద ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం వచ్చినప్పుడు, క్యాష్ ఏర్పాటు చేసుకోవడానికి పరుగెత్తాల్సిన అవసరం లేదు.

క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌ అత్యవసర పరిస్థితుల్లో పని చేయకపోవచ్చు

క్యాష్‌లెస్ క్లెయిమ్‌ అత్యవసర సేవలకు కాదని గమనించడం ముఖ్యం. పైన వివరించిన క్యాష్‌లెస్‌ ప్రక్రియ అత్యవసర ఆస్పత్రులకు కూడా వర్తింపజేయవచ్చు, సమయం కొరత కారణంగా, ఇది పని చేయకపోవచ్చు.

 ప్రీ ఆథరైజేషన్‌ పొందడానికి సమయం పట్టవచ్చు

ఇన్సూరెన్స్‌ కంపెనీలు సాధారణంగా ప్రీ ఆథరైజేషన్‌ ఇవ్వడానికి 6 నుండి 24 గంటల సమయం తీసుకుంటారు. వారు పాలసీ కవరేజీని మాన్యువల్‌గా పరిశీలిస్తారు. తీసుకుంటున్న చికిత్స పాలసీ షరతుల ప్రకారం కవర్ అవుతుందా? లేదా? వంటివి తనిఖీ చేస్తారు.

మెడికల్ ఎమర్జెన్సీ సమయంలో ఇంత కాలం వేచి ఉండలేరు. ప్రీ ఆథరైజేషన్‌ లేకుండా ఆస్పత్రులు అడ్మిషన్‌ను ప్రాసెస్ చేయవు. కాబట్టి క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌ సదుపాయం అందుబాటులో ఉన్నప్పటికీ.. ఆసుపత్రిలో అడ్మిషన్ పొందేందుకు ముందుగా ఆసుపత్రిలో నగదు చెల్లించవలసి ఉంటుంది.

ఇదీ చదవండి: US Recession: అమెరికా ఆర్థిక మాంద్యంలోకి వెళ్తే ఏమవుతుంది.. ! భారత్ పై ప్రభావం ఎలా ఉంటుందంటే..?


ఆసుపత్రిలో TPA డెస్క్ 24X7 తెరిచి ఉండదు

క్లెయిమ్‌లను 24X7 ప్రాసెస్ చేసే ఇన్సూరెన్స్‌ కంపెనీ లేదా థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్(TPA) వలె కాకుండా, క్లెయిమ్‌లను నిర్వహించే ఆసుపత్రిలో ఇన్సూరెన్స్‌ డెస్క్‌ 24X7 అందుబాటులో ఉండదు. అవి సాధారణంగా 12 గంటలపాటు పని చేస్తాయి. సెలవు దినాల్లో మూసి ఉండవచ్చు. ఆసుపత్రి డెస్క్ మూసి ఉన్న సమయంలో ఆసుపత్రిలో చేరితే, ఇబ్బందులు తప్పవు. అటువంటి పరిస్థితులలో, రోగిని అడ్మిట్ చేయడానికి, చికిత్సను ప్రారంభించడానికి ఆసుపత్రి ముందస్తు డిపాజిట్ డిమాండ్ చేయవచ్చు.

ఎలా సిద్ధం అవ్వాలి?

అటువంటి సందర్భాలలో ఎలా సిద్ధంగా ఉండవచ్చో తెలుసుకోండి..

ప్రణాళికాబద్ధమైన చికిత్సల విషయంలో..

చికిత్స ప్రణాళికాబద్ధంగా ఉంటే, ఆసుపత్రిని సందర్శించి, క్యాష్‌లెస్‌ క్లెయిమ్ కోసం ప్రక్రియను ముందుగానే ప్రారంభించవచ్చు. ఈ విధంగా క్యాష్‌లెస్‌ క్లెయిమ్‌ రిక్వెస్ట్‌ అడ్మిషన్ తేదీలో ఆమోదం పొందుతుంది. ముందస్తుగా ఎటువంటి చెల్లింపు చేయవలసిన అవసరం లేదు.

అత్యవసర నిధి, క్రెడిట్ కార్డ్ సిద్ధంగా ఉంచుకోండి

ఎల్లప్పుడూ ఎమర్జెన్సీ ఫండ్, యాక్టివ్ క్రెడిట్ కార్డ్‌ని అందుబాటులో ఉంచుకోవాలి. ఆసుపత్రిలో చేరడానికి అడ్వాన్స్ చెల్లించాల్సిన సందర్భంలో ఇవి ఉపయోగపడతాయి.

 పత్రాలను ఒకే చోట ఉంచండి

క్యాష్‌లెస్ కార్డ్, పాలసీ డాక్యుమెంట్, ఆధార్ కార్డ్ అన్ని పత్రాలను సులభంగా యాక్సెస్ చేయగల డ్రైవ్ ఫోల్డర్‌లో ఉంచాలి. కుటుంబానికి అత్యవసర పరిస్థితుల్లో కూడా అడ్మిషన్ కోసం అవసరమైన అన్ని డాక్యుమెంట్‌లకు సులువుగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది.

First published:

Tags: Health care, Health Insurance, Hospitals, Mediclaim

ఉత్తమ కథలు